Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దీపావళి తరువాత ఈ రాశుల వారి జీవితాలు మారనున్నాయి.. అందులో మీ రాశి ఉందా?
నవంబర్ 1వ తేదీ నుంచి 15వ చంద్రుడు సంచారం మొదలుపెట్టనున్నాడు. వృశ్చిక రాశి నుంచి మేష రాశి వరకు సంచారం ఉండనుంది. దీని కారణంగా పలు రాశుల వారి జాతక బలం పెరగనుంది. దీని కారణంగా పలు రాశుల వారికి చాలా అనుకూలమైన కాలం ఉండనుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే ఆ రాశులు ఏంటి? ఏ రాశుల వారి జీవితంలో మార్పులు రాబోతున్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
మేష రాశి: ఈ రాశి వారికి చంద్రడు చతుర్ధాధిపతి. అలాంటి చంద్రుడు మేష రాశి వారికి చాలా అనుకూలంగా మారనున్నాడు. దీని కారణంగా మేష రాశి వారికి చాలా అనుకూలమైన కాలం ఉండనుంది. మేష రాశి వారికి సొంతింటి కల నెరవేరే అవకాశం ఉంటుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

మిథునం: ఈ రాశికి చంద్రుడు ధనాధిపతి. అలాంటి చంద్రుడు ఈ రాశిలో సంచరించనున్నాడు. దీని కారణంగా మిథున రాశి జాతకుల ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడనున్నాయి. ఆదాయ మార్గాలు పెరిగి, డబ్బు సమస్య లేకుండా చేస్తుంది. ఉద్యోగంలో వేతనాలు పెరగనున్నాయి. పదోన్నతులు లభించనున్నాయి. సమాజంలో మాటకు విలువ పెరుగుతుంది. అలాగే సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు తొలిగిపోతాయి.
కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు.. ఈ రాశి వారికి చాలా అనుకూలంగా మారనున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశి వారికి సమాజంలో గుర్తింపు లభించనుంది. ఆర్ధిక సమస్యలు తొలిగిపోతాయి. ఆదాయ మార్గాలు పెరగనున్నాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటు సమాజంలో కూడా ఈ రాశి వారి ప్రాధాన్యత పెరగనుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరగనున్నాయి. దీని కారణంగా అనేక మార్గాల నుంచి డబ్బు అందనుంది. ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉండనుంది. జీవనశైలి మారిపోవడంతో పాటు చాలా అనుకూలంగా మారనుంది.
కన్య: ఈ రాశివారికి చంద్రుడు లాభాధిపతి. లాభ స్థానంలో చంద్రుడు ఈ రాశి వారికి అనుకూలంగా మారడం వల్ల.. ఈ రాశి జాతకుల జీవితం లాభదాయకంగా మారనుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దానికంటే ఎక్కువ మొత్తంలో లాభాలను గడిస్తారు. లాభదాయక పరిచయాలు ఏర్పడనున్నాయి. భూమి పొందే అవకాశం ఉంది. తండ్రి తరపున రావాల్సిన ఆస్తులు కూడా దక్కనున్నాయి. కుటుంబంలో సమస్యలు సమిసిపోయి, సుఖమైన జీవితం గడుపుతారు.
వృశ్చికం: ఈ రాశివారికి చంద్రుడు భాగ్యాధిపతి. అలాంటి చంద్రుడు ఈ రాశి వారికి లాభ స్థానంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా వృశ్చిక రాశి జాతకులకు ఆకస్మిక ధన ప్రాప్తి జరగనుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఇతర దేశాల వ్యక్తులతో సంబంధాలు ఏర్పడనున్నాయి. ఇది లాభదాయకంగా మారి, ఆర్థికంగా బాగా బలపడే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు కుదిరి, పెళ్లి జరిగే అవకాశం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అన్ని వైపుల నుంచి ఈ రాశి వారికి సహకారం అందుతుంది.
మకరం: ఈ రాశి వారికి సప్తమ స్థానంలో అనుకూలమైన వాతావరణంలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా ఉన్నతమైన కుటుంబంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. వ్యాపారంలో భాగస్వాముల నుంచి అనుకూలమైన నిర్ణయాలు వెలువడనున్నాయి. ఉద్యోగాలు మారే అవకాశం కనిపిస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఆకస్మిక లాభాలు రానున్నాయి. ఏ కార్యక్రమం తలపెట్టినా అది విజయవంతమై తీరుతుంది. ఆరోగ్యం సానుకూలంగా ఉండడంతో పాటు ఏ పనికైనా సహకరిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications