Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బీరువా ఈ వైపున పెట్టుకుంటే.. కుబేరుడు ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయ్..!
హిందూ శాస్త్రాల్లో వాస్తు శాస్త్రానికి కూడా చాలా ప్రాముఖ్యత వున్నది. ఇళ్లు ఏ దిక్కున వుండాలి. ఇంట్లో గదులు ఏ దిక్కున ఎలా వుండాలి. ఎక్కడ ఏ వస్తువులు పెట్టుకుంటే మంచి జరుగుతుంది. బాత్‌రూం, వంటగది ఎటువైపు వుండాలి. బాల్కనీ లేదా వరండా ఎటువైపు వుండాలి. ఇలా ఎన్నో ప్రశ్నలకు వాస్తు శాస్త్రం మనకు సమాధానం చెబుతుంది. ఇంట్లో వున్న బీరువా ఎటువైపు వుండాలో కూడా వాస్తు శాస్త్రం ముందే చెప్పింది. బీరువాలో చాలా అతి ముఖ్యమైన వస్తువులను దాచుకుంటాము. మన జీవితానికి సంబంధించిన దాదాపు అన్ని ముఖ్యమైన వాటిని బీరువాలో పొందుపరుచుకుంటాము. అది ధనం కావచ్చు, బంగారం కావచ్చు, ఇంటి ఆస్థి కాగితాలు కావచ్చు, ఇలా ఎన్నో విలువైన వస్తువులను బీరువాలో వుంచుతాము. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన బీరువాను ఎక్కడ ఏవైపు పెట్టుకోవాలోపండితులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
మొత్తం ఎనిమిది దిక్కులు వుంటాయ్. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యము, ఈశాన్యము అనే ఎనిమిది దిక్కులు వున్నాయ్. ఈ ఎనిమిది దిక్కులకు ఎనిమిది మంది దేవతలు వున్నారు. వారినే అష్టదిక్పాలకులు అని అంటాము. బీరువ లక్ష్మీ స్థానంగా పరిగణించబడుతుంది. బీరువాను ఆగ్నేయం వైపు అస్సలు పెట్టకూడదు, ఆగ్నేయానికి అధిపతి అగ్నిదేవుడు కాబట్టి బీరువాను ఆ దిక్కున పెడితే బీరువాలో వున్న సంపద కాలిపోయినట్టేనని అంటున్నారు.
వాయువ్యం వైపు కూడా బీరువాను పెట్టవద్దను చెబుతున్నారు. లేదంటే వాయువుకు బీరువాలో వున్నవన్నీ ఎగిరిపోయినట్టు అన్నీ వ్యర్ధమైపోతాయ్. దక్షిణం వైపు కూడా బీరువాను పెట్టవద్దు ఎందుకంటే దక్షిణానికి యమ దర్మరాజు అధిపతి. బీరువాను నైరుతి దిక్కున పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. దక్షణం, పడమర దిక్కుకు మధ్యలో వున్న భాగంలో బీరువాను పెట్టాలి. నైరుతిలో బరువు పెట్టాలని వాస్తు శాస్త్రంలో కూడా వుంది.

బీరువాను ఉత్తరం దిక్కుకే తిప్పి పెట్టుకోవాలి. ఎందుకంటే ఉత్తర దిక్కుకు అధిపతి కుబేరుడు. లక్ష్మీ దేవి తరువాత అంతటి ధనాన్ని కలిగివున్న ఏకైక దేవుడు కుబేరుడు. బీరువాను తెరిచినప్పుడు ఆ ఖాలీ స్థలంలో కనుక కుబేరుడి దృష్టి పడితే ఐశ్వర్యం ధనం లభిస్తుంది.
బీరువా ఉత్తరంపైపు తిప్పి పెట్టుకోలేకపోతే తూర్పు వైపు తిప్పి పెట్టుకోవాలి. తూర్పు వైపుకు అధిపతి దేవేంద్రుడు. ఈయన కూడా చాలా శక్తివంతమైన దేవుడు. ముక్కోటి దేవతలకు అధిపతి. కామధేనువు, ఐశ్వర్యము, ఐరావతము అంతా దేవేంద్రుడు ఆధీనంలో వుంటుంది. కాబట్టి ఆయన అనుగ్రహం, ఆశీస్సులు కూడా అందుతాయ్.
అయితే బీరువాను ఇలా తూర్పు, నైరుతి దిక్కున పెట్టి ఏపని చేయకుండా అలాగే వుంటే ఎలాంటి ఫలితం వుండదు. కష్టపడితేేనే ఫలితం వుంటుందని శాస్త్రం కూడా చెబుతుంది. బీరువాపై స్వస్తిక్ గుర్తును రాసుకోవాలి. బీరువాలో ఎప్పుడూ సువాసన వచ్చేలా ఐదైనా ఏర్పాటు చేసుకోవాలి. లక్ష్మీ దేవికి సువాసనలు అంటే ఇష్టము.
ఏ జేబులో అయితే డబ్బులు పెట్టుకుంటామో ఆ జేబు పరిశుబ్రంగా వుండాలని శాస్త్రం చెబుతోంది. డబ్బు పెట్టుకునే జేబులో సిగరెట్టు, బీడీలు, అగ్గిపెట్టెలు, మత్త పదార్ధాలు, చెత్త లేకుండా చూసుకోవాలి. జేబిని ఎప్పుడూ ఖాలీగా వుంచకూడదు. కనీసం కొన్ని రూపాయలనైనా వుంచుకోవాలి. పైవాటిని పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పుకుండా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications