Latest Updates
-
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.! -
ఆషాఢం బల్కంపేటలో వైభవం.. నేడు ఘనంగా ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. ‘జలదుర్గ’ విశేషాలివే.! -
వక్ర గతిలోకి శని గ్రహం.. ఈ నెల 28 వరకు ఈ 3 రాశుల వారికి కష్టాలు తప్పవు.! -
అద్భుతమైన విందు భోజనం కావాలా? అయితే ఈ కోకనట్ మిల్క్ మటన్ పులావ్ ట్రై చేయాల్సిందే -
ప్రోటీన్ రిచ్ రాగి పనీర్ పరాఠా..షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..ఈజీగా చేసుకోండిల -
పని వేళలు కాదు.. పని పూర్తయ్యేవరకు ఉండాల్సిందే.. బ్యాంకు గేటుకు తాళం వేసిన మేనేజర్.. వైరల్ వీడియో.! -
స్నానం చేసేటప్పుడు మొదట ఏ భాగంపై నీళ్లు పోయాలి.?.. ఆయుర్వేదం ప్రకారం సరైన పద్ధతి ఏంటో తెలుసా.? -
తెలంగాణలో ఘనంగా బోనాల వేడుకలు.. ఆధ్యాత్మిక రహస్యం, చరిత్ర ఇదే.! -
మదురై స్పెషల్ మటన్ దోశ.. ఇలా చేస్తే జన్మలో ఆ రుచిని మర్చిపోలేరు!
శ్రావణమాసంలో ఈ రాశులకు శివానుగ్రహం, అదృష్టం, ధనలాభం.. మీ రాశి ఉందా?
శ్రావణ మాసం శివునికి అత్యంత ప్రియమైన మాసం. ఎంతో ప్రత్యేకమైన ఈ మాసంలో పరమశివుడుని కొలిస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ మాసంలో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారా చాలా మంది భక్తులు. జులై 4వ తేదీ నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు అదృష్టం పట్టనుంది. ఆయా రాశుల వారికి ధనలాభం కూడా ఉంది. మరి ఆ రాశులు ఏవీ.. అందులో మీ రాశి ఉందో లేదో ఇప్పుడు తెలుసుకోండి.

మిథున రాశి:
ఈ శ్రావణమాసం మిథున రాశి వారికి కలిసి రానుంది. మిథున రాశి వారు ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ప్రేమికులకు, విద్యార్థులకు అదృష్టం రానుంది. అలాగే మిథున రాశి వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. దంపతుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో గొడవలు తీరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోని వ్యక్తుల మధ్య బంధం బలపడుతుంది.
వృషభ రాశి:
ఈ శ్రావణమాసం వృషభ రాశి వారికి ఐశ్వర్యాన్ని తీసుకురానుంది. ఉద్యోగులకు వృత్తిలో పురోగతి లభించనుంది. వ్యాపారులు కొద్దిగా రిస్క్ తీసుకోగలిగితే మంచి లాభాలు అందుకుంటారు. శివారాధన వల్ల మంచి జరుగుతుంది. తలపెట్టిన పనులు విజయవంతం అవుతాయి. మనస్సును పూర్తిగా లఘ్నం చేసి చేసే పనుల్లో తప్పకుండా ఫలితం కనిపిస్తుంది. ఎక్కువగా ఆలోచించకుండా కష్ట పడటంపైనే దృష్టి పెట్టడం మంచిది.
సింహరాశి:
శ్రావణ మాసం సింహ రాశి వారికి శుభంగా ఉండనుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి కలిసి వస్తుంది. అవివాహితులకు వివాహాలు జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి ఇది అద్భుతమైన సమయం. శివారాధనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది.
తులారాశి:
శ్రావణ మాసం తులా రాశి వారికి విజయంతో మొదలవుతుంది. మనస్ఫూర్తిగా తలపెట్టిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు. కష్టే ఫలి అనే సూత్రాన్ని నమ్మి కష్టాన్ని నమ్ముకోండి. ఆ పరమేశ్వరుడి ఆశీర్వాదంతో విజయం సాధిస్తారు. కుటుంబ కలహాలు ఉన్న వారికి ఈ మాసంలో అవి తొలగిపోయి మానసిక ప్రశాంతంత చేకూరుతుంది. ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే ఉద్యోగాల్లో ఉన్న వారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కష్టపడి పని చేసే వారికి తప్పకుండా గుర్తింపు దక్కుతుంది.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. శ్రావణ మాసంలో శివారాధన మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. వ్యాపారంలో లాభాలు కనిపించడం మొదలవుతుంది. ఆర్థికంగా కలిసి వచ్చే సమయం ఇది. అయితే తోటి వారికి, పేదలకు సాయం చేస్తే రెండింతలు తిరిగి వస్తుంది. కీర్తి ప్రతిష్టలూ పెరుగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications