Today Rasi Phalalu: ఆగస్టు 09 బుధరం రాశి ఫలాలు:

Today Rasi Palalu 09 August 2023: రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. జూలై మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క రంగు, రాశిచక్రం సంఖ్య మరియు రాశిచక్ర సమయాలను తెలుసుకోవచ్చు.

ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ'శోభకృత' నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం ఈ రోజు, ఆగస్టు 09 ,"నవమి''
కృతిక నక్షత్రం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.

Today Rasi Phalalu-09 August 2023 Daily Horoscope in Telugu, Today Horoscope in Telugu

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మేషం (మార్చి 20 నుండి ఏప్రిల్ 18 వరకు):
మేష రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉండనుంది. అన్ని రంగాల్లో సానుకూల ఫలితాలు చూస్తారు. సంతోషంగా ఉంటారు. పని సంబంధిత సమస్యలు ఈ రోజు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది.

అదృష్ట రంగు: ముదురు ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 20
అదృష్ట సమయం: 5 PM నుంచి 8:30 PM వరకు

వృషభం (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు):
వైవాహిక జీవితంలో బాగుంటుంది. మీ ప్రేమను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి.

అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట సమయం: ఉదయం 7.55 నుంచి 11 గంటల వరకు

మిథునం (మే 20 నుండి జూన్ 20 వరకు):
ప్రేమికులకు అద్భుతమైన రోజు. వివాహ ప్రతిపాదనలు మంచి ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పొదుపుపై ఎక్కువగా దృష్టి పెట్టండి. అప్పుల బాధ తొలగిపోతుంది. వ్యాపారంలో వృద్ధి చూస్తారు.

అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట సమయం: మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు

కర్కాటకం (జూన్ 21 నుండి జూలై 21 వరకు):
కర్కాటక రాశి వారు ఈరోజు సమస్యలు ఎదుర్కొంటారు. పనిపై దృష్టి పెట్టలేరు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా అనుకూలించకపోవచ్చు. ఖర్చులు పెరుగుతాయి.

అదృష్ట రంగు: నారింజ
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట సమయం: ఉదయం 4.15 నుంచి 10 గంటల వరకు

సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు):
ఆస్తికి సంబంధించి సమస్యలు వేధిస్తాయి. నిర్ణయాలు సరైన ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అధికారులతో విభేదాలు వస్తాయి. ఓపికగా ఉండటం మంచిది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది

అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 18
అదృష్ట సమయం: సాయంత్రం 5.55 నుంచి రాత్రి 9.15 గంటల వరకు

కన్య (ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు):
కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయంలో గడిపేందుకు అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనికి సంబంధించిన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి.

అదృష్ట రంగు: పింక్
అదృష్ట సంఖ్య: 32
అదృష్ట సమయం: 2.30 PM నుండి 6 PM వరకు

తుల (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22):
మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటారు. విసుగు, చికాకు ఉంటుంది. పనిపై దృష్టి పెట్టలేరు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.

అదృష్ట రంగు: మెరూన్
అదృష్ట సంఖ్య: 6
అదృష్ట సమయం: 1.50 PM నుండి 7.30 PM వరకు

వృశ్చికం (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20):
అదృష్టం హ్యాండ్ ఇస్తుంది. కష్టపడితేనే ఫలితం వస్తుందని గుర్తుంచుకోవాలి. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. డబ్బు పరమైన ఇబ్బందులు వస్తాయి. రోజువారీ ఖర్చులను అదుపు చేసుకోవాలి.

అదృష్ట రంగు: బ్రౌన్
అదృష్ట సంఖ్య: 15
అదృష్ట సమయం: ఉదయం 6:15 నుండి 10 గంటల వరకు

ధనుస్సు (నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు):
ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పనితీరు మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం బాగుంటుంది

అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 10
అదృష్ట సమయం: 2.20 PM నుండి 5 PM వరకు

మకరం (డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు):
వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. సన్నిహితుల సలహా తీసుకోవడం మర్చిపోవచ్చు. ఉద్యోగులకు అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికి పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు

అదృష్ట రంగు: ఆకుపచ్చ
అదృష్ట సంఖ్య: 21
అదృష్ట సమయం: 5.30 సాయంత్రం నుంచి రాత్రి 8.30 గంటల వరకు

కుంభం (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు):
ఈరోజు పనిభారం పెరుగుతుంది. పిల్లల చదువుకు సంబంధించిన ఆందోళనలు తలెత్తుతాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. శుభవార్త వింటారు.

అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 8
అదృష్ట సమయం: 4.10 PM నుండి 8.10 PM వరకు

మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు):
ఆరోగ్య సమస్యలు వస్తాయి. పనులు జరగకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. శృంగార జీవితం బాగుంటుంది.

అదృష్ట రంగు: లేత పసుపు
అదృష్ట సంఖ్య: 12
అదృష్ట సమయం: ఉదయం 8.30 నుండి మధ్యాహ్నం 11.30 గంటల వరకు

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Desktop Bottom Promotion