Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గోళ్లను చూసి వ్యక్తిత్వం చెప్పవచ్చు.. చెక్ చేసుకోండి..?
చెట్టు పండు ఎలా ఉంటుందో విత్తనం లోపలే ఉంటుందని ఓ సామెత ఉంది. మనుషులు కూడా వారి వ్యక్తిత్వం, ప్రవర్తన, అలవాట్లు ఇవన్నీ ముందుగానే నిర్ణయించి ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అరచేతి మీద ఉండే రేఖలను బట్టి జ్యోతిష్యం చెబుతారు. పుట్టిన జన్మతేదీని బట్టి జ్యోతిష్యం చెబుతారు. బొటనవేలి ముద్రను చూసి జ్యోతిష్యం చెబుతారు. ఇలా జ్యోతిష్యం చెప్పడంలో రకరకాల పద్ధతులను పాటిస్తారు.
చేతి గోళ్ల తీరు, రకాన్ని చూసి కూడా మనిషి వ్యక్తిత్వం చెప్పే జ్యోతిష్యం వుంది. గోళ్లు పొడవుగా వుంటే ఒక వ్యక్తిత్వం, చిన్నగా ఉంటే మరో వ్యక్తిత్వం.. ఇలా గోళ్ల ఆకారాన్ని బట్టి వ్యక్తిత్వాలను అంచనా వేశారు. ఈ ఆర్టికల్‌లో మీకు వీటికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తారు. మీ చేతి గోళ్ల సైజును బట్టి మీరెలాంటి వారో కూడా మీకు మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు.
చేతి గోళ్లను బట్టి వ్యక్తిత్వం ఇలా ఉంటుందని కొందరు నిపుణుల అంచనా :
చేతి వేళ్ల గోళ్లు నిలువుగా పొడవుగా వుంటే వారిలో సృజనాత్మకత ఎక్కువగా ఉందని అంటున్నారు. ప్రతీ ఒక్క విషయంలో మీకు ఓ స్పష్టం ఉంటుంది. అటు లాజికల్‌గా ఉంటూ కళాత్మకంగా కూడా మీరు ఉండగలుగుతారు. మీరు చేసే పనులను బాగా ఇష్టపడి చేస్తారు. ఒక పనిని మొదలుపెడితే పూర్తి చేసేవరకు పట్టదలతో కొనసాగిస్తారు.

వ్యక్తిగతంగా చాలా మృదుస్వభావిగా వుంటారు. కానీ పరిస్థితి చేయిదాటితే మీలో ఎప్పుడూ లేని ఆగ్రహం, కోపం కనిపిస్తుంది. ఒత్తిడిని మీరు అదుపులో పెట్టుకునే నైపుణ్యం మీకు వుంది. కానీ కొన్ని విషయాల వల్ల మీరు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి వుంటుంది. స్వయం నియంత్రణను పెంచుకోగలిగితే మీరు మరిన్ని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు.
గోళ్లు వెడల్పుగా వుంటే
వేలు గోళ్లు కొందరిలో వెడల్పుగా వుంటాయ్. ఇలాంటి గోళ్లు వుండే వాళ్ల వ్యక్తిత్వం కొంత భిన్నంగా వుంటుంది. ఇలాంటి వారు మనసులో ఏదీ దాచుకోకుండా తమకు తోచిన విధంగా వుంటారు. బాధ్యతలను గుర్తిస్తారు. చాలా బాద్యతతో వ్యవహరిస్తారు. పని మొదలు పెడితే దాన్ని బాగా పూర్తి చేయాలనే ఉద్యేశ్యంతో వుంటారు. ఏ పనులనూ నామమాత్రంగా పూర్తి చేయరు.
ఇలాంటి వారికి నాయకత్వ లక్షణాలు సహజంగా వుంటాయ్. సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. సంబంధాలు కొనసాగించడంలో ఇలాంటి వారు ముందుంటారు. ఈ వ్యక్తిత్వం గలవారు ఇతరులను ఎక్కువగా ప్రభావితం చేస్తారు.
వ్యక్తిగత అంశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంటారు. మీతో ఉన్నవారు మీతో చాలా సురక్షితంగా ఉన్న అనుభూతిని పొందుతారు. వీరితో కొంత మంది విభేదించవచ్చు.
గుండ్రటి గోళ్లు
గుండ్రటి గోళ్లు ఉన్నవారు ఏ విషయాన్నైనా త్వరగా నేర్చుకుంటారు. గుర్తింపును సాధించడానికి ప్రయత్నిస్తారు. అందరితో కలిసిపోయే స్వభావాన్ని కలిగి వుంటారు. చుట్టూ వున్నవారికి వీరు అలరిస్తుంటారు.
బాదాం షేపులో గోళ్లు వుంటే
ఇలాంటి గోళ్లు వున్న వారు వ్యక్తిత్వంలో చాలా నిజాయితీగా వుంటారు. చాలా మర్యాదపూర్వకంగా వుంటారు. చాలా సున్నిత స్వభావాన్ని కూడా కలిగి వుంటారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే చూస్తూ సహించలేరు.
పైన ఇచ్చిన సమాచారాన్ని బట్టి మీ చేతి గోళ్లు సైజు తీరును బట్టి మీ వ్యక్తత్వం నిజంగా చెప్పిన విధంగానే వుందా లేదా వేరుగా వుండా చెక్ చేసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications