Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
ఈ రాశుల వారికి పొగరు చాలా ఎక్కువ..! మీకు పొగరెక్కువగా వుంటే మీ రాశి వుండొచ్చు..!
పురుషులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు, రాశులందు కొందరు రాశులు వేరయా అని అనుకోవాలి. కొన్ని రాశుల వారికి గర్వం చాలా ఎక్కువగా వుంటుంది. చచ్చే లోపు తమ పగను తీర్చుకొని చస్తారు. ప్రతీ రాశివారు ఏదో ఒక ప్రత్యేక గుణాన్ని కలిగి వుంటారన్న విషయం తెలిసిందే. కొన్ని రాశుల వారికి కోపం ఎక్కువగా వుంటుంది. కొన్ని రాశుల వారికి సిగ్గు ఎక్కువగా వుంటుంది. మరి కొన్ని రాశులవారికైతే గర్వం, పొగరు శృతికి మించి వుంటుంది. జ్యోతిష్యంలో నాలుగు రాశుల వారికి గర్వం చాలా ఎక్కువగా వుంటుంది.
ఈ రాశుల వారికి గర్వం ఎక్కువగా వున్నా వీరికి ఆత్మవిశ్వాసం చాలా వుంటుంది. తమను తాము ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోరు. తాము కూడా చాలా గొప్ప అనే భావనతో వుంటారు. మరి జ్యోతిష్యంలో ఏ రాశికి చెందిన వారికి ఈ లక్షణాలు వుంటాయో తెలుసుకుందాం.

గర్వం ఎక్కువగా వున్న రాశులు:
సింహ రాశి
ఈ రాశికి చెందిన వారు చాలా గర్వంగా వుంటారు. వీరిలో అహంకారం కూడా చాలా ఎక్కువగానే వుంటుంది. మాకు మించిన వారు ఎవరూ లేదనే భావనను కలిగి వుంటారు. ఈ రాశివారి ప్రధమ స్థానంలో సూర్యుడు వుంటాడు. అందుకే వీరు ఎక్కువ గర్వాన్ని కలిగి వుంటారు. ఈ రాశివారిని ఎవరైనా విమర్శిస్తే సహించలేరు. వీరికి అహంకారం ఎక్కువ, చాలా తక్కువ సమయంలోనే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వీరు ఎదిగినా, కొన్ని లక్ష్యాలను చేరుకున్నా వీరికి వుండే గర్వం వల్ల వీరు కిందపడిపోతూ వుంటారు. వీరు అహంకారాన్ని తగ్గించుకుంటే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా వుంటుంది. వీరిని గనుక ఎవరైనా మోసం చేస్తే వీరు తట్టుకోలేరు. వీరికి గర్వం చాలా ఎక్కువగా వుంటుంది. ఎవరైనా ఒక మాట అంటే వీరు అస్సలు తట్టుకోలేరు. వీరిని ఏమైనా అంటే అదే విషయాన్ని మనసులో వుంచుకొని వారిపై పగతీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వీరిని ఎవరైనా ఏమైనా అంటే కూడా వీరు అస్సలు సహించలేరు.

కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి కూడా గర్వం చాలా ఎక్కువగా వుంటుంది. వీరు తమను తాము చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటారు. ఎవరైతే నాకేంటి అనే స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు. వీరు ఎవరి జోలికి వెళ్లరు కానీ వీరికి జోలికి వచ్చిన వారిపై చచ్చే లోపు పగను తీర్చుకునే తత్వం వీరిది. వీరిని ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే ఇక ఇబ్బందులను గురిచేసిన వ్యక్తిని మరిచిపోరు. చచ్చే లోపు వీరు పగను తీర్చుకుంటారు. అయితే వారిది చాలా మంచి వ్యక్తిత్వం.
మేష రాశి
ఈ రాశి వారికి గర్వం ఎక్కువగానే వుంటుంది. ఎవ్వరినైనా ఎదిరించగలననే నమ్మకం ఈ రాశి వారికి ఎక్కువగా వుంటుంది. ఈ రాశివారిని రెచ్చగొట్టొద్దు, కించపరచవద్దు. నాకు మించిన మొనగాళ్లు లేరనే వ్యక్తిత్వాన్ని కలిగి వుంటారు.
గమనిక : పైన చెప్పిన వివరాలన్నీ ప్రముఖ జ్యోతిష్యల నుంచి ప్రముఖ పండితుల నుంచి సేకరించినవి మాత్రమే వీటిని మా వెబ్‌సైట్ ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications