Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఈ రాశులకు చెందని వారిని భరించడం చాలా కష్టం..! మీది ఈ రాశి కాదు కదా..!
ఒకరి వ్యక్తిత్వం చెప్పాలంటే కొందరు ఆ వ్యక్తి ఇంటర్వ్యూ తీసుకోనిదే చెప్పరు. కానీ జ్యోతిష్యం, వ్యక్తులకు కలుసుకోకుండానే వారి వ్యక్తిత్వాన్ని వారి రాశి చక్రం, జన్మతేదీ, జన్మించిన కాలాన్ని బట్టి చేప్పేస్తుంది వ్యక్తుల వ్యక్తిత్వాలు గ్రహాల ప్రభావం వల్ల మారుతూ వుంటాయ్. అందరూ ఒకేలా వుండరు. అన్ని రాశులు ఒకేలా ప్రవర్తించారు. జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులున్నాయ్. ఈ పన్నెండు రాశుల వ్యక్తిత్వం భిన్నంగా వుంటుంది.
ఈ పన్నెండు రాశుల్లో కొందరి రాశుల వారి వ్యక్తిత్వం చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. వారి వ్యక్తిత్వం సమస్యలను తెచ్చిపెడుతుంది. ఈ రాశులకు చెందిన వారిని డీల చేయడం చాలా కష్టం. ఈ రాశులకు చెందిన వారి వల్ల ఇతరులు మానసిక వేదనకు గురౌతారు. మరీ ఆ రాశులవారెవో తెలుసుకుందాం.
తులా రాశి
తులా రాశికి చెందిన వారు పక్కవారికి బాగా ఇబ్బందులకు గురి చేస్తూ వుంటారు. ప్రశాంతంగా వున్న వాతావరణాన్ని కూడా చాలా గందరగోళంగా మారుస్తుంటారు. వీరు మీ పక్కన వుంటే మిమ్మల్ని కూడా చాలా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. మీరు ఈ రాశివారితో చాలా జాగ్రత్తగా వుండాలి.

కుంభ రాశి
కుంభ రాశికి చెందిన వారు ఎక్కువగా ఊహల్లో విహరించేస్తూ వుంటారు. వీరు వాస్తవానికి దూరంగా ఆలోచిస్తుంటారు. దీంతో తరచుగా చిక్కుల్లో ఇరుక్కుంటారు. వీరు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఎవ్వరికీ తెలియదు. వారి కోణంలో ఆలోచిస్తే వారు చాలా మంచివారిగా వారు భావిస్తారు. కానీ ఎదుటి వ్యక్తికి చాలా ఇబ్బందిగా మారుతారు. ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారో కూడా వీరికి అవసరం వుండదు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు రహస్యాలను ఎక్కువగా మెయింటేయిన్ చేయాలని అనుకుంటారు. వీరు అసలు విషయం చెప్పకుండా పక్కవారిని ఇబ్బందులకు గురిచేస్తూ వుంటారు. ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని పక్కవారికి టార్చర్ చేస్తూ వుంటారు. అందువల్ల వృశ్చిక రాశివారితో కూడా చాలా జాగ్రత్తగా వుండాలి. వీరు ఎప్పుడూ వారికి అనుకూలంగానే పనులు కావాలని కోరుకుంటూ వుంటారు.

మిధున రాశి
మిధున రాశికి చెందిన వారు కూడా తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. వారికి ఏమి చేయాలనే స్పష్టత కూడా వుండదు. కొన్ని సమయాల్లో వీరు పక్కనున్నవారికి చాలా ఇబ్బందులకు గురిచేస్తూ వుంటారు. వీరిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీరు ప్రవర్తించే తీరు చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వుంటుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశికి చెందిన వారు చాలా రొమాంటిక్‌గా వుంటారు. వీరికి శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా వుంటుంది. వీరు అవతలి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చాలా దురుసుగా ప్రవర్తిస్తూ వుంటారు. ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టేలా చెప్పడం వల్ల ఎదుటి వ్యక్తి చాలా బాధకు గురౌతారు. అయితే కర్కాటక రాశి వారి మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు వుండవు. వీరి మాటతీరు కాస్త దురుసుగా వుంటుంది. తమకు ఏమి కావాలనే విషయాన్ని సూటిగా చెప్పలేరు. వీరి స్వభావం వల్ల వీరు చాలా మందికి దూరమవుతూ వుంటారు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు ఆలోచించకుడా ఎలాపడితే అలా మాట్లాడేస్తూ వుంటారు. మనసుకు ఏమనిపిస్తే అది చేసేస్తుంటారు. ఎవరితో మాకు పనేంటి అనే స్వభావాన్ని కలిగి వుంటారు. వీరు చెప్పాలనుకున్నది చెప్పేయడం వల్ల ఎదుటివారు చాలా ఇబ్బందులకు గురౌతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications