DAILY HOROSCOPE 2024: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ప్రమాద ఘడియలు ఉన్నాయి!

నేటి రాశి ఫలాలు చాలా రాశుల వారికి శుభప్రదంగానే ఉన్నాయి. కొన్ని రాశుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇంకొన్ని వాటికి ప్రమాద ఘడియలు గోచరిస్తున్నాయి. అయితే ఆ రాశులు ఏవి, ఏ రాశుల వారికి ప్రమాద ఘడియలు ఉన్నాయనేది, కింద పొందుపరచాము ఒక్కసారి చదవండి.

నేటి మంచి ఘడియలు

ముందుగా ఈరోజు శుభ ముహుర్తాలు, మంచి ఘడియలు, రాహు కాలాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

వర్జ్యం: ఉ. 6-34 నుంచి 8-05 వరకు తిరిగి తె. 4-28 నుంచి
అమృత ఘడియలు: మ. 3-39 నుంచి 5-10 వరకు
దుర్ముహూర్తం: మ. 12-10 నుంచి 12-57 వరకు తిరిగి 2-30 నుంచి 3-17 వరకు
రాహుకాలం: ఉ. 7-30 నుంచి 9-00 వరకు

Today s Rasi Fruits There are danger watches for this Rasi

రాశి ఫలాలు:

మేష రాశి: ఈ రాశి వారికి అంతా శుభకాలమే ఉంది. ఈ రాశి వారు వారి వారి రంగాల్లో అనుకున్న విధంగా అనుకోలా ఫలితాలను సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనులు మొదలుపెట్టడానికి ఇది సరైన సమయం. అనుకోని కొన్ని కారణాల వల్ల మానసిక సంతృప్తిని పొందుతారు. లక్ష్మీదేవి సందర్శన ఉత్తమం.

వృషభ రాశి: ఈ రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టతలు పెరుగుతాయి. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక మంచి శుభవార్త.. ఈ రాశివారిలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానొద్దు.

మిథున రాశి: ఈ రాశి వారికి, వారి వారి రంగాల్లో శ్రమ పెరుగుతుంది. కొన్ని కొన్ని వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలంగా లేనప్పటికీ.. సహనం కోల్పోకూడదు. పరిస్థితులన్నీ క్రమంగా సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. శ్రీలక్ష్మి సహస్రనామ పారాయణం చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి: ఈ రాశి వారు నుంచో చేయాలని అనుకుంటున్న పనులు దాదాపు పూర్తి కావస్తుంది. సమాజంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు.

సింహ రాశి: ఈ రాశి వారికి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి రంగాల్లో శుభవార్త వింటారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈశ్వర సందర్శన చేయాలి.
కన్య రాశి: ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. వ్యాపార రంగంలో అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన బుద్ధితో వ్యవహరించి, అనుకున్న పనులను పూర్తి చేస్తారు. శివారాధన చేయడం చాలా మంచిది.

తులా రాశి: అనుకున్న సమయానికి సహాయం చేసే వ్యక్తులు ఉంటారు. ఆటంకాలను అధిగమించి, అనుకున్న పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. శివుడిని పూజించాలి.

వృచ్చిక రాశి: ఈ రాశి వారికి వారి స్వధర్మమే వారిని రక్షిస్తుంది. ఈ రాశి వారికి ఒక సమస్య మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త తీవ్ర బాధను కలిగిస్తుంది. సుభ్రమణ్యభుజంగా స్తోత్రాన్ని పఠించాలి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల సహాకారంతో అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. అయితే కుటుంబ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. కొందరు వ్యక్తులు కావాలనే తప్పుదారి పట్టించే అవకాశముంటుంది.

మకరం: ఈ రాశి వారు చేసే పనుల కారణంగా సమాజంలో వారి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని కీలక వ్యవహారాల్లో పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. బంధు, మిత్రుల వలన మేలు జరుగుతుంది.

కుంభం: ఆర్ధిక వ్యవహారాల్లో ప్రమాద ఘడియలు గోచరిస్తున్నాయి. ఆ విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. చేపట్టే పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ఎప్పటి నుంచో ఉండిపోయిన కీలకమైన సమస్యను పరిష్కరించి, శత్రువుపై విజయం సాధిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన మంచిది.

మీనం: ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ఫలితాలు ఉంటాయి. ముఖ్యమైన పనులు పూర్తయ్యేందుకు అనుకున్న విధంగా ప్రణాళిక చేసుకుంటే మంచిది. ఎట్టి పరిస్థితిలోనూ మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, October 14, 2024, 8:44 [IST]
Desktop Bottom Promotion