Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
మీనరాశిలో శక్తివంతమైన త్రిగ్రాహి యోగం..ఈ రాశులకు అకస్మాత్తుగా డబ్బు,భారీ విజయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025లో అనేక పెద్ద గ్రహాల మార్పు వాటి ఫలితంగా శక్తివంతమైన యోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ గ్రహాల మార్పు, యోగాల ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలలో సూర్యుడు బుధుడు, శని కలయిక మీనరాశిలో ఉన్నప్పుడు త్రిగ్రాహి యోగం ఏర్పడబోతోంది. మీన రాశిలో ఏర్పడే ఈ త్రిగ్రాహి యోగం వల్ల కొన్ని రాశుల వ్యక్తులు ప్రత్యేక ప్రయోజనాలను పొందే బలమైన సూచలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ త్రిగ్రాహి యోగం వల్ల ఏ రాశి వారికి అదృష్టంలో మార్పు వస్తుందో చూడండి.
త్రిగ్రాహి యోగం వల్ల భారీగా లాభపడే రాశులివే
మిథునం
త్రిగ్రాహి యోగం ఏర్పడడం వల్ల మిథున రాశి వారికి అత్యంత ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. మీ పదవ ఇంట్లో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా పని,ఉద్యోగంలో మంచి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారి అన్వేషణ నెరవేరుతుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగవకాశాలు వస్తాయి. ఈ త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారంలో కొత్త ఒప్పందాన్ని పొందవచ్చు. పూర్వీకుల ఆస్తి నుండి మంచి ప్రయోజనాలను పొందవచ్చు. తండ్రితో మీ సంబంధం బలపడుతుంది.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి శని, సూర్యుడు, బుధ గ్రహాల కలయికతో ఏర్పడిన త్రిగ్రాహి యోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ త్రిగ్రాహి యోగం మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో మీ భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి,వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది, గృహ నిర్మాణం చేపట్టే లేదా కొనే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితిలో మంచి మెరుగుదల ఉంటుంది. అకస్మాత్తుగా మీకు ఎక్కడినుంచైనా డబ్బు రావచ్చు. మీ విశ్వాసం అనేక రెట్లు పెరుగుతుంది.
మీన రాశి
మీనరాశిని దేవగురువు పరిపాలిస్తారు. మార్చి నెలలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వలన ఇది మీన రాశి వ్యక్తులకు చాలా శుభసూచకం. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది, సమాజంలో మీ స్థానం,ప్రతిష్ట పెరుగుతుంది. మీన వారి వ్యక్తులు మూడు గ్రహాలైన సూర్యుడు, బుధుడు,శని యొక్క శుభ ఫలితాలను పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లాభ అవకాశాలు పెరుగుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. వివాహం పట్ల ఆసక్తి ఉన్న వారితో చర్చలు జరుపుతారు. అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు, వైవాహిక జీవితంలో ఆనందం, శాంతి, సామరస్యం ఉంటుంది. భాగస్వామ్య పని నుండి ప్రయోజనం పొందుతారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications