Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నేటి రాశిఫలం 30 సెప్టెంబర్ 2024: ఈ రోజు ఈ రాశుల వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి
Today Rashiphalalu 30 September 2024: నేటి రాశి ఫలాలు 30 సెప్టెంబర్ 2024, ఈ రోజు సోమవారం, త్రయోదశి, మఖ నక్షత్రం, రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ , సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 30 సెప్టెంబర్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషం
పనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, లేకపోతే మీ నుండి కొన్ని ముఖ్యమైన బాధ్యతలు వెనక్కి తీసుకోవచ్చు. వ్యాపారస్తులకు ఈ రోజు హెచ్చు తగ్గులతో ఉంటుంది. మీరు ఇతరులపై ఆధారపడకుండా ఉండాలి. కుటుంబ సమస్యల పరిష్కారంతో మీ ఆందోళనలు తొలగిపోతాయి. కొత్త పెట్టబడులు పెట్టడం మానుకోవాలి.మీ జీవిత భాగస్వామితో సంబంధంలో సామరస్యం ఉంటుంది.
వృషభం
అవివాహితులకు పెళ్లి ప్రతిపాదనలు రావచ్చు. వివాహితులకు ఆనందంగా ఉంటుంది. పనిలో జాగ్రత్తగా ఉండండి పై అధికారులు సలహాలను పాటించకపోవడం వల్ల మీరు ఇబ్బందుల్లో పడతారు. పనిలో సోమరితనం బద్దకం వల్ల కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోతాయి . దాంతో మీరు కఠినమైన పరినామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే వదిలేయడం వల్ల కష్టంగా మారుతుంది.
మిథునం
ఉద్యోగస్తులు మీ పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా లెక్కచేయరు. దాంతో మీ పనిలో మెరుగుదల ఉంటుంది. కొత్త బందుత్వాలు, బందువుల రాక ఉంటుంది. అకస్మాత్తుగా ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కుంటుంబంలో అపార్థాలకు చోటు ఇవ్వకండి. లేదంటే ముందు ముందు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ప్రేమికులకు మంచి రోజు అవుతుంది.
కర్కాటకం
మీ జీవిత భాగస్వామి చాలా రొమాంటిక్ మూడ్‌లో ఉంటారు. మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి ప్లాన్ చేసుకుంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటరు ఆర్థికపరిస్థితి మెరుగ్గా ఉండటం వల్ల డబ్బు బాగా ఖర్చు చేస్తారు. కుంటుంబంలో వాదనలు నివారించండి లేదంటే మీ మధ్య విభేదాలు తలెత్తవచ్చు.ఆరోగ్య పరంగా కండరాలకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటారు.
సింహం
ప్రేమికుల మధ్య మనస్పర్థాలు పెరుగుతాయి. వైవాహిక జీవితంలో మీ భాగస్వామి మద్ధతు మీలో విశ్వాసాన్ని పెంచుతుంది. మీ ప్రియమైన వారికోసం ఏదైన కరీదైన బహుమతిని కొంటారు. ఆర్థికంగా బాటుంది. వ్యాపారంలో సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. ఈ వారంలో ప్రయాణాలు మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. సమతుల్య ఆహారంతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.
కన్యా
కుటుంబ సభ్యులను సమంగా చూసుకోవాలి. వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలతో మంచి ఫలితాలు పొందుతారు . పెద్దల మార్గదర్శకం, ఆశీస్సులు పొందుతారు. ఆర్థిక సమస్యలు లేకపోయినా భష్యత్తు దృష్టిలో పెట్టుకుని డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ప్రియమైన వారి మద్దతు లభిస్తుంది. వారి భావాలను గౌరవించండి. లేదంటే విబేదాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధి ఇబ్బంది కలిగిస్తుంది
తుల రాశి
జీవిత భాగస్వామతో కలిసి డేట్ కు వెళతారు. ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి . కొన్ని ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు, సంబంధాలు బలహీనంగా మారుతాయి. కోసం తొందరపాటు చర్యలకు దూరంగా ఉండాలి. ఈ సమయంలో మానసిక ప్రశాంత పొందుతారు. ఆఫీసులో పనులు
వృశ్చికం
ఉద్యోగస్తులు నిర్లక్ష్యం వల్ల కొన్ని పనులు మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. డబ్బు పరంగా అదృష్టం పొందుతారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఇతరుల మాటలు విని మీ పనిపై నిర్లక్షం వద్దు. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆరోగ్య పరంగా తేలికపాటి ఆహారం తీసుకోండి.
ధనుస్సు
ఒక ముఖ్యమైన వ్యక్తి నుండి సహాయం పొందుతారు. వ్యాపారాలు మెరుగ్గా ఉంటాయి. వ్యాపారంలో పనిరంగంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తులు మార్పు కోసం చూస్తుంటే, మంచి అవకాశాలు రావచ్చు. కుంటుంబంలో సంతోషం ఉంటుంది. తోబుట్టువుల మద్దతు లభిస్తుంది. తండ్రి ఆశీస్సులు పొందుతారు. విద్యార్థు కష్టపడితే విజయం మీదే అవుతుంది. సమాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు
మకర రాశి
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి ఆఫర్లు వస్తాయి. మీ ప్రత్యర్థుల వల్ల కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ పట్టుదలలో మీరు మీ విజయం సాధిస్తారు. అడ్డంకులను సులభంగా ఎదుర్కొంటారు. ప్రియమైన వారి సహకారం ఉంటుంది. బిజీగా ఉండటం వల్ల కుంటుంబంతో సమయం గడపలేకపోవచ్చు. అందుకు కొంత సమయం ఇస్తే వాతావరణం ప్రశాంతంగా ుంటుంది. మీ జీవిత భాగస్వామితో సన్నిహితంగా ఉంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు.
కుంభం
కుటుంబంలో విబేధాలు రావచ్చు. దాంతో ఆందోళనలు పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఆఫీసులో ఛాటింగ్ చేయడం మానేయాలి. ప్రత్యర్థులు మీపై కుట్రచేయవచ్చు. వ్యాపారులకు వ్యాపారన్ని విస్తరించాలనే ఆలోచన ఫలిస్తుంది. ఒత్తిడి మరియు ఆందోళన వలన సరిగా పనిచేయలేకపోవచ్చు. త్వరలో సమస్య పరిష్కరింపబడుతుంది. అన్నింటికి సానుకూలంగా ఉండండి. సేల్స్ మార్కెటింగ్ వారికి ఈ రోజు బాగుంది
మీన రాశి
జీవిత భాగస్వామి మద్దతు, ప్రియమైన వారి నుండి మంచి సలహాలు పొందుతారు. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. సంతోషంగా ఉంటారు. అనుభవజ్ఝుల ద్వారా మార్గదర్శకత్వం పొందుతారు. పనిలో అడ్డంకులు తొలగిపోతాయి. స్నేహితులను కలుసుకుంటారు. తగినంత విశ్రాంతి తీసుకోవడి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications