Latest Updates
-
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా?
Today Rasi Phalalu: ఆగస్టు 10 గురువారం రాశి ఫలాలు: మిథునరాశి వ్యక్తుల ఆర్థిక రంగం బలంగా ఉంటుంది..
Today Rasi Palalu 10 August 2023: రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. జూలై మేషం నుండి మీనం వరకు మొత్తం 12 రాశుల వారికి కలిగే ప్రయోజనాల గురించి చూద్దాం. అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క రంగు, రాశిచక్రం సంఖ్య మరియు రాశిచక్ర సమయాలను తెలుసుకోవచ్చు.
ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది?స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ'శోభకృత' నామ సంవత్సరం, అధిక శ్రావణ మాసం ఈ రోజు, ఆగస్టు 10,"దశమి'' రోహిని నక్షత్రం, గురువారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది.

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థులు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...
మేషం (మార్చి 20 నుండి ఏప్రిల్ 18 వరకు):
మేష రాశి ప్రేమికులకు ఈరోజు ఏమాత్రం అనుకూలంగా ఉండదు. చిన్న విషయానికి మీ మధ్య మనస్పర్థలు రావొచ్చు. కోపం తెచ్చుకోవడం మానుకోవాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంలో ఆనందంగా వెల్లివిరిస్తుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు బాగుంటుంది.
అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 10
అదృష్ట సమయం: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1.20 గంటల వరకు
వృషభం (ఏప్రిల్ 19 నుండి మే 19 వరకు):
తొందరపాటు పనికిరాదు. తొందరాటు పనులు, నిర్ణయాలతో నష్టాలే ఎక్కువ. డబ్బు పరంగా మిశ్రమంగా ఉండనుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు కూడా పెరుగుతాయి. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవద్దు.
అదృష్ట రంగు: పసుపు
అదృష్ట సంఖ్య: 29
అదృష్ట సమయం: ఉదయం 7 నుంచి 12.30 గంటల వరకు
మిథునం (మే 20 నుండి జూన్ 20 వరకు):
పిల్లల నుంచి సంతోషకరమైన వార్త వింటారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం మెరుగుపడుతుంది. పని పరంగా ఈరోజు సాధారణంగానే ఉంటుంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు.
అదృష్ట రంగు: ముదురు పసుపు
అదృష్ట సంఖ్య: 14
అదృష్ట సమయం: సాయంత్రం 4.05 నుంచి రాత్రి 9 గంటల వరకు
కర్కాటకం (జూన్ 21 నుండి జూలై 21 వరకు):
కుటుంబ జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.
అదృష్ట రంగు: వాయిలెట్
అదృష్ట సంఖ్య: 11
అదృష్ట సమయం: ఉదయం 5.45 నుంచి 10.25 గంటల వరకు
సింహ రాశి (జూలై 22 నుండి ఆగస్టు 21 వరకు):
భాగస్వామితో జాగ్రత్తగా మసులుకోవాలి. మాట్లాడేటప్పుడు పదాల ఎంపిక చాలా కీలకం. ఆవేశం తగ్గించుకోవాలి. ఆర్థిక పరిస్థితి కాస్తంతా మెరుగుపడుతుంది. పరిమితికి మించి ఖర్చు చేయవద్దు. వ్యాపారస్థులు ఆశించిన లాభాలు పొందుతారు. ఈ రోజు ఉద్యోగులకు మంచిది
అదృష్ట రంగు: తెలుపు
అదృష్ట సంఖ్య: 31
అదృష్ట సమయం: మధ్యాహ్నం 1 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు
కన్య (ఆగస్టు 22 నుండి సెప్టెంబర్ 21 వరకు):
కుటుంబ జీవితం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఈ రోజు మీరు డ్బబుకు సంబంధించిన ముఖ్యమైన పనిని చేసే అవకాశం ఉంది. కార్యాలయంలో ఉన్నత అధికారులతో మంచి అనుబంధాన్ని కలిగి ఉంటారు. కష్టమైన పనులు పూర్తవుతాయి.
అదృష్ట రంగు: ఎరుపు
అదృష్ట సంఖ్య: 15
అదృష్ట సమయం: మధ్యాహ్నం 2.15 నుండి 8.10PM వరకు
తుల (సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 22):
ఈ రోజు మానసికంగా ఒత్తిడిగా, ఆందోళనగా ఉంటుంది. ప్రతికూల ఆలోచనలతో మనసును పాడు చేసుకుంటారు. అనవసరంగా ఆలోచించి ప్రశాంతత కోల్పోవద్దు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కష్టపడి సంపాదించిన డబ్బును సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. వైవాహిక జీవితం బాగుంటుంది.
అదృష్ట రంగు: నారింజ
అదృష్ట సంఖ్య: 20
అదృష్ట సమయం: ఉదయం 8.40 నుంచి మధ్యాహ్నం 12.30PM వరకు
వృశ్చికం (అక్టోబర్ 23 నుండి నవంబర్ 20):
పని పరంగా ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు ఎదురైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఇంట్లోని చిన్నవారితో కఠినంగా ఉండొద్దు. వారికి మార్గనిర్దేశం చేయాలి, డబ్బు పరంగా మిశ్రమంగా ఉంటుంది.
అదృష్ట రంగు: క్రీమ్
అదృష్ట సంఖ్య: 5
అదృష్ట సమయం: మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 7 గంటల వరకు
ధనుస్సు (నవంబర్ 21 నుండి డిసెంబర్ 20 వరకు):
చాలాకాలం తర్వాత ఈ రోజు మీకు అద్భుతంగా ఉండనుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహుతులకు ఖరీదైన బహుమతులు ఇస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సానుకూలంగా ఉండనుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ ముఖ్యం.
అదృష్ట రంగు: ముదురు గులాబీ
అదృష్ట సంఖ్య: 4
అదృష్ట సమయం: ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు
మకరం (డిసెంబర్ 21 నుండి జనవరి 19 వరకు):
ఈ రోజు చాలా శృంగారభరితంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఉద్యోగులు కోపాన్ని నియంత్రించుకోవాలి. పై అధికారుల తీరును తప్పు పట్టవద్దు. ఆర్థికంగా మిశ్రమంగా ఉండనుంది.
అదృష్ట రంగు: నీలం
అదృష్ట సంఖ్య: 38
అదృష్ట సమయం: ఉదయం 7.55 నుంచి 10.30AM వరకు
కుంభం (జనవరి 20 నుండి ఫిబ్రవరి 18 వరకు):
వైవాహిక జీవితంలో ఆనందంగా, సంతోషంగా ఉండలేరు. భాగస్వామికి సమయాన్ని కేటాయించలేరు కుటుంబ సభ్యులకు సమయాన్ని కేటాయించలేకపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులను అదుపు చేసుకోవాలి.
అదృష్ట రంగు: బ్రౌన్
అదృష్ట సంఖ్య: 19
అదృష్ట సమయం: 1.30 PM నుండి 4 PM వరకు
మీనం (ఫిబ్రవరి 19 నుండి మార్చి 19 వరకు):
వ్యాపారస్తులకు సానుకూలంగా ఉండనుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి సహకారం, ప్రశంసలు అందుతాయి. వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావొచ్చు. జాగ్రత్తగా ఉండటం మంచిది.
అదృష్ట రంగు: క్రీమ్
అదృష్ట సంఖ్య: 9
అదృష్ట సమయం: సాయంత్రం 6 నుంచి రాత్రి 8.15 వరకు
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications