Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
సంక్రాంతి తరువాత విజయఢంకా మోగించే రాశులు ఇవే.. చేతినిండా డబ్బే డబ్బు!
జోతిషంలో ఎప్పుడూ గ్రహాలు తమ తమ రాశులను మార్చుకుంటూ ఉంటాయి. తమ తమ రాశులను చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. ఇది ఆయా రాశుల వారిని అదృష్టవంతులు చేయడంతో పాటు పలు రాశుల వారిని తీవ్రమైన కష్టాల్లో కూడా నెట్టేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి తరువాత పలు రాశుల వారికి అన్నీ విజయాలే దక్కనున్నాయి. వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. రావాల్సిన సొమ్ము రాబట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది.
అవరోధాలు, ఆటంకాల నుంచి బయట పడేందుకు సహాయపడుతుంది. అలాగే తమ జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ కనీవినీ ఎరగని రీతిలో విజయం సాధించేందుకు ఆస్కారం ఉంది. ఇంతకీ సంక్రాంతి తరువాత ఏ రాశుల వారి జీవితం మారబోతుంది? ఏ రాశుల వారికి అనుకూలమైన కాలం ఉండబోతుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వృషభం
ఈ రాశి వారిపై శుభ గ్రహాల అనుగ్రహం పుష్కలంగా ఉంది. దీని కారణంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరమంతా ఆర్ధిక విజయాలు ఎక్కువగా లభిస్తాయి. ఇంత కాలం ఈ రాశి వారు పడుతున్న ఆర్ధిక భారం నుంచి వీరు విముక్తి పొందగలుగుతారు. ఆశ్చర్యకరంగా ఈ రాశి వారి జీవితంలో కొన్ని శుభపరిణామాలు చోటు చేసుకున్నాయి. చిరకాల కోరికలు, ఆశలు నెరవేరిపోతాయి. పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉంది.
మిథునం
ఈ రాశి వారికి సంక్రాంతి తరువాత గ్రహబలం పెరుగుతుంది. దీని కారణంగా ఈ రాశులకు చెందిన వారి జీవితంలో చాలా మంచి మార్పులు రాబోతుంది. ఇప్పటి వరకు తమ జీవితంలో ఉన్న ఆటంకాలు, అవరోధాలను ఈ రాశికి చెందిన వారు అధిగమిస్తారు. చేపట్టే ఆదాయ ప్రయత్నాల్లో విజయాన్ని సాధిస్తారు. అంచనాలకు మించి ఆదాయాన్ని సృష్టించుకోగలుగుతారు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. అలాగే కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
కర్కాటకం
ఈ రాశి వారికి ధనంతో సంబంధం ఉన్న గురు, శుక్ర గ్రహాల బలం పుష్కలంగా ఉంది. గత ఏడాది ఆర్ధిక అభివృద్ధికి చేసిన పనులన్నీ ఈ సంవత్సరం మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశి వారు సంక్రాంతి తరువాత కోరుకున్న విషయాలన్నీ జరుగుతాయి. చిరకాల కోరికలు నెరవేరుతాయి. వ్యాపారాలు చేసే వారికి కూడా భారీగా లాభాలు వస్తాయి. వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన అంశాల్లో కూడా పురోగతి ఉంటుంది.
ధనుస్సు
సంక్రాంతి తరువాత ఈ రాశి వారిలో అనేక మార్పులు వస్తాయి. ఈ రాశి వారి ఆలోచనా విధానం, ప్రయత్నాలు మారిపోతాయి. కొత్త ప్రాధాన్యతలు ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం కూడా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. సంపదలు, భోగభాగ్యాలను సంబంధించిన కళలు సాకారమవుతాయి. ఆస్తి సమకూర్చుకోవడంతో పాటు జీవన శైలిని పూర్తిగా మార్చుకుంటారు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.
కుంభం
ఈ రాశి వారికి గురు, శుక్ర గ్రాహాల వంటి ధనానికి సంబంధించిన గ్రహాలు అనుకూలంగా మారడం వల్ల ఈ రాశి వారికి ఈ కొత్త ఏడాది అంతా అనుకూలంగా మారుతుంది. ఈ రాశి వారి ప్రతిభాపాటవాలు, సమర్ధత బాగా వెలుగులోకి వస్తుంది. భారీ జీతంతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. అనుకున్న విధంగా ఈ రాశి వారి చిరకాల కోరికలు నెరవేరుతాయి. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అనుకున్న పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సిరిసంపదలు భారీగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగాల్లో ఉన్నత పదవులు లభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications