Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
ఇలా చేస్తే మీపై శుక్రుడి ఆశీస్సులు..జాతకంలో శుక్రుడు బలపడి అన్నీ శుభాలే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక్కో గ్రహం నుండి ఒక్కో రకమైన ఫలితాలు మన జీవితంపై ఉంటాయి. జాతకంలో శుక్రుని స్థానం శుభప్రదంగా ఉంటే జీవితం చాలా అందంగా ఉంటుందని పండితులు చెబుతుంటారు. శుక్రుని మంచి ప్రభావం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అయితే జాతకంలో శుక్రుని చెడు ప్రభావం ఉంటే జీవితంలోని వివిధ కోణాల్లో గందరగోళాన్ని అనుభవించాల్సి ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడిని సంతోషంగా ఉంచడానికి కొన్ని ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.
ఈ పనులు చేస్తే జాతకంలో శుక్రుడు సంతోషించి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు
-జుట్టు, గడ్డం,గోళ్లను ఎల్లప్పుడూ ఉదయం పూట కత్తిరించుకోవాలి. రాత్రిపూట లేదా సూర్యాస్తమయం తర్వాత ఈ పని చేస్తే శుక్రుడికి కోపం వస్తుందట.

-ఉదయం పూట అన్నంలో కొద్దిగా నెయ్యి,పెరుగు కలిపి తినడం వల్ల శుక్రుడు సంతోషంగా ఉంటాడు. వీలైతే ప్రతి ఉదయం నెయ్యి,పెరుగు తినాలంట.
-ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత మహిళలు లేదా పురుషులు శరీరానికి కొబ్బరి నూనె పూయండి. రోజూ శరీరానికి కొబ్బరి నూనే పూయడం ద్వారా జాతకంలో శుక్ర గ్రహం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. ఫలితంగా మీకు సానుకూల ఫలితాలు ఇస్తుందని నమ్ముతారు.
-జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్రుడిని సంతోషపెట్టడాని కొన్ని యాలకులను నీటిలో ఉడకబెట్టి ఆపై వడపోసి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇలా చేసేటప్పుడు 'ఓం ద్రాం ద్రీం ద్రౌం సః శుక్రాయ నమః' అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం ద్వారా మీ సమస్యలన్నీ అంతమవుతాయి.
-పురుషులు అప్పుడప్పుడు ఇంట్లోని మహిళలకు వారి సామర్థ్యం ప్రకారం బహుమతులు ఇవ్వాలి.
-ఇంట్లో ఉన్నాం కదా ఏం కాదులే అనుకొని మురికిగా, చిరిగిన బట్టలు వేసుకోకండి. ఫలితంగా శుక్రుడు అసంతృప్తి చెందుతాడు.
-ఇంట్లోని స్త్రీలు ఎల్లప్పుడూ శుభ్రమైన బట్టలు ధరించాలి. దీనితో శుక్రుడు సంతోషించాడు.
-పురుషులు, మహిళలు ఇద్దరూ ఏదైనా పెర్ఫ్యూమ్ వాడాలి. దీని వలన శుక్రుని శుభ ఫలితాలు కలుగుతాయి.
-జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం తెల్లటి వస్తువలపై ఆధిపత్యం చెలాయిస్తుందని చెబుతారు. కాబట్టి మీరు శుక్రుడిని సంతృప్తి పరచాలనుకుంటే తెల్లటి వస్తువులు తినడం ద్వారా రోజు ప్రారంభించండి.
-ప్రతి శుక్రవారం మీరు కొనగలిగే ఏదైనా తెల్లటి వస్తువును ఆలయానికి సమర్పించండి.
-ప్రతిరోజు స్నానం చేయండి. జుట్టు, గడ్డం, మీసాలను ఎల్లప్పుడూ చక్కగా కత్తిరించాలి.
-వెండి ఆభరణాలను ధరించడం వల్ల మీరు శుక్రుడిని బలపరచవచ్చు. వెండి ఆభరణాలు ధరించడం వల్ల చర్మపు చికాకులు తొలుగుతాయి. జలుబు సమస్య తగ్గుతుంది. జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications