Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మే నెలలో భారీ అదృష్టం పట్టనున్న రాశులు ఇవే.. వీరు పట్టిందల్లా బంగారమే!
మే 13 నుండి 25 వరకు వృషభ రాశిలో గురుడు మరియు సూర్యుడు ఒకే రాశిలో సంచరించబోతున్నారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం, ఈ రెండు గ్రహాలు ఒకచోట కలవడం వల్ల కొన్ని రాశుల వారికి అనేక శుభఫలితాలు లభించే అవకాశం ఉంది. ఈ కాలంలో కార్యాలలో విజయాలు, ఆర్థికంగా వృద్ధి, ఆరోగ్య పరంగా మెరుగుదల, ఉద్యోగ అభివృద్ధి వంటి అంశాల్లో పాజిటివ్ మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం మరియు మకరం రాశుల వారు ఈ యోగఫలితాలను అనుభవించనున్నారు. వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? అనేది ఇక్కడ తెలుసుకుందాం..
మేషం:
ధన స్థానంలో గురు, సూర్యుల సమాగమం జరగడం వల్ల మేష రాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా మంచి లాభాలు కలుగుతాయి. పెండింగ్‌లో ఉన్న డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పితృ ఆస్తికి సంబంధించి విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, ప్రాధాన్యత లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.

వృషభం:
రాశిలోనే ఈ గ్రహాల కలయిక జరగడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునే వారికి శుభ వార్తలు ఉండవచ్చు. ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. స్థిరాస్తి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
కర్కాటకం:
ఈ రాశి వారికి లాభ స్థానంపై గురు, సూర్యులు దృష్టి వేయడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వస్తాయి. ఆకస్మిక ధనలాభం జరగవచ్చు. పెట్టుబడుల నుంచి మంచి ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రగతి, శుభకార్యాలు, సామాజిక గౌరవం పెరుగుతాయి.
సింహం:
ఈ రాశి వారికి దశమ స్థానంలో ఈ గ్రహాల సంయోగం జరుగుతుంది. దీని కారణంగా ఈ రాశి వారికి వృత్తి రంగంలో అభివృద్ధికి బలంగా తోడ్పడుతుంది. జీతభత్యాల్లో వృద్ధి, బాధ్యతలు పెరగడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
వృశ్చికం:
ఈ రాశి వారికి సప్తమ స్థానంలో గురు, సూర్యుల సమాగమం వల్ల జీవన భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. ఉద్యోగాల్లో వేగవంతమైన పురోగతి ఉంటుంది. విదేశీ అవకాశాలు లభించవచ్చు. సంపాదన మార్గాలు పెరుగుతాయి. ఆర్ధిక కస్టాలు దూరమవుతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
మకరం:
ఈ రాశి వారికి పంచమ స్థానంలో గురు-సూర్యుల కలయిక వల్ల పిల్లల విద్యలో పురోగతి, శుభవార్తలు వింటారు. ఫైనాన్స్, షేరు మార్కెట్ లావాదేవీల్లో లాభాలు పొందగలుగుతారు. ప్రభుత్వ గుర్తింపు, విదేశీ అవకాశాలు, కుటుంబంలో శుభకార్యాల అవకాశాలు కూడా ఉంటాయి. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే, పై రాశుల వారికి వ్యక్తిగతంగా మరియు వృత్తిపరంగా ఎంతో ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications