Latest Updates
-
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి!
వాలంటైన్స్ డే 2025.. సింగిల్ గా ఉన్న ఈ రాశుల వారికి లవర్ దొరికేస్తారు
వాలంటైన్స్ డే రోజే ఏ పక్కన చూసిన జంటలు కనబడతుంటే సింగిల్స్ ఉన్నోళ్లు మాత్రం ఆ రోజున ఇంట్లో కూర్చొని ఫీల్ అయిపోతుంటారు. ఒంటరిగా ఉండి, కలిసి ఉండాలనే కోరిక ఉన్నప్పటికీ స్నేహితురాలు లేదా ప్రియుడిని కనుగొనలేని వారికి వాలంటైన్స్ డే రోజు కొంచెం బాధగానే ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే ఒంటరిగా ఉండే కొన్ని రాశుల వ్యక్తులకు ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశుల వారు ఈ సంవత్సరం ప్రేమికుల రోజున తమ జీవిత భాగస్వామిని కనుగొంటారు. వాలంటైన్ డే 2025న ఏ రాశుల సింగిల్ వ్యక్తులకు కొత్త భాగస్వామి దొరుకుతుందో ఇక్కడ చూడండి.
మేషం
మేష రాశి వారు ధైర్యవంతులు, చాలా జిజ్ఞాస గలవారు. సాహసోపేతమైన వ్యక్తులు. ఈ రాశిచక్రానికి అధిపతి కుజుడు. ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజున మేష రాశి వాళ్ల జీవితంలో ఒక రకమైన శక్తిని నింపుకొని ఉంటారు. ఈ రాశుల ప్రేమ ఇంట్లో శుక్రుడు ఉండటం వలన ఈ వాలంటైన్స్ డే రోజున ఒంటరి ఉన్న మేషరాశి వ్యక్తులకు జీవిత భాగస్వామిని లేదా లవర్ దొరుకుతారు.

మిథునం
మిథున రాశి వారు స్వతంత్రంగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ రాశుల వ్యక్తులు ఈ వాలెంటైన్స్ డే నాడు అద్భుతమైన ఆకర్షణను ప్రదర్శిస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు ఈ రోజున అనుకూలంగా ఉండటం వలన ఈ రాశి వారు తమ భాగస్వామిని సులభంగా ఆకర్షిస్తారు. అలాగే ఈ రాశుల వారి ప్రసంగం ఇతరులను ఆకర్షించేదిగా ఉంటది కాబట్టి ఈ రాశుల వారు తమ ప్రసంగం ద్వారా తమ భాగస్వాములను ఆకట్టుకుంటారు.
సింహం
సింహ రాశి వారు అటెన్షన్, ప్రశంసలను ఇష్టపడతారు. ఈ ప్రేమికుల దినోత్సవం నాడు ఈ రాశుల వారు సాధారణం కంటే ప్రకాశవంతంగా కనిపిస్తారు. ఈ రాశి అధిపతి సూర్యుడు ఈ రోజున వారి అందాన్ని పెంచుతాడు, ఇతరుల దృష్టిని ఆకర్షిస్తారు. ఇప్పటిదాకా ఒంటరిగా ఉన్న సింహరాశి వ్యక్తులు ఈ వాలంటైన్స్ డే రోజున తన భాగస్వామిని కనుగొంటారు.
తుల
తులా రాశి వారు నిజమైన ప్రేమికులు. ఈ రాశుల వారు ఇప్పటిదాకా లవర్ ని లేదా జీవిత భాగస్వామిని కలిగి లేకుంటే ఈ ప్రేమికుల దినోత్సవం రోజున వారి జీవిత భాగస్వామిని కలుసుకోవచ్చు. ఈ రాశి అధిపతి శుక్రుడు అనుకూలమైన స్థితిలో ఉండటం వలన ఈ రాశి వారు ప్రేమికుల రోజున తమ జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంది. ఈ రాశి వారి సహజ సామరస్యం సృష్టించే సామర్థ్యం వారి ప్రేమను సులభంగా ఆకర్షించడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ రాశుల వారు ప్రేమికుల రోజున తమ ప్రియమైనవారికి తమ భావాలను వ్యక్తపరిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు.
ధనుస్సు
ధనుస్సు రాశి వారు సాహసోపేతమైన వ్యక్తులు. స్వేచ్ఛాయుతమైన స్ఫూర్తిని కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు ఈ ప్రేమికుల రోజున కొంతమంది ఊహించని వ్యక్తులను కలవడం ద్వారా వారి జీవిత భాగస్వామిని కలుసుకునే అవకాశం ఉంది. ఈ రాశిచక్రానికి అధిపతి అయిన బృహస్పతి ప్రేమికుల రోజున సంబంధాల ఇంటిని ప్రభావితం చేస్తాడు కాబట్టి ఈ రోజున వారి ప్రేమను పంచుకునే వ్యక్తిని కలిసే అవకాశం వారికి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications