Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
ఈ రాశుల వారు డబ్బును విపరీతంగా ఖర్చు పెడతారు..! మీది ఈ రాశేనా..?
ప్రతీ వ్యక్తి తన జీవితంలో ఏ లోటూ వుండకూడదని కోరుకుంటారు. దీని కోసం అహర్నిషలు కష్టపడి డబ్బు సంపాదిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఐదు రాశులవారు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు. అయితే వారు అంతే వేగంతో డబ్బులు కూడా ఖర్చు చేస్తారని శాస్త్రం చెబుతోంది. మొత్తం 12 రాశుల్లో ఐదు రాశుల వారు డబ్బు ఖర్చుల విషయంలో ముందూ వెనకా చూడరు. ఆ రాశులేవో తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారు డబ్బులు సంపాదించే విషయంలో అంత అదృష్టవంతులు కాదని చెప్పుకోవచ్చు. తమ అదృష్టంతో తక్కువ డబ్బును పొందితే ఎక్కువ డబ్బును ఖర్చు పెడతారు. తమ కోరికలను త్వరగా తీర్చుకోవాలని అనుకుంటారు. ఈ కారణం వల్ల వీరు తమ దగ్గర డబ్బు వుండడంతో వెంటనే డ్బులు ఖర్చు పెడతారు. ఎంత కష్టపడి సంపాదించినా కూడా వీరి వద్ద డబ్బు నిలవరు. మేషరాశి వారు వృధా ఖర్చులు కూడా ఎక్కువ చేస్తారు.
వృషభ రాశి
ఈ రాశివారు తమ కెరీర్ పట్ల మక్కువ చూపుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభరాశి వారు కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు. డబ్బు సంపాదించే విషయంలో మంచి విజయాన్ని పొందుతారు. శుక్రుడిని వృషభరాశికి అధిపతిగా పరిగణిస్తారు. కష్టపడి సంపాదించినా డబ్బు ఖర్చు చేయడానికి అస్సలు వెనుకాడరు. డబ్బు సంపాదనలో వెనకబడనప్పటికీ ఖర్చు విషయంలో మాత్రం అదుపు వుండదు. ఏ వస్తువులు కొనాలి, వేటిని కొనకుడా వాయిదా వేయాలనే విషయాలపై వీరికి స్పష్టత వుండదు.
సింహరాశి
ఈ రాశికి చెందిన మహిళలు బంగారం, వెండి ఆభరణాలను ఎక్కువ ఇష్టపడతారు. ఈ రాశివారికి ఎప్పుడూ డబ్బు లోటు వుండదు. సింహరాశి వారికి షాపింగ్ అంటే చాలా ఇష్టం. కొన్నిసార్లు బడ్జెట్‌కు మించిన వస్తువులను కొనుగోలు చేస్తారు. డబ్బులు తక్కువగా వున్నా మార్కెట్లో ఏదో ఒకటి కొనాలనే ఆత్రుత వీరికి వుంటుంది. జేబులు ఖాలీ చేసే గుణం వీరిది. డబ్బు ఎక్కువగా వుంటే ఆభరణాలు కొనడానికి ఎక్కువ ఇష్టపడతారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి డబ్బు లోటు వుండదు. వీరు జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారు. వీరు మంచి వ్యాపారులౌతారు. ఉద్యోగవిషయంలో కూడా మంచి స్థాయిని సంపాదిస్తారు. ఖర్చు విషయంలో వీరు వెనకాడరు. ఒక వైపు వ్యాపారం బాగా చేస్తూనే మరో వైపు ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఈ విషయంలో గనుక వీరు జాగ్రత్తగా వుంటే డబ్బును ఎక్కువగా ఆదా చేసుకున్న వారౌతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు. ఈ రాశికి చెందిన వారు తమ జీవితంలో ఎలాంటి ఆర్థిక సంక్షోభాలను ఎదర్కోరు. వీరు తమ భాగస్వామితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. తమ చుట్టూ ఎప్పుడూ అందమైన వస్తువులు ఉండాలని అనుకుంటారు. దీని వల్ల వీరు ఎక్కువ ఖర్చు చేస్తారు.
గమనిక : పైన ఇవ్వబడిన విషయాలన్నీ ప్రముఖ జ్యోతిష్యులు, పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టిపరిస్థితిలో దృవీకరించము.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
