Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది?ఈ రోజు ఏరాశి వారు పరిహారం చేస్తే మంచిది
నేటి రాశి ఫలాలు 15 జూన్ 2024, శుక్రవారం, అష్టమి, ఉత్తరఫాల్గుని నక్షత్రం, ఈ రోజున 12 రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ ,సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 12 జూన్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషరాశి
ఈ రోజు ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటుంది.ఉద్యోగులు ఈ రోజు పనిపై దృష్టి పెట్టాలి. పనిలో చాలా ఒత్తిడి ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు . వ్యాపారులకు ఈరోజు సాధారణంగానే ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఈ రోజు హనుమాన్ చాలీసా పఠిస్తే మంచి ఫలితం ఉంటుంది
వృషభం
పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి, సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. పనిలో ఆటుపోట్లు తప్పవు, మీ అతి విశ్వాసం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఈ రోజు మీరు ఊహించిన విధంగా ఫలితాలు రాకపోతే మీరు నిరాశ చెందుతారు. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉండొచ్చు. ఆరోగ్యానికి డోకాలేదు.
మిధునరాశి
తెలివిగా చేస్తే పనులు చక్కగా పూర్తి అవుతాయి. ఆర్థిక విషయాల్లో మీకు మిశ్రమ ఫలితం ఉంటుంది. మీరు అప్పు చేయాల్సి వస్తే అవసరానికి మించి తీసుకోకండి. ఉద్యోగస్తులకు మంచిగా ఉంటుంది. వ్యాపారుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది. డబ్బు లేకపోవడంతో పనులు ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఈ రోజు ఆవుకు ఆహారంను అందించండి.
కర్కాటకరాశి
ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టండి. స్నేహితులు లేదా బంధువల వల్ల స్ట్రెస్ పెరుగుతుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఉద్యోగం చేసేవారు మరింత కష్టపడాలి. వ్యాపారస్తులకు ఆర్థికంగా మంచి లాభాలు పొందుతారు. కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. శివాభిషేకం చేయిస్తే మంచిది.
సింహ రాశి
వైవాహిక జీవితంలో కొంచెం టెన్షన్ ఉంటుంది. పిల్లల విషయంలో ఆందోళ ఉండొచ్చు.ఆఫీసులో మీ పని ఉన్నతాధికారులు మీ శ్రమను గమనిస్తారు. దాంతో త్వరలో మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులు శుభవార్తలు అందుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సూర్య మంత్రాన్ని పఠించండి. ఆవుకు బెల్లం తినిపించండి
కన్య
విద్యార్థులకు ఈరోజు అనుకూలం. ఉద్యోగులకు మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అవకాశాలు రావచ్చు. మీ వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఏ సమస్య ఉన్నా దాన్ని అదిగమించడానికి బుద్ద బీజ మంత్రాన్ని పఠించండి.
తులారాశి
విద్యారంగంలో పోటీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల బాధ్యతలు నెరవేరుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. మీరు తెలివిగా సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే మంచిది. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఈరోజు అనవసర ఖర్చులు రావచ్చు. పనిలో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. కాబట్టి శుక్రబీజ మంత్రాన్ని పఠించండి. పేదలకు దానం చేయండి.
వృశ్చికరాశి
అనసర ఆందోళనలు ఉంటాయి. ముఖ్యంగా ఆస్తికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీ తల్లి ఆరోగ్యం ఆందోళ కలిగిస్తుంది. వ్యాపారులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు డబ్బు విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు నియంత్రించుకుంటే ప్రయోజనం పొందుతారు. హనుమాన్ ఛాలీసా పఠించండి. కోతికి బెల్లం, పప్పు, అరటి తినిపించండి.
ధనుస్సు రాశి
మీ బాధ్యతలు నెరవేరతాయి. బంధువల ద్వారా మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీ కష్టానికి తగ్గ ఫలితం మరొకరు తీసుకుంటారు. వ్యాపారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. గురుబీజమంత్రాన్ని జపించండి.
మకరరాశి
ఆత్మవిశ్వాసం పెరిగి మనసు ఆనందంగా ఉంటుంది. మీరు ఈ రోజు ఏదైనా పనికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే మీ సమస్య పరిష్కరించబడుతుంది. మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి మీరు కష్టపడి పనిచేయాలి. ఇది కాకుండా, మీరు మీ ఖర్చులపై కూడా శ్రద్ధ వహించాలి. ఆరోగ్య సమస్యలుంటే శని బీజమంత్రాన్ని పఠించండి. కుక్కకు ఆహారం పెట్టండి.
కుంభ రాశి
కుటుంబంలో త్వరలో మీ ఇంట్లో క శుభ కార్యక్రమం నిర్వహిస్తారు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. మీరు మీ రంగంలోని ప్రముఖ వ్యక్తుల నుండి కూడా మద్దతు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధారాళంగా ఖర్చు చేయండి ఈరోజు మీరు సానుకూల శక్తితో ఉంటారు. సాయంత్రం శనీశ్వర ఆలయంలో నూనె దీపం వెలిగించండి.
మీనరాశి
పెద్దల నుండి ప్రసంశలు అందుకుంటారు .మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు .జీవిత భాగస్వామితో సంబంధాలలో సామరస్యం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. గోవుకు సేవచేస్తే విశేష పుణ్యఫలం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications