Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఊర్లో సమస్యలన్నీ ఆలోచించి..తెగ టెన్షన్ ఫీలయ్యే రాశులివే
కొంతమంది తరచుగా ఏదో ఒక విషయం గురించి ఆందళన చెందుతుంటారు. అది ఆందోళన చెందాల్సిన అవసరం లేని విషయం అయినప్పటికీ కారణాలు వెతుక్కుని మరీ ఆందోళన చెందుతుంటారు కొందరు. ఈ ప్రపంచం బరువు మొత్తం తమ భుజాలపై ఉన్నట్లు ఫీల్ అయిపోతుంటారు. ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడిని, ఆందోళనను అనుభవిస్తారు కానీ కొన్ని రాశుల వ్యక్తులకు ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఎప్పుడూ శాంతి ఉండదు. ఏ రాశుల వారు ఎప్పుడూ టెన్షన్ గా ఉంటారో ఇక్కడ చూడండి.
అధిక స్థాయి ఒత్తిడిని అనుభవించే రాశులివే
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులు విశాల హృదయం కలిగినవారు కానీ లోతైన భావాలు కలిగిన ఉంటారు. అందరూ శాంతి, సంతోషంగా ఉండేలా చూసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులు తమ సొంత ఆనందాన్ని, శాంతిని మరచిపోతుంటారు. తమ సొంత పనులకు లేదా అవసరాలకు వీరి దగ్గర సమయం ఉండకపోవచ్చు. ప్రతి ఒక్కరి ఆనందం, శాంతి తమ బాధ్యత అని వీరు నమ్మడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి వీరికి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సహజ స్వభావాన్ని అర్థం చేసుకుని,సమతుల్యతను కనుగొనడానికి ప్రయత్నిస్తే కొంత శాంతిని పొందవచ్చు. స్వంత విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. దానికోసం సమయం వెతుక్కోండి. ఏదైనా సంబంధంలో ఆరోగ్యకరమైన సరిహద్దులను ఏర్పరచుకోవడం ఉత్తమం అని కర్కాటక రాశి వ్యక్తులు గుర్తించాలని పండితులు తెలిపారు.

కన్య రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. తాము కోరుకున్నది వెంటనే జరగాలని భావిస్తుంటారు. వీళ్ళు ప్రతిదీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. క్రమశిక్షణ, పరిపూర్ణత మంచి వ్యక్తిత్వ లక్షణాలే అయినప్పటికీ అవి తీవ్రమైన మానసిక ఒత్తిడిని కూడా కలిగిస్తాయి. చేసే ప్రతి పనిలోనూ పరిపూర్ణతను కనుగొనాలనే కోరిక వీరిని ఉద్రిక్తతకు,మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. అనుకున్నట్లు పనులు జరగకపోతే మాత్రం వీరు ఒత్తిడికి గురవుతారు. అది వీరిని మానసికంగా బాధపెడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా తీవ్రంగా ఉంటారు. చాలా లోతుగా ఆలోచించి, అనుభూతి చెందే వ్యక్తులు. ఏ పరిస్థితిని అయినా, ఎవరితోనైనా సంభాషణను అయినా అతిగా అంచనా వేస్తారు. మితిమీరిన,లోతైన ఆలోచన ఉద్రిక్తత మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. రహస్యాలకు సమాధానాలు కనుగొనడానికి, ప్రజలను లోతుగా అర్థం చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ కొన్నిసార్లు ఈ మితిమీరిన ఆలోచన వల్ల వృశ్చిక రాశి వ్యక్తులు తమ ప్రశాంతతను కోల్పోతారు. కొన్నిసార్లు ఇతరులు తమ గురించి ఏమనుకుంటున్నారో ఆలోచించడం వల్ల వీరు ఒత్తిడికి గురవుతారు. వృశ్చిక రాశి వారు వారి ఆశయాలు, కోరికలపై దృష్టి సారించి పాజిటివ్ గా ఉండాలని పండితులు తెలిపారు.ః
మకరరాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులు నిజాయితీ పరులు,కష్టపడేవాళ్లు. తమ పనిని పూర్తి చేయడానికి అర్ధరాత్రి వరకు అయినా మేల్కొని ఉండే రకం వీళ్లు. వీరి కష్టపడి పనిచేసే స్వభావం ప్రశంసనీయమైనదే అయినప్పటిక, అది కొన్నిసార్లు వీరిని మానసిక ఒత్తిడికి దారి తీస్తుంది. గెలవాలనే, తమ లక్ష్యాలను చేరుకోవాలనే నిరంతర కోరిక కారణంగా వీరికి ఎప్పటికీ శాంతి ఉండదు. మకర రాశి వారు తమ జీవితాల్లో సమతుల్యతను కనుగొనడానికి ప్రయత్నించాలి. పని గంటలు గడిచిన తర్వాత మీరు పనిని పక్కన పెట్టి విశ్రాంతి, వినోదం, ఇతర ఆనందాల కోసం సమయాన్ని వెతకడానికి ప్రయత్నించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications