Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోలీ రోజు కోట్లు సంపాదించే రాశులు ఇవే.. ఎన్ని అడ్డంకులు వచ్చినా వీరికి అడ్డు ఉండదు!
ఈ సంవత్సరం హోలీ 14వ తేదీన వస్తుంది. ప్రతి ఏడాది ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరం వస్తున్న ఈ హోలీ చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. అలాగే ఈ సంవత్సరం వస్తున్న హోలీ అత్యంత ప్రత్యేకమైనదితో పాటు చాలా విశిష్ఠతో కూడినదిగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఈరోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. దీంతో పాటు అదేరోజున గజకేసరి రాజయోగం కూడా ఏర్పడుతుంది.
ఈ గజకేసరి రాజయోగం కారణంగా అన్ని రాశుల వారిపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఈ ప్రభావం కొన్నిసార్లు మంచి సూచనలు ఇప్పిస్తే మరికొన్ని రాశుల వారికి కొన్ని దుష్ప్రయోజనాలను కలిగిస్తాయి. అయితే ఈ గజకేసరి రాజయోగం కారణంగా ఏ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి? ఏ విధమైన ప్రయోజనాలు కలుగుతాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గజకేశరి రాజయోగం అంటే గురువు మరియు చంద్రుడి కలయిక
గజకేశరి రాజయోగం జ్యోతిషశాస్త్రంలో ఒక అత్యంత శక్తివంతమైన రాజయోగంగా చెప్పబడుతుంది. ఈ యోగం గురువు (బృహస్పతి) మరియు చంద్రుని కలయికతో ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో ఉండినప్పుడు గజకేశరి రాజయోగం ఏర్పడుతుంది. ఈసారి, హోలీ పండుగ రోజున చంద్రుడు వృషభ రాశిలో ప్రయాణిస్తాడు, ఈ రాశిలో ఇప్పటికే బృహస్పతి ఉన్నాడు. ఈ కలయిక వలన గజకేశరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాశి పరివర్తన, మరియు గజకేసరి యోగం కొన్ని రాశులకు ప్రత్యేకంగా అదృష్టాన్ని తీసుకొస్తుంది. వారికీ ఏ విధమైన ఫలితాలు కనపడతాయి? ఏ రాశులు అవి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అదృష్ట రాశులు:
మిథున రాశి: మిథున రాశి వారికి గజకేశరి రాజయోగం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం మిథున రాశి 12వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ సమయంలో, మిథున రాశి వారు ఆర్థికంగా విజయాన్ని సాధించవచ్చు. ఉద్యోగస్తులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఆస్తి లావాదేవీలలో లాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం ఉంటుంది. అలాగే వారు అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. దీంతో పాటు ఆర్ధిక సమస్యలన్నీ తీరిపోతాయి.
సింహ రాశి: సింహ రాశి వారికి గజకేశరి రాజయోగం కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం సింహ రాశి 10వ ఇంట్లో ఏర్పడుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి చెందిన వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారవేత్తలు వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతి కూడా సాధ్యపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు కలుగుతుంది. వారు అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి. అలాగే ఆర్ధిక స్వాతంత్రం లభిస్తుంది.
మకర రాశి: మకర రాశి వారికి గజకేశరి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. ఈ యోగం మకర రాశి 5వ ఇంట్లో ఏర్పడుతుంది. ఈ సమయంలో, మకర రాశి వారు ఆకస్మికంగా ధన లాభం పొందవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, అలాగే స్థిరాస్తులలో పెట్టుబడి పెట్టడం మంచి ఆలోచన అవుతుంది. ఈ హోలీ రోజు, ఈ గజకేశరి రాజయోగం అనేక రాశులకు అపారమైన ఆర్థిక లాభాలను తీసుకొస్తుందని చెప్పవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications