Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కార్తీకమాసంలో ఈ రాశి వారికి అన్ని అదృష్టాలే.. డిసెంబర్ 1 వరకు తిరుగుండదు? ఇందులో మీ రాశి ఉందా?
సాధారణంగా కార్తీకమాసంలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు. శుభకార్యాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, వంటివి చేస్తూ ఉంటారు. అయితే శుభ కార్యాలయాలకు కారణమైన గురు, శుక్రులు ఈ కార్తీకమాసంలో పరివర్తనం చెందుతున్నారు. అలాగే ఇతర గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడంతో పలు రాశుల వారి జీవితం చాలా బాగుంటుంది. ఈ నెలంతా ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారికి ఈ కార్తీకమాసంలో బాగుటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ ఏ రాశుల వారికి కార్తీకమాసంలో బాగుంటుందంటే?
మేషం: ఈ రాశి వారికి కుటుంబ స్థానంలో గురువు, భాగ్య స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ మేష రాశివారికి సంపన్నమైన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలూ కూడా చాలా బాగుంటాయి. ఈ రాశి వారికి సొంత ఇంటి కల నెరవేరనున్నట్లు తెలుస్తోంది. వృత్తి, వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో కూడా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. సమాజంలో కూడా ఈ రాశి వారికి గుర్తింపు పెరుగుతుంది.

వృషభం: ఈ రాశివారికి గురు, శుక్రులు.. అష్టమ, దశమ స్థానంలో సంచరిస్తున్నారు. దీని కారణంగా వృషభ రాశి వారికి ప్రేమ పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులకు పెళ్లి ఖరారయ్యే ఛాన్సుంది. ఆకస్మికంగా ధన ప్రాప్తి చెందే అవకాశం ఉండడంతో పాటు ఆస్తుల విలువ పెరగనుంది. సొంత ఇంటి కల కూడా నెరవేరే ఛాన్సుంటుంది. వృత్తి, వ్యాపారాలు చెందడంతో పాటు వ్యాపారాల్లో అనూహ్యమైన లాభాలు చేకూరనుంది.
మిథున రాశి: ఈ రాశి వారికి వ్యయ స్థానంలో గురువు, సప్తమ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. అలాగే పెళ్లి ఘడియలు చాలా బాగా కనిపిస్తున్నాయి. కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసే ఛాన్సుంటుంది. వ్యయ స్థానంలో గురువు సంచరిస్తుండడం వల్ల.. ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. దీంతో ఆర్ధిక సమస్యలన్నీ తీరిపోయి, మంచి జీవితం ఉండనుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది.
కన్య: ఈ రాశి వారికి నాలుగో స్థానంలో శుక్రుడు, భాగ్య స్థానంలో గురువు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి దగ్గరి బంధువులకు సంబంధించిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదరనుంది. ఈ రాశి వారి సొంత ఇంటి కల నెరవేరుతుంది. గృహ, వాహన యోగాలకు సంబంధించిన చేపట్టే ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటుంది.
వృశ్చికం: ఈ రాశి వారికి శుక్రుడు కుటుంబ స్థానంలో, గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నారు. దీని కారణంగా వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా రాజయోగం పట్టనుంది. అలాగే కలలో కూడా ఊహించని వ్యక్తితో పెళ్లి కుదిరే అవకాశం ఉంటుంది. రెండు ధన యోగాలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. మంచి కుటుంబానికి చెందిన ప్రేమలో పడే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అనుకోని విధంగా లాభాలు చేకూరనున్నాయి. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి.
కుంభం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు, చతుర్థ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. దీని కారణంగా ఈ రాశి వారికి వివాహయోగం పట్టనుంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సొంతింటి కల నెరవేరుతుంది. ఈ రాశివారికి ఈ కార్తీకమాసంలో భోగభాగ్యాలు కలగనున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications