Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ 3 రాశుల వ్యక్తులతో చాలా చాలా జాగ్రత్త..వీళ్లతో స్నేహం చేస్తే పెద్ద ప్రమాదం గ్యారెంటీ!
ఎవరి జీవితంలో అయినా స్నేహం అత్యంత ముఖ్యమైన, అవసరమైన సంబంధం. మంచి స్నేహితులు ఉంటే చాలు అదే కోట్ల రూపాయల విలువైనంత గొప్ప సంపద. ఎందుకంటే కష్ట సమయాల్లో మీకు అండగా, ముఖంలో చిరునవ్వును తీసుకొస్తారు స్నేహితులు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి స్నేహితులను కోరుకుంటారు కానీ వారు మంచి స్నేహితులా కాదా అనేది ఒక పెద్ద ప్రశ్నార్థకం. ఎవరైనా ఎలాంటి స్నేహితుడిగా ఉంటారో వారి వ్యక్తిత్వాన్ని బట్టి నిర్ణయించబడుతుంది.
ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వారి జన్మ రాశిని తెలుసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు చాలా చెడ్డ స్నేహితులను చేసుకుంటారు. వారితో స్నేహం చేయడం చాలా కష్టం, సమస్యాత్మకం. ఏ రాశుల వారు చెత్త స్నేహితులను చేసుకుంటారో చూడండి.

మేషరాశి
మేష రాశి వ్యక్తులు మొండితనానికి, విపరీతమైన పోటీతత్వానికి ప్రసిద్ధి. ఈ లక్షణాలు వీరి వ్యక్తిగత అభివృద్ధికి సహాయపడతాయి, కానీ అది వీరిని బ్యాడ్ ఫ్రెండ్ గా కూడా చేస్తుంది. మేష రాశి స్నేహితులు ఎల్లప్పుడూ శ్రద్ధను కోరుకుంటారు,కానీ ప్రతిదీ తమ డైరక్షన్ లోనే జరగాలని కోరుకుంటారు. వీరి విపరీతమైన ఆవేశపూరిత వైఖరి ఆలోచనారహిత చర్యలకు, బాధాకరమైన మాటలకు దారితీస్తుంది. మేష రాశి వారితో స్నేహం చేయాలంటే మీరు చాలా ఓపిక కలిగి ఉండాలి.. మీ ఆలోచనలను బహిరంగంగా వ్యక్తపరచాలి. మీరు వీరితో స్నేహం చేయాలనుకుంటే ఎల్లప్పుడూ వివాదాలకు సిద్ధంగా ఉండాలి.
మిథున రాశి
మిథున రాశి వారిని తెలివితేటలకు అధిపతి అయిన బుధుడు పాలిస్తాడు, కాబట్టి వీరు అద్భుతమైన సంభాషణకర్తలు, అనుకూలత కలిగి ఉంటారు. అయితే ఈ లక్షణాలే వీరిని అస్థిరంగా, స్వార్థపూరితంగా, తరచుగా మనసు మార్చుకునే అవకాశం ఉన్నవారిగా కూడా చేస్తాయి. మిథున రాశి స్నేహితులు తరచుగా తమ మనసు మార్చుకుంటారు కాబట్టి వీరిని నమ్మదగనివారిగా పరిగణించవచ్చు. వీరు నిజాయితీగా ఉండటం కష్టం, స్నేహంలో ఎప్పటికీ నమ్మకంగా ఉండరు. మిథున రాశి వారితో స్నేహం చేయడానికి ఓపిక, అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు మీలో లేకపోతే మీరు జీవితంలో కలిసే అత్యంత చెత్త వ్యక్తి వీళ్లే అవుతారంట.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వ్యక్తులు చాలా విశ్వాసపాత్రులు అయినప్పటికీ తీవ్రంగా ప్రతీకారం తీర్చుకుంటారు. వీరిలోని ఈ విభిన్న లక్షణాలు వీరిని చెడ్డ ఫ్రెండ్ మార్చగలవు. వృశ్చిక రాశి స్నేహితులు అతిగా స్వాధీనపరులుగా, సులభంగా అసూయపడేవారుగా ఉంటారు. వీరు చిన్న విషయాలకు కూడా పగ పెంచుకుని ప్రతీకారం తీర్చుకునే ధోరణిని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి స్నేహాలలో నమ్మకం చాలా ముఖ్యం..అది విచ్ఛిన్నమైన తర్వాత దానిని తిరిగి నిర్మించడం కష్టం. వృశ్చిక రాశి వారితో స్నేహం చేయడానికి నిజాయితీ చాలా ముఖ్యం. మీరు వృశ్చిక రాశి స్నేహితుడికి ద్రోహం చేస్తే మీరు మీ జీవితంలో అత్యంత ఘోరమైన శత్రువును ఎదుర్కోవడం ఖాయం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications