Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ రత్నం ధర చాలా తక్కువే కానీ చాలా పవర్ ఫుల్..పెట్టుకుంటే ధన ప్రవాహం ఆగదు,కష్టాలన్నీ షెడ్డుకే!
రత్నాలు అనగానే మనకు వజ్రాలు, కెంపులు, నీలాల వంటి అత్యంత ఖరీదైనవి గుర్తుకొస్తాయి. కానీ తక్కువ ఖర్చుతోనే వాటికి సమానమైన శక్తివంతమైన ఫలితాలను ఇచ్చే ఒక ఉపరత్నం ఉందని మీకు తెలుసా? అదే "టైగర్స్ ఐ(Tiger's Eye Gemstone)". దీనిని అన్ని ఉపరత్నాలకు అధిపతిగా భావిస్తారు. తక్కువ ధరలో లభిస్తూ జాతకంలోని గ్రహాలను బలపరిచి, అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తి ఈ రత్నానికి ఉంది. ఉపరత్నం అంటే సెమీ ప్రెసియస్ స్టోన్ లేదా సెకండరీ జెమ్ స్టోన్ అని అర్థం. ఇది విలువైన రాళ్లలా కాకుండా మరింత సాధారణంగా లభించే రత్నం.
తక్కువ ధరలో లభిస్తూ జాతకంలోని గ్రహాలను బలపరిచి, అదృష్టాన్ని పూర్తిగా మార్చే శక్తి ఈ టైగర్స్ ఐ రత్నానికి ఉంది. జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అనుగుణంగా 9 ముఖ్యమైన రత్నాలను గుర్తించారు. అయితే వాటితో పాటు అనేక ఉపరత్నాలు కూడా ఉన్నాయి, వాటి సంఖ్య దాదాపు 84 వరకు ఉంటుంది. ఈ ఉపరత్నాలలో అత్యంత ప్రభావవంతమైనదిగా టైగర్స్ ఐ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

తక్షణమే ఫలితాలనిచ్చే రత్నం
టైగర్స్ ఐ రత్నం ధరించిన వెంటనే తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తుంది. శక్తివంతమైన నీలం రత్నం మాదిరి ఇది కూడా చాలా వేగంగా పనిచేస్తుంది. ఇది ఒక వ్యక్తికి సరిగ్గా సరిపోతే వారి జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది, దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి,వృత్తి, ఉద్యోగాలలో అనూహ్యమైన పురోగతి కనిపిస్తుంది. అయితే ఎంత శక్తివంతమైనదైనా ఈ రత్నాన్ని ధరించే ముందు తప్పనిసరిగా మీ జాతకాన్ని అనుభవజ్ఞులైన జ్యోతిష్యులకు చూపించి సలహా తీసుకోవడం ముఖ్యం.
ఎలా ఉంటుంది? దాని ప్రయోజనాలేంటి?
ఈ రత్నం పసుపు, బంగారు వర్ణంలో మెరుస్తూ దానిపై నల్లని చారలతో అచ్చం పులి కన్నును పోలి ఉంటుంది. అందుకే దీనికి టైగర్ ఐ అనే పేరు వచ్చింది. దీనిని ధరించడం వల్ల జాతకంలో బలహీనంగా ఉన్న సూర్య, చంద్ర గ్రహాలు బలపడతాయి. ఫలితంగా మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది..మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. ఇది డబ్బు సంపాదించే మార్గాలను సుగమం చేసి కెరీర్ లో ఉన్నత శిఖరాలకు చేరడానికి సహాయపడుతుంది.
ఎప్పుడు, ఎలా ధరించాలి?
ఈ రత్నాన్ని ఏ నెలలోనైనా శుక్ల పక్షంలోని అష్టమి తిథి నాడు ధరించడం ఉత్తమం. ఆదివారం లేదా సోమవారం రోజున ఉంగరపు వేలుకు ధరిస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయి.
ఏ రాశుల వారికి ప్రత్యేకం?
సాధారణంగా మేషం, ధనుస్సు, మీన రాశుల వారికి టైగర్ ఐ రత్నం అద్భుతంగా పనిచేస్తుంది. ఏ రత్నమైనా సరే అది మీ జాతక చక్రానికి అనుకూలంగా ఉందో లేదో తెలుసుకున్న తర్వాతే ధరించాలి. అప్పుడే దాని పూర్తి ప్రయోజనాలను పొందగలుగుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications