Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఏ రాశి వారు.. ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ప్రమాదం..!
ప్రేమ పెళ్లికి సంబంధించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇవి జీవితంలో చాలా కీలక నిర్ణయాలు. ఒక్కసారి వివాహమైతే ఇక ఎన్ని సమస్యలు వచ్చినా సరే అదే బంధంలో కొనసాగాల్సిన అవసరం వస్తుంది. జ్యోతిష్యం సహాయం తీసుకుంటే ఏ రాశి వారికి ఏ రాశివారు సరిపోతారు. ఏ రాశికి చెందినవారికి వారు వివాహం చేసుకోవద్దు లాంటి అన్ని విషయాలను జ్యోతిష్యం చెబుతుంది. జ్యోతిష్యంలో వున్న మొత్తం 12 రాశుల వారికి ఏ రాశివారు వివాహానికి అనుకూలంగా వుంటారో తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశికి చెందిన వారు కర్కాటక రాశివారికి వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే మేష రాశివారి వ్యక్తిత్వం స్వేచ్ఛా విహంగిలా వుంటే కర్కాటక రాశివారు చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇరువురు కలవవద్దు.
వృషభం
వృషభ రాశికి చెందిన వారు సింహరాశి వారికి దూరంగా వుండాలి. దీనికి కారణం.. వృషభరాశి వారు కొంత నెమ్మది మనస్తత్వమైతే సింహరాశివారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇద్దరి వ్యక్తిత్వం భిన్నంగా వుంటుంది. ఇద్దరూ సర్దుకుపోతేనే వారి బంధం కలకాలం నిలుస్తుంది.

మిధున రాశి
మిధున రాశి వారు మీన రాశివారితో ఎట్టిపరిస్థితుల్లో కలవవద్దు. లేదంటే ఇద్దరికీ బాగా ఘర్షణలు చెలరేగుతాయ్. మిధున రాశి వారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మీన రాశివారు మనసుకి తోచిన నిర్ణయాల్ని తీసుకుంటారు. ఇద్దరు కలిస్తే సమస్యలు చాలా ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశికకి మేషరాశితో ఎక్కువగా గొడవలు వస్తుంది. ఈ రెండు రాశులూ కలవడానికి ప్రయత్నం చేయవ్దు. కర్కాటక రాశివారు చాలా సున్నితమైతే మేషరాశికి చెందిన వారు విచ్చలవిడి మనస్తత్వం కలవారు.
సింహరాశి
వృషభ రాశికి సింహరాశి పడదన్న విషయం మనకు తెలిసిందే. సింహరాశికి చెందిన వారు స్వేచ్ఛగా బ్రతుకుతూ నిర్ణయాలు తీసుకుంటూ వుంటారు. వృషభ రాశివారు ఈ విషయంలో చాలా నెమ్మదిగా వుంటారు. ఇద్దరి భిన్న మనస్తత్వాలు కలిస్తే చాలా ప్రమాదకరం.
కన్య రాశి
కన్య రాశికి చెందిన వారు ధనుస్సు రాశికి చెందిన వారిని విహాహం చేసుకోవద్దు. కన్య రాశి వారు లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ధనుస్సు రాశికి చెందిన వారు మనసులో తోచిన పనిని చేసుకుంటూ పోతుంటారు.
తులా రాశి
తులా రాశి వారు, మకర రాశి వారు వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే తులా రాశి వారు సమాజంలో అందరితో కలిసిపోతూ వుంటూంటే మకర రాశి వారు తమ కెరీర్‌లో బిజీగా వుండి ఇలాంటి వాటికి చోటు ఇవ్వరు. ఇద్దరూ వివాహం చేసుకుంటే సమస్యలు ఖచ్ఛితంగా వస్తాయంటున్నారు.
వృశ్చికం
వృశ్చిక రాశికి చెందిన వారు కుంభ రాశి వారికి పెళ్లాడవద్దు. బంధంలో ప్రైవసీ, నిజాయితీ వుండాలని మీరు కోరుకుంటారు. కానీ కుంభ రాశి వారి వ్యక్తిత్వం భిన్నంగా వుంటుంద. కుంభ రాశి వారికి భావోద్వేగాలు ఎక్కువగా వుండవు.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి చెందిన వారు కన్యరాశి వారితో వివాహం చేసుకోవద్దు. ధనుస్సు రాశికి చెందిన వారు సాహసాలు చేయాలనుకుంటారు, కన్యారశికి చెందిన వారు దీనికి భిన్నంగా వుంటారు.
మకర రాశి
మకరరాశికి చెందిన వారు తులా రాశి వారికి వివాహం ఆడవద్దు. మకర రాశి వారికి ఒంటరిగా వుండటం ఇష్టమైతే తులా రాశి వారికి బయట వుంటే చాలా మందిని పరిచయం చేసుకోవడానికి మొగ్గు చూపుతారు.
కుంభ రాశి
కుంభ రాశకి చెందిన వారు వృశ్చిక రాశి వారిని ప్రేమించవద్దు. కుంభరాశి వారు ఎక్కువగా బయట తిరగడానికి ఇష్టపడతారు. వృశ్చిక రాశికి చెందిన వారు తమ ప్రపంచంలో తాము బ్రతుకుతూ వుంటారు.
మీన రాశి
మీన రాశికి చెందిన వారు మిధున రాశి వారిని వివాహం చేసుకోవద్దు. ఎందుకంటే మీనరాశి వారు మనసుకు ఎక్కువగా ఉపయోగిస్తే మిధున రాశి వారు మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications