నేటి రాశి ఫలాలు:ఈ రోజు ఓ రాశి వారు లక్ష్మీ అనుగ్రహంతో ఆర్థికంగా లాభపడుతారు.

Today Rashiphalalu 11 July 2024: నేటి రాశి ఫలాలు 11 జూలై 2024, గురువారం, పంచమి, పూర్వ ఫల్గుణి నక్షత్రం, ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ ,సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.

అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 12 జూన్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

Today Horoscope 11 July 2024

మేషం

మీరు మీ నైపుణ్యం మరియు తెలివితేటలకు మంచి ఫలితాలను పొందుతారు. ప్రత్యర్థులు ఓడిపోతారు మరియు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనికి సంబంధించిన ఏ ప్రయత్నమైనా విజయవంతమయ్యే అవకాశం ఉంది.వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
అదృష్ట రంగు: ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 11
శుభ సమయం: మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 7 గంటల వరకు

వృషభ
ఈ రోజు రోజు చాలా బిజీగా ఉంటారు, కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ఈ రోజు మీరు ఒత్తిడికి గురవుతారు. ప్రతికూల పరిస్థితుల్లో మీరు ఓపికగా ఉండాలి. వ్యాపారంలో పెద్ద లాభాలు పొందడం ద్వారా
మీ భాగస్వామి ఏదైన ఇష్టం లేని పనిచేస్తుంటే మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ రోజు మీ పిల్లల కోర్కెలు తీర్చుతారు.
అదృష్ట రంగు: గ్రే కలర్
అదృష్ట సంఖ్య: 7
శుభ సమయం: సాయంత్రం 5 నుండి 7:30 వరకు

Today Horoscope 11 July 2024

మిథునం
మీ మంచి ప్రవర్తన మరియు లక్షణాలు చాలా ప్రశంసించబడతాయి. మిమ్మల్ని చూసి వ్యక్తులు ఆకర్షితులు అవుతారు. కొత్త వ్యాపార సంబంధాలు ఏర్పడుతాయి. ఇది మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పనిచేసే వారు చిన్న చిన్న తప్పులు మానుకోండి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి లేకుంటే మీ సమయం మరియు డబ్బు రెండూ వృధా అవుతాయి.
అదృష్ట రంగు: రోజ్ కలర్
అదృష్ట సంఖ్య: 10
శుభ సమయం: ఉదయం 8 నుండి 11 గంటల వరకు

కర్కాటకం
ఈరోజు సోమరితనం అజాగ్రత్త పనికిరాదు. ఆందోళన మరియు ఒత్తిడి కారణంగా అసౌకర్యానికి గురవుతారు. పనిలో అసంపూర్ణత ఉంటుంది. దాని వల్ల చాలా సమస్యలు ఎదుర్కొంటారు. కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టండికెరీర్‌పై ఎక్కువ దృష్టి పెట్టండి.ఇంటి శాంతికి భంగం కలగవచ్చు. మీ కోపం స్వభావం సంబంధాలలో దూరాన్ని పెంచుతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతర వ్యక్తులతో పంచుకోకండి.
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 14
శుభ సమయం: సాయంత్రం 6 నుండి రాత్రి 9 వరకు

సింహం
ఈ రోజు మీకు శారీరకంగా,మానసికంగా బాగుంటారు. మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. మంచి ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. రుణం తీసుకున్న డబ్బును తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉంటారు. ఆఫీసులో గౌరవం పెరుగుతుంది. మీరు పై అధికారుల నుండి కూడా మద్దతు పొందుతారు. మీ ఆత్మీయులకు మీపై నమ్మకం పెరుగుతుంది.మీ జీవిత భాగస్వామితో మానసిక అనుబంధం పెరుగుతుంది.

అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 18
శుభ సమయం: ఉదయం 6:20 నుండి 9:20 వరకు

Today Horoscope 11 July 2024

కన్యా
కొన్ని కారణాల వల్ల మీరు ఇంటికి దూరంగా ఉండవలసి రావచ్చు. అటువంటి పరిస్థితిలో, ప్రియమైనవారి జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడతాయి. పనిలో బిజీగా ఉండడం వల్ల వ్యక్తిగత పనులేవీ పూర్తికావు. తెలియని వ్యక్తుల నుండి దూరం పాటించండి. ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి లేకపోతే మీ కష్టానికి ఫలితం మరొకరు తీసుకుంటారు.ఇంటి విషయాల్లో బయటి వ్యక్తులు జోక్యం చేసుకోనివ్వకండి

అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య:42
శుభ సమయం: మధ్యాహ్నం 3:15 నుండి 6 గంటల వరకు
తుల
కుటుంబ సభ్యులతో రోజు సరదాగా నవ్వుతూ గడుపుతారు. మీ పెద్దలు మీకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అప్పగిస్తారు. మీరు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటార. పిల్లల వృత్తికి సంబంధించిన ఆందోళనలు తొలగిపోతాయి. వారికి మార్గనిర్దేశం చేసే అవకాశం కూడా మీకు లభిస్తుంది. మీరు చేస్తున్న పనిపై దృష్టి పెట్టడం మంచిది. మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి

అదృష్ట రంగు: మెరూన్
అదృష్ట సంఖ్య: 32
శుభ సమయం: ఉదయం 10:05 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు

వృశ్చిక రాశి

ఈ రోజు మీ వ్యాపార ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు ఆశించిన ప్రశంసలు పొందే వరకు మీ ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి మంచి ఆఫర్ వస్తుంది. విద్యార్థులు చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ కోపం, అహకారం వల్ల మీ సంబంధాన్ని పాడు చేసుకుంటారు. ఆరోగ్య పరంగా వెన్ను లేదా నడుము సంబంధిత సమస్యలతో బాధపడుతారు
అదృష్ట రంగు: స్కై బ్లూ
అదృష్ట సంఖ్య: 2
శుభ ముహూర్తం: సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు

ధనుస్సు
ఈరోజు మీరు మీ కుటుంబంతో ఈ రోజు ఆనందంగా గడుపుతారు. కార్యాలయంలో మీ స్థానం బలపడుతుంది. మీ వ్యాపారం మంచి లాభాలు రావాలంటే నాణ్యతను పెంచండి. మీ అధికారుల మీ పెట్టిన విశ్వాసం వారి మనస్సును గెలుచుకుంటారు. కుటుంబానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, ఖచ్చితంగా మీ ప్రియమైనవారి సలహా తీసుకోండి. ప్రియుడు/ప్రేయసితో విభేదాలు ఉండవచ్చు. మీరు తెలివిగా వ్యవహరించాలి.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 6
శుభ సమయం: మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 8 గంటల వరకు

Today Horoscope 11 July 2024
మకర రాశి

రోజు చాలా బిజీగా ఉంటుంది, కానీ మీ కోసం కూడా మీకు తగినంత సమయం లభిస్తుంది. మీరు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఆర్థికంగా లాభపడుతారు. అందుకు లక్ష్మీ అనుగ్రహం కూడా ఉంటుంది. పెద్ద వ్యాపార పెట్టుబడులకు రోజు అనుకూలం కాదు. కష్టపడి పనిచేస్తే విజయం మీ సొంత అవుతుంది, రు. తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది.

అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 12
శుభ సమయం: సాయంత్రం 5:15 నుండి 7 గంటల వరకు

కుంభ రాశి
ఈ రోజు మీ జీవిత భాగస్వామి కొన్ని గొప్ప విజయాలు సాధించవచ్చు. మీరు వారి గురించి చాలా గర్వంగా భావిస్తారు. మీ సామర్థ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. డబ్బు విషయంలో వివాదాలుంటాయి. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. మీ పనిపై ఏకాగ్రత వహించండి. కార్యాలయంలో మీపై కుట్ర జరగవచ్చు. కార్యాలయంలో జరిగే రాజకీయాలకు దూరంగా ఉండండి.
అదృష్ట రంగు: ఆరెంజ్
అదృష్ట సంఖ్య: 4
శుభ సమయం: ఉదయం 8 నుండి 11 గంటల వరకు

మీన రాశి రోజువారీ జాతకం
సన్నిహితులతో ఉన్న విభేదాలు పరిష్కరించబడతాయి. కార్యాలయంలో మీ అసంపూర్ణ పనులను పూర్తి చేయడానికి మంచి రోజు. మీరు కష్టపడి పని చేయండి. డబ్బు సంబంధిత లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులతో మాటమాట పెరగడం వల్ల మీ వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో మీరు ప్రియమైనవారి నుండి మద్దతు పొందుతారు.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 26
శుభ సమయం: సాయంత్రం 4:50 నుండి రాత్రి 8:50 వరకు

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Thursday, July 11, 2024, 7:22 [IST]
Desktop Bottom Promotion