Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
Horoscope Today: మొత్తం రాశుల్లో వీరిదే అదృష్టవంతమైన రాశి.. వీరికి అసలు ఎలాంటి లోటూ ఉండదు!
జోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మార్పులు, రాశి మార్పులు తరచుగా జరుగుతుంటాయి. ఇలా జరగడం కచ్చితంగా ప్రతిరోజూ రాశి ఫలాలు అనేది మారుతూ వస్తాయి. ప్రతిరోజూ సరికొత్త ఫలితాలను ఆయా రాశుల వారు చూస్తారు. అయితే ఈరోజు ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి వారికి నేడు కుటుంబ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో నెలకొన్న సమస్యలు తొలగిపోతాయి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఆర్ధిక పరమైన కొన్ని శుభవార్తలు వింటారు.

వృషభం
ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు తీవ్రమైన ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వేరే వ్యక్తితో కలిసి వ్యాపారం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే ఛాన్సుంది. ఒత్తిడి నుండి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థిక సమస్యల కారణంగా కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తలెత్తవచ్చు.
మిధున
ఈ రాశి వారికి ఈరోజు కొంత పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. తమ కోసం తాము ఈ రాశి వారు కొంత సమయాన్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని పనుల కోసం ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.
కర్కాటకం
ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు తమ వ్యాపార నిర్ణయాలను తమ ఆత్మవిశ్వాసంతో తీసుకోవాలి. చిరు వ్యాపారులు ప్రభుత్వ పథకాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. డబ్బులు ఖర్చు ఎక్కువగా అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పొదుపు మంత్రాన్ని పాటించాలి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది.
సింహ
ఈ రాశి వారికి ఈరోజు డబ్బు పరంగా ఎలాంటి లోటు ఉండదు. ఈ రోజు ఈ రాశికి చెందిన వారు వారి బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఈరోజు చాలా బిజీగా గడుపుతారు. పనిభారం పెరగవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
కన్య
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో నెలకొన్న సమస్యలు తీరుతాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిలో మరింత కఠినమైన సమయాలను ఎదుర్కోవచ్చు. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈరోజు రుణాలు ఇవ్వకూడదు. అలాగే ఇతరుల పనుల్లో చేయి పెట్టకూడదు. వీరికి ఈరోజు దగ్గరి బంధువుల వల్ల బాధ కలగవచ్చు.
తుల
ఈ రాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయంలోని సహోద్యోగులతో మంచి మంచి సంబంధాన్ని కొనసాగిస్తారు. డబ్బు పరంగా ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి. భారీగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది. కానీ ఆ లాభంలో ఎక్కువగా ఖర్చు చేసేస్తారు.
వృశ్చిక
ఈ రాశి వారికి ఈరోజు కొంత అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు డబ్బు గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఇంట్లోకి కొత్త వస్తువులను తీసుకొచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సు
ఈ రాశివారు తమ వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కునే అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతి నెలకొంటుంది. ఆరోగ్యంలో కొంత మెరుగుదల ఉన్నప్పటికి కొన్ని సమస్యలు వెంటాడుతాయి. ఇంటికి దూరంగా ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. దేంతో ఒత్తిడి పెరగడంతో పాటు ఆర్ధిక భారం కూడా పెరుగుతుంది.
మకర
ఈ రాశి వారు ఈ రోజు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కష్టతరమైన రోజు అయినప్పటికీ మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారంలో భారీగా లాభాలు వస్తాయి.
కుంభ
ఈ రాశి వారు ఎదుర్కొంటున్న ఆర్ధిక పరమైన సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. అలాగే ఈ రాశి వారి జీవితంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది.
మీన
ఈ రాశి వారు ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. డబ్బు పరంగా ఈ రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొత్త ఆస్తి పాస్తులు కొనాలనుకున్నా ఈరోజు వీరికి అద్భుతమైన రోజుగా మారబోతుంది. ఆరోగ్యం విషయంలో కొంత ప్రతికూలత ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications