Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
హోలీ నుంచి ఈ 6 రాశుల వారు 56 రోజులు అత్యంత కీలకం.. జీవితం టర్న్ అవ్వడం ఖాయం!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అనేది అత్యంత కీలకం. గ్రహాలన్నీ తమకు అనుకూలంగా, ఒక నిర్దిష్టమైన కాలంలో తమ రాశులను, తమ తమ నక్షత్రాలను మార్చుకుంటూ ఉంటాయి. దీని కారణంగా కొన్నిసార్లు ప్రత్యేకమైన యోగాలు ఏర్పడితే, కొన్ని రాసులు కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల 29న శని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి మారనున్నాడు. అలాగే మే 25న గురువు వృషభ రాశి నుంచి మిథున రాశి లోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పులు మార్చి 29 నుండి మే 25 వరకు 56 రోజుల సమయంలో కొన్ని రాశుల వారికి కీలకంగా మారిపోతాయి. అయితే శనీశ్వరుడి ఈ మార్పు కారణంగా ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది? ఏ రాశుల వారికి చెడు ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మిథునం: శని ఈ రాశి యొక్క దశమ స్థానంలోకి ప్రవేశించనున్నాడు. అలాగే గురువు అదే రాశిలోకి మారుతున్నాడు. దీంతో మిథున రాశికి చెందిన వ్యక్తులకు భారీగా ఆదాయం పెరిగే అవకాశాలు ఉండవచ్చు. అయితే, వృత్తి లేదా ఉద్యోగంలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కెరీర్ పై దృష్టి పెట్టడం, ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించడం అత్యంత అవసరం. వ్యాపార వృద్ధికి కావలసిన చర్యలు తీసుకోవడం ముఖ్యం. నిరుద్యోగులు అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.

కర్కాటకం: ఈ రాశివారికి శని మార్పు వల్ల అష్టమ శని దోషం తొలగిపోతుంది. అయినప్పటికీ, గురువు వ్యయ స్థానంలోకి ప్రవేశించడం వల్ల వృథా ఖర్చులు పెరగవచ్చు. అందువల్ల, ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని పెట్టుబడుల రూపంలో భద్రపరచడం, ఫిక్సెడ్ డిపాజిట్లు పెట్టడం లేదా ఆస్తులు కొనడం ఉత్తమం. దీని ద్వారా భవిష్యత్తులో ఆర్థిక భంగాలు నివారించవచ్చు.
వృశ్చికం: శని మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. దీంతో ఉద్యోగ సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉంది. వృత్తిలో మంచి అవకాశాలు రావచ్చు. కానీ, గురువు అష్టమ స్థానంలోకి మారడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల, ప్రస్తుత ఆదాయాన్ని వృద్ధి చేయడం, దానిని భద్రపరచడం ముఖ్యం.
ధనుస్సు: శని మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతుంది. దీంతో ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు కూడా తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వీటి మీద జాగ్రత్తగా ముందుగానే చర్యలు తీసుకోవడం మంచిది. గురువు సప్తమ స్థానంలోకి మారడం వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి, కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది.
మకరం: ఈ రాశివారికి శని మార్పుతో ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. దీంతో ఉద్యోగంలో, వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు రావచ్చు. అయితే, గురువు ఆరవ స్థానంలోకి మారడంతో ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల, ప్రస్తుత ఆదాయాన్ని జాగ్రత్తగా మదుపు చేయడం, వృథా ఖర్చులను తగ్గించడం అవసరం.
కుంభం: శని ఈ రాశి ధన స్థానంలోకి ప్రవేశించడంతో చేతిలో డబ్బు తగ్గే అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటే ఫలితం తక్కువగా ఉండే పరిస్థితి ఏర్పడవచ్చు. ఉద్యోగంలో కొన్ని సమస్యలు కూడా రావచ్చు. కానీ, గురువు పంచమ స్థానంలోకి మారడంతో ఆదాయం పెరుగుతుంది. ఈ సమయంలో ఉద్యోగం, ఆదాయం పట్ల జాగ్రత్తగా ఉండడం, ఆదాయాన్ని సక్రమంగా మదుపు చేయడం ముఖ్యం. ఈ సమయం మొత్తం చాలా కీలకమైనది, అందువల్ల ఈ రాశుల వారు జాగ్రత్తగా, సడలింపుగా వ్యవహరించి, తమ ఆర్థిక మరియు ఉద్యోగ సంబంధిత పరిస్థితులను మెరుగుపరచుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications