Latest Updates
-
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.! -
సగ్గుబియ్యంతో హెల్తీ బ్రేక్‌ఫాస్ట్.. మెత్తగా, స్పాంజీలా నోట్లో వేస్తే కరిగిపోయేలా కమ్మనైన దోశలు.! -
చుండ్రు సమస్యతో పాటు జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ వారం కొన్ని రాశుల వారికి అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అనుకూలమైన గ్రహ స్థానాలతో ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యాపారంలో విజయం సాధిస్తారని అంటున్నారు. వీటితో పాటు ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. మరి ఏయే రాశుల వారికి ఈ వారం శుభసూచికంగా ఉంటుంది.. ఎలాంటి లాభాలు పొందుతారు.. ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వారం మేషరాశి, కర్కాటక రాశి, తులా రాశి, కుంభ రాశి వారికి అన్ని రకాలుగా కలిసివస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యక్తిగతంగా మొదలుకుని వివిధ అంశాల్లో ఎన్నడూ లేని సానుకూలత లభిస్తుందని అంటున్నారు. మరి ఏయే విధంగా వారు సత్ఫలితాలు పొందబోతున్నారు. చూద్దాం..
మేష రాశి
ఈ వారం మేషరాశి వారి అత్యంత శుభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యం చెబుతోంది. కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న పనులు మళ్లీ ఊపిరిపోసుకుని పురోగతి సాధిస్తాయి. మీ జీవితంలో ముఖ్యమైన పనులు ముందుకు కదులుతాయి. ప్రేమలో, వైవాహిక జీవితంలో భాగస్వామితో మధురానుభూతిని పొందుతారు. మీ భాగస్వామితో పరస్పర అవగాహన కలిగి ఉంటారు. బంధువుల్లో మతపరమైన శుభకార్యాలకు హాజరయ్యే అవకాశం ఉంది. మీ విషయంలో శత్రువులు చేస్తున్న కుట్రలు విఫలయత్నమవుతాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపవుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది. శత్రువులను ఓడించి విజయం సాధించి మీరు అనుకున్నది సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తిని పొందేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతాయి. అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబీకుల నుంచి ప్రత్యేక మద్దత లభిస్తుంది. సహకారం అందుకుంటారు. మీ ఇంటి పెద్ద ప్రత్యేక ఆశీస్సులతో ముఖ్యమైన పనుల్లో విజయాన్ని అందుకోగలరు. వారి ఆశీర్వాదంతో అనుకున్నది నెరవేరుతుంది.

తులా రాశి
ఈ వారం తులారాశి వారి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు అందుకునే సూచనలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. తద్వారా ప్రశంసలు అందుకుంటారు. మీ పాత వివాదాలు పరిష్కారమవుతాయి. కుటుంబీకులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మీకు ప్రతి అడుగులోనూ మద్దతుగా నిలుస్తారు. వారి మద్దతు, సహకారంతో మీరు అనుకున్న, చేయదలిచిన పనులను సకాలంలో పూర్తి చేయగలరు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా ఫలవంతంగా ఉంటూ శుభాలను అందిస్తున్నారు. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉండి చేసే పనిని సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించగలరు. అత్తామామల నుంచి ప్రత్యేక మద్దతు అందుకోవడం ద్వారా కుటుంబ బంధాలను బలపరుచుకుంటారు. వృత్తిపరంగా గణనీయమైన విజయం సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. కీలక సమయాల్లో మీ శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తుంది. ముఖ్యమైన పనులు ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి. వైవాహిక జీవితం ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది. వ్యక్తిగతంగా కుటుంబీకులు, స్నేహితులతో సంతోషంగా ఉంటూ సరదా సమయాన్ని గడుపుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications