Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రాశుల వారికి ఇల్లు కట్టుకునే భాగ్యం ఎక్కువ..! మీది ఈ రాశేనా..?
ఇల్లు కొనడం చిన్న విషయం కాదు. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడూ అంటారు. చాలా మంది తమ జీవితంలో సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారు. ఏళ్ల నుంచి డబ్బును పోగు చేసుకుంటూ ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు కట్టడం ఓ సాహసం. జ్యోతిష్యానికి, ఇంటికి ఏంటి సంబంధం అనుకుంటున్నారా..? జ్యోతిష్యశాస్త్రానికి సంబంధం లేనిది అంటూ ఏదీ ఉండదు. భూమిపై ఆకాశంలో ఉండే గ్రహాలు భూమిపైనున్న మనుషులపై ప్రభావం చూపెడతాయ్. జన్మ కాలం, సమయం ఆధారంగా మనుషుల్లో రాశులు ఏర్పడ్డాయి. రాశులను బట్టి మనుషులను విభజిస్తారు. ప్రత్యేకంగా ఒ రాశికి చెందినవి ఇంకో రాశివారికి జరిగే ఆస్కారం లేదు. భిన్నరాశులకు భిన్నంగా జరుగుతాయ్. అయితే ఏ రాశివారికి ఇల్లు కట్టే యోగం వుంది. ఏ రాశివారికి ఇల్లు కట్టే సామర్ద్యం ఉందో రాశిచక్రం ఆధారంగా తెలుసుకుందాం. దీనిపై పండితులు ఏమి అంటున్నారో చూద్దాం.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఇట్టు కట్టే యోగం ఉందంటున్నారు. వీరిలో స్థిరత్వం కనబడుతుంది. అటు, ఇటు దూకకుండా ఒక మాటపై, ఒక పనిపై వాగ్దానంతో నిలబడి పూర్తి చేసే సామర్ధ్యం వృషభ రాశిలో ఉందంటున్నారు. డబ్బును ఆదా చేసే లక్షణం కూడా వృషభ రాశి వారిలో ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు. ఇదే వారిని ఇల్లు కట్టేలా చేస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఇల్లు, కుటుంబం భద్రత విషయాల్లో ఎలాంటి అడ్డంకులు లేవు. కుటంబ సభ్యులతో ఈ రాశి వారు గొడవపడకుండా సంతోషంగా మనస్పూర్తిగా ఉండడం వల్ల ఇల్లు కొట్టుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయంటున్నారు. వారి పిల్లలు పుట్టిపెద్దయ్యే వరకు వారికోసం ఓ ఇల్లు కట్టి అది వారికి ఇచ్చేలా అన్ని ఏర్పాట్లను చేసుకుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
మకరరాశి
మకర రాశి వారికి ఆశయం, క్రమశిణ, బాధ్యత ఎక్కువగా కనిపిస్తాయ్. వీరిలో కూడా కష్టపడే స్వభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. అనుకున్నది సాధించే వరకు పట్టువదలరు. ఏదైనా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని పూర్తి చేసేంతవరకు విశ్రమించరని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వీరు ఖర్చు చేయడంలో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తారు. అదే వారికి డబ్బు ఆదా అయ్యేలా చేస్తుందని అంటున్నారు. తద్వారా ఇల్లు కట్టుకోవడానికి దోహదపడుతుందంటున్నారు. మకర రాశి వారు ఖచ్చితంగా ఇల్లు కట్టుకొని తీరుతారంటున్నారు.
కన్య రాశి
కన్యా రాశి వారిలో క్రమ శిక్షణ ఎక్కువగా కనబడుతుంది. ఇదే వారి ఆర్థిక ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. దీంతో వాలు సులువుగా ఇల్లుకట్టుకొనే అవకాశం ఏర్పడుతుంది. డబ్బు ఆదా చేసే లక్షణం కూడా కన్యా రాశి వారిలో కనిపిస్తుంది. కుటుంబంతో ఉండటానికి ఇష్టపడతారు. ఇంటిని ఇంకా బాగా తీర్చి దిద్దాలని అనుకుంటారు. కుటుంబానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు.
రాశుల ప్రభావంతో పాటు కొంత స్వయంగా కృషి చేస్తే ఖచ్ఛితంగా ఈ రాశికి చెందినవారు సొంతంగా ఇల్లు కట్టుకుంటారు. గ్రాహాలు అనుకూలించినప్పుడు శుభాకార్యం కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయగలుగుతాము. పై నాలుగు రాశులకి చెందిన వారు ఇల్లు కట్టడంలో ఎక్కువగా ఆందోళనకు గురికావలసిన అవసరం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications