Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పంచగ్రహ కూటమిలో ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
ఇప్పుడంతా పంచగ్రహ కూటమి వైపే చూస్తున్నారు. ఆ పంచగ్రహ కూటమి సమయంలో కొంత మంది రాశుల వారికి మంచి జరిగితే ఇంకొంత మంది చాలా సమస్యలను ఎదర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. పంచగ్రహ కూటమికి సంబంధించిన మరిన్ని విషేశాలను తెలుసుకుందాం.
పంచగ్రహ కూటమి ఎప్పుడంటే ?
పంచగ్రహ కూటమి ఎప్పుడనేది ఒక్కో పండితుడు ఒక్కోలా చెబుతున్నాడు. ఈ పంచగ్రహ కూటమి వల్ల నాలుగు రాశుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతున్నాయ్. ఈ నాలుగు రాశుల వారు మృత్యుంజయ హోమాన్ని చేసుకోవాలి. లేదంటే వారికి మరణం తప్పదని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే దీంట్లో వాస్తవం లేదని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు.

జ్యోతిష్యామనేది జీవితంలో భాగం, జీవితమే జ్యోతిష్యం కాదనే సత్యాన్ని గ్రహించాలని పండితులు చెబుతున్నారు. భగవంతుని అనుగ్రహం మనమీద వుంటే జాతకంలో ఎన్ని దోశాలు వున్నా అవి ఏమీ చేయలేవని అంటున్నారు.
పంచగ్రహ కూటమి రెండేళ్లకు ఒకసారి వస్తుందని అంటున్నారు. పంచగ్రహ కూటమి సమయంలో చంద్రుడు రోహిణి నక్షత్రంలో వున్నప్పుడు సూర్యుడు చంద్రుడు, బుధుడు, గురుడు, శుక్రుడు కలిసి ఐదు రాశులు వృశభరాశిలో పంచత్రహ కూటమిగా ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ పంచగ్రహ కూటమి సమయంలో మేష రాశి, వృషభ రాశి, కన్య రాశి, వృశ్చిక రాశి, కర్కాటక రాశి వారికి ప్రయోజం కలగనున్నాయ్. ఈ రాశుల వారు ఈ సమయంలో చేసే ప్రయత్నాలన్నీ ఫలిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేష రాశ
వీరి కుటుంబం సంతోషంగా వుంటుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయ్. వ్యాపారం చేసే వారికి లాభాలు కలుగుతాయ్. కాబట్టి మేషరాశి వారు నిశ్చింతగా వుండవచ్చు.
వృషభ రాశి
వృషభ రాశి వారు తమ కుటుంబంలో ఏవైనా సమస్యలను ఎదుర్కొంటుంటే వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగంలో తోటి వారి సహకారం లభిస్తుంది. సీనియర్ల నుంచి ప్రశంసలు అందుతాయ్.
మిధున రాశి
పంచగ్రహ కూటమి ప్రభావం మిధున రాశి వారిపై ప్రతికూలంగా వుంటుంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు.

కర్కాటక రాశి
పంచగ్రహ కూటమిలో ఈ రాశివారికి ఎలాంటి సమస్యలు రావు. ఉద్యోగులు ప్రశంసలను అందుకుంటారు. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు.
సింహ రాశి
ఈ రాశిలో వున్న నిరుద్యోగులకు శుభవార్త వస్తుంది. ఉద్యోగలను మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయ్.
కన్యరాశి
కన్యరాశికి చెందిన వారు పంచగ్రహ కూటమి సమయంలో కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారులైతే వారికి మంచి లాభాలు వస్తాయ్.
తులా రాశి
తాలా రాశి వారు జాగ్రత్తగా వుండాల్సిన అవసరం వుంది. వీరికి పంచగ్రహ కూటమి వల్ల మానసిక ఒత్తిడి పెరిగే పరిస్థితి వుంది.
వృశ్చిక రాశి
పంచగ్రహ కూటమి సమయంలో వృశ్చిక రాశి వారు నిశ్చింతగా వుండవచ్చు. వారికి ఎలాంటి పెద్ద సమస్యలు వచ్చే అవకాశం లేదు.
ధనుస్సు రాశి
ఆర్థిక సమస్యలు ఏవైనా ఎదుర్కొంటుంటే అవి తగ్గుతాయ్. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు.
మకర రాశి
మకర రాశి వారిలో వ్యాపారంటే వారు మంచి లాభాలను పొందుతారు. ఆరోగ్య సమస్యలు వుంటే నయం అవుతాయ్. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కుంభ రాశి
మొదలుపెట్టిన పనులు సకాలంలో పూర్తవుుతాయ్. పంచ గ్రహ కూటమి సమయంలో కుంభ రాశి వారికి మంచి ఫలితం వుంటుంది.
మీన రాశి
మీన రాశి వారు సమస్యలను ఎదుర్కొంటారు. వీరు ఏ రంగంలో వున్నా అక్కడ ఇబ్బందులు ఎదురౌతాయ్.
గమనిక : పైన చెప్పిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యుల నుంచి పండితుల నుంచి ఇంటర్నెట్ నుంచి సేకరించబడింది. పైన ఇచ్చిన సమాచారాన్ని మేము సంపూర్తిగా దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications