Latest Updates
-
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు! -
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్లో పడిపోతారు.! -
త్వరగా ప్రెగ్నెన్నీ రావాలంటే..భార్యాభర్తలు తప్పక తినాల్సిన ఫ్రూట్ ఏది? -
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.!
ఫిబ్రవరి లో 3 ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు, ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు...
ఫిబ్రవరి లో 3 ప్రధాన గ్రహాల సంచారంలో మార్పులు, ఈ 5 రాశుల వారు అదృష్టవంతులు...
కొత్త సంవత్సరంలోని రెండవ నెల ఫిబ్రవరిలో మనం ప్రవేశించాము. జనవరిలో లాగే ఫిబ్రవరి నెలలో కూడా గ్రహాలలో మార్పులు జరగుతున్నాయి. జోతిష్యశాస్త్రం ప్రకారం 9గ్రహాలు ఎప్పటికప్పుడు తమ గమనాన్ని మార్చుకుంటూ రాశులను మారుతుంటాయి. ఇందులో మూడు గ్రహాలు తమ స్థానాలను మరియు రాశులను మార్చుకోబోతున్నాయి. ఇలా రాశులల్లో గ్రహాల మార్పులు వారి జీవితాల్లో మంచి చెడులు, లాభనష్టాలను కలిగిస్తాయి. ఫిబ్రవరిలో మూడు ప్రధాన గ్రహాలైన సూర్యుడు, శుక్రుడు, బుధుడు గ్రహస్థానాలను మారుస్తున్నాయి. ఈ గ్రహాల స్థానంలో మార్పు కారణంగా రాశులలో మార్పులు ప్రభావం మొత్తం ద్వాదశ రాశులలలో కనిపిస్తుంది.

మూడు ప్రథాన గ్రహాల్లో మరియు అన్నిగ్రహాల్లో మొదటిది బుధుడు. బుధుడు ఫిబ్రవరి 07న మకరరాశిలోకి, ఫిబ్రవరి 13న సూర్యుడు కుంభరాశిలోకి, ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. యురాజు హోదా కలిగిన బుధుడు ఫిబ్రవరి 27న కుంభరాశిలోకి వెళ్లిన మరుసటి రోజు కుంభరాశిలో అస్తమిస్తాడు. ఈ గ్రహ సంచారాల కారణంగా, ఫిబ్రవరిలో 5 రాశులకు శుభప్రదంగా, ధనలాభానికి మంచి అవకాశాలున్నాయి మరియు జీవితంలో పురోగతి, చాలా ప్రయోజనాలను తెస్తుంది. మరి ఈ 5 రాశులలో మీ రాశిచక్రం చేర్చబడిందో లేదో తెలుసుకోవడానికి ఇక్కడ చూడండి.

మేషరాశి
మేష రాశి వారికి ఫిబ్రవరి చాలా లాభదాయకమైన నెల. మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ మాసంలో అపారమైన ఆర్థిక ప్రయోజనాలు, ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. అప్పు చేసి చాలా కాలంగా అందుబాటులో లేని డబ్బు ఈ నెలలో తిరిగి వస్తుంది. ఈ నెలలో మీరు పెట్టుబడులు నుండి మంచి రాబడులను వస్తాయి. సొంతంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో తల్లిదండ్రుల పూర్తి మద్దతు లభిస్తుంది. ప్రయాణించే అవకాశం ఉంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి అద్భుతమైన మాసం. వారసత్వంగా మీకు రావలసిన పూర్వీకుల ఆస్తి లభించే అవకాశం ఉంది.శుక్రుడి ప్రభావంతో కొత్త వ్యాపార అవకాశాలొస్తాయి. వాటి ద్వారా మంచి లాభాలు వస్తాయి. అయితే నగదు లావాదేవీలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ప్రేమ, వైవాహిక జీవితం మధురంగా సాగుతుంది. ఈ నెలలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు తమ ప్రయత్నాల్లో సీనియల్ల మద్దతు పొందుతారు.

కన్యారాశి
కన్యా రాశి వారికి ఫిబ్రవరిలో గ్రహ సంచారాలు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఈ నెలలో శుభవార్తలు అందుతాయి. మీ ఇంట్లో ఆధ్యాత్మిక కార్యకలాపాలను కూడా నిర్వహించవచ్చు. దాంతో కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగార్ధులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. దాంతో డబ్బు ఆదా చేసుకుంటారు.

తులారాశి
తుల రాశి వారికి ఫిబ్రవరి చాలా లాభదాయకమైన నెల. వివాహితులకు ఈ నెలలో జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు కొన్ని తీర్థయాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు. దీని వల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. విదేశీ ప్రయాణం చేయాలనే మీ కోరిక ఈ నెల నెరవేరబోతుంది. ఈ ప్రయాణం మంచి ధనలాభాన్ని కలిగిస్తుంది.

కుంభ రాశి
గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడు ఫిబ్రవరి 13న కుంభరాశిలోకి ప్రవేసించనున్నాడు. ఈ రాశిలో ఇప్పటికే శని, శుక్రుడు నివాసం ఉంటున్నారు. సూర్యుడు మార్చి 15వ తేదీ వరకు ఇదే రాశిలో ఉండి మీనరాశిలోకి రవాణా చేయనున్నాడు. శుక్రుడు, సూర్యుడు, బుధ గ్రహాల కలయిక వల్ల మీ జీవితంలో అనేక మార్పులొస్తాయి. మీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ నెలలో పెండింగ్‌లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీరు సానుకూల ఆలోచనలతో నిండి ఉంటారు. జీవిత భాగస్వామితో అనుబంధం చాలా బాగుంటుంది.
(నిరాకరణ: పైన ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది మరియు విశ్వసనీయతకు హామీ లేదు. తెలుగు బోల్డ్ స్కై కథనానికి సంబంధించిన సమాచారాన్ని ధృవీకరించలేదు. మరియు మా ఏకైక ఉద్దేశం సమాచారాన్ని అందించడమే. దానిని ఇలా తీసుకోవాలి సమాచారం మాత్రమే. ఏదైనా సమాచారం లేదా ఊహను సాధన చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు. , దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)



Click it and Unblock the Notifications