Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
శక్తివంతమైన మూడు గ్రహాల స్థానచలనం.. ఈ 2 నెలలో ఈ రాశుల వారి పంటపండినట్లే, మట్టిని ముట్టుకున్నా బంగారమే!
జ్యోతిష శాస్త్ర ప్రకారం.. ఏప్రిల్ 13వ తేదీ రాత్రి నుండి మూడు ముఖ్యమైన గ్రహ స్ధాన మార్పులు జరిగాయి. ఈ మార్పు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఇవి చాలా శక్తివంతమైన మార్పులుగా చెప్పుకుంటున్నారు. వీటిలో మొదటిగా సూర్యుడు తన ఉచ్ఛ స్థితిలోకి ప్రవేశించటం, రెండవదిగా శుక్రుడు తన వక్రగతిని ముగించి నైజ స్థితిలోకి రావడం, మూడవది పూర్ణిమ సమయంలో చంద్రుడు సూర్యుడితో సమసప్తక దృష్టిని కలిగి బలంగా ఉండటం విశేషం. ఈ సమయంలో చంద్రునితో పాటు సూర్యుడు మరియు శుక్రుడి ప్రభావం కూడా బలంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు భావిస్తున్నారు.
ఈ గ్రహ సంఘటనలు జ్యోతిష శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి ఎంతో అనుకూలంగా మారతాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక మరియు వివాహ సంబంధిత విషయాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఏప్రిల్ మధ్య నుంచి మే నెల చివరి వరకు ఈ ప్రభావం కొనసాగుతుందని చెబుతున్నారు. ఇంతకీ గ్రహాల్లో వచ్చిన ఈ మార్పుల కారణంగా మేలు పొందే రాశులు ఏవి? వారికి ఏ విధమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శుభ ఫలితాలు పొందే రాశులు:
1. మిథున రాశి:
ఈ గ్రహల మార్పుల కారణంగా మిథున రాశివారికి ఎన్నో అవకాశాల తలుపులు తెరువనున్నాయి. ఉద్యోగాలలో పదోన్నతులు, వ్యాపారాలలో లాభాలు, ఆర్థికంగా పురోగతి వంటి శుభ వార్తలన్నీ ఈ కాలంలో సాధ్యమవుతాయి. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉండొచ్చు. వివాహ ప్రయత్నాలు కూడా సఫలమయ్యే అవకాశం ఉంది.
2. కర్కాటక రాశి:
పూర్ణ చంద్రుడి బలం కారణంగా, ఈ రాశివారికి అధిక ఆదాయం, రాజకీయ ప్రాభవం మరియు ప్రముఖులతో సంబంధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో పురోగతి, విదేశీ అవకాశాలు కూడా లభించవచ్చు. వివాహ బంధాలకూ అనుకూల కాలంగా ఇది నిలవనుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలంగా తయారవుతాయి.
3. కన్య రాశి:
శుక్రుడు, సూర్యుడు మరియు చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల కన్య రాశివారికి ఆదాయ వృద్ధి, ఉద్యోగ విజయాలు మరియు వ్యాపారాల్లో అభివృద్ధి సంభవిస్తుంది. జీవిత శైలి లోనూ మంచి మార్పులు రావచ్చు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఏర్పడవచ్చు. అన్ని విధాలుగా ఈ రాశి వారికి మంచి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
4. తుల రాశి:
ఈ కాలంలో తుల రాశివారు అప్రతిహత విజయాలను పొందే అవకాశం ఉంది. ధన లాభాలు, విదేశీ అవకాశాలు, ఉద్యోగంలో అభివృద్ధి వంటి విషయాల్లో శుభ సూచనలు కనిపిస్తున్నాయి. ఆస్తి విలువ కూడా పెరుగుతుంది.
5. ధనుస్సు రాశి:
ఈ రాశివారికి ఈ కాలం భాగ్యవంతమైనదిగా మారనుంది. గ్రహ బలంతో వృత్తి, సామాజిక, ఆర్థిక రంగాల్లో ప్రగతి చేకూరుతుంది. కుటుంబంలో సంతోషకర పరిణామాలు చోటు చేసుకుంటాయి.
6. కుంభ రాశి:
ధన మరియు అదృష్ట స్థానాలలో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారు ఏ పని చేపట్టినా విజయవంతమవుతారు. ఉద్యోగాలలో ప్రమోషన్లు, విదేశీ సంపాదన అవకాశాలు, ఆర్థిక స్వేచ్ఛ వంటి ఫలితాలు దక్కే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications