Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
నేటి రాశిఫలం 29 సెప్టెంబర్ 2024: ఓ రాశి వారు గత విషయాలతో మీ భవిష్యత్తును పాడుచేసుకోకండి
Today Rashiphalalu 29 September 2024: నేటి రాశి ఫలాలు 29 సెప్టెంబర్ 2024, ఈ రోజు శనివారం, ఏకాదశి, ఆశ్లేష నక్షత్రం, రోజున ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? మేషం నుండి మీనం వరకు 12 రాశుల వారికి వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, ఆర్థికపరిస్థి, కుటుంబ , సంతోషం, కష్టాలు ఇలా ప్రతిదాని గురించి తెలుసుకోవచ్చు.
అలాగే, నక్షత్రాల సంచారం మరియు గ్రహాల కదలిక ఆధారంగా మీరు 12 రాశుల రాశిచక్రం యొక్క అదృష్ట రంగు, అదృష్ట సంఖ్య మరియు అదృష్ట సమయాలను తెలుసుకోవచ్చు. ఇప్పుడు 29 సెప్టెంబర్ 2024 నాటి మీ జాతక ఫలితాలను ఇక్కడ తెలుసుకుందాం.

మేషం
ఈ రోజు ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. ఆకస్మికంగా ధనలాభం పొందుతారు. ఉద్యోగంలో పై అధికారుల ఆశీస్సులు మీపై ఉంటాయి. మీ పనులు సజావుగా పూర్తవుతాయి. ఏదైనా పనిలో ఆటంకాలు ఏర్పడితే అది తొలగిపోయే అవకాశం ఉంది. మీరు మీ జీవిత భాగస్వామికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే, ఈ రోజు దానికి సరైన రోజు. ఇంట్లో వాతావరణం సానుకూలంగా ఉంటుంది.
వృషభం
ఉద్యోగంలో చిన్న చిన్న పొరపాట్లు మానుకోండి. ప్రత్యేకించి మీ బాస్ మీకు ఏదైనా పనిని అప్పగించినట్లయితే, జాగ్రత్తగా చేయండి.నిలిచిపోయిన ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. మీరు లాభాలను పొందే అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం కొనసాగుతుంది. మీరు ఒకరికొకరు తగినంత సమయం ఇస్తారు.. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడి తదితర విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
మిథునం
ఉద్యోగంలో మితిమీరిన ఆత్మవిశ్వాసం మానుకోండి లేకపోతే మీరు ఇబ్బంది పడవచ్చు. వ్యాపారంలో లాభాలను పొందడం ద్వారా మీ ఒత్తిడికి ఉపశమనం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామిపై ప్రేమ పెరుగుతుంది. మీరు మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశాన్ని పొందవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం పరంగా డబ్బు కొరత తీరుతుంది మరియు డింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు మీరే చేసుకోండి. ఇతరులపై ఆధారపడవద్దు. వైవాహిక జీవితంలో విభేదాలు పెరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మంచి సమన్వయాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారు.
సింహం
కార్యాలయంలో పనులు ఆలస్యంగా ఉండటం వల్ల మీ పై అధికారు నుండి ఒత్తిడి పెరుగుతుంది. మీ పనిని త్వరగా పూర్తి చేయడం వల్ల మీ టెన్షన్ తగ్గుతుంది. వ్యాపారం ప్రతిపాధ ఉండొచ్చు అయితే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. డబ్బు గురించి ఎక్కువగా బాధపడకండి. మీ సమస్యలు త్వరలోనే తీరుతాయి. పెళ్లికి ప్రపోజ్ చేయాలనుకుంటే, మీరు తొందరపడకుండా ఉండాలి.ఆరోగ్యం పరంగా మిశ్రమంగా ఉంటుంది
కన్య రాశి
మీ జీవిత భాగస్వామి నుండి మానసిక మద్దతు పొందుతారు. ప్రేమ జంటలకు ఈ రోజు చాలా శృంగార దినంగా ఉంటుంది. గత విషయాలను గుర్తుపెట్టుకుని మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. ఈ సమయం మీకు చాలా విలువైనది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంట్లో సమస్యలు పరిస్కరిస్తారు.
తుల రాశి
తురాలారాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగుటుంది.సంబంధాలలో ప్రేమ మరియు ఆప్యాయతతో కుటుంబంలో ఆహ్లదకరంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ఆర్థిక సమస్యలను నివారించవచ్చు. తొందరపాటుతో ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య సమస్యల కొంత ఆందోళన కలిగిస్తుంది. కాబట్టి, స్పైసీ ఫడ్స్ కు దూరంగా ఉండాలి.
వృశ్చిక రాశి
పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీకు తెలియకుండానే వారికి బాధకలిగింవచ్చు. వ్యక్తిగత జీవితంలో సమస్యలు మీ మనస్సును పాడుచేస్తుంది. ఈ సమయంలో నియంత్ర కలిగి ఉండాలి. త్వరలో మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. పనిలో అజాగ్రత వద్దు లేదంటే భవిస్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా కొంచెం అలసట, నీరసం ఉంటుంది
ధనుస్సు రాశి
మీ జీవిత భాగస్వామి నుండి కొన్ని శుభవార్తలను అందుకుంటారు. మీ వైవాహిక జీవితం అందమైన మలుపు తిరుగుతుంది. ఉద్యోగస్తులు పనులన్నీ సులభంగా పూర్తి చేస్తారు. ఒక లక్ష్యంతో పనిచేయడం వల్ల విజయం పొందుతారు. కష్టపడి సంపాదించే డబ్బును తెలివిగా ఖర్చు చేసుకోండి. అకస్మికంగా ఆర్థికలాభాలు ఉన్నాయి. దాంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.
మకర రాశి
ఆఫీసులో పనిభారం పెరగడం వల్ల మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. వ్యాపార పరంగా భాగస్వామితో విభేదాలు ఉండవచ్చు. మనస్సు ఆందోళన కలిగిస్తుంది. ప్రతికూలతలు అనుభవిస్తారు. కాబట్టి అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. పెద్దల సహాయం తీసుకుంటే ప్రయోజనం పొందుతారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆరోగ్య పరంగా మధుమేహులు ఒత్తిడి తీసుకుని, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
కుంభం
ఈ రోజు మీరు మీ బాయ్‌ఫ్రెండ్/గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్ డిన్నర్ డేట్‌కి వెళ్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంది, పురోగతి ఉంటుంది. ఉద్యోగంలో పనులు తెలివిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పై అధికారుల నుండి మద్దతు పొందుతారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు. ఆరోగ్యపరంగా ఆందోళనలు తగ్గుతాయి
మీన రాశి
వ్యాపరస్తులు కొత్త పనులు మొదలు పెడతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు. మీ జీవిత భాగస్వామితో విబేదించకుండా ఉండాలి. లేదంటే పెద్ద సమస్య అవుతుంది. ఆరోగ్యపరంగా మీ దినచర్యలో స్వల్పపాటి మార్పులు అవసరం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications