Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Ugadi 2025 astrology: అదృష్టం తలుపు తడుతోంది..ఈ 4 రాశుల వారికి ఉగాది నుంచి రాజయోగం ఖాయం,మీ రాశి ఇందులో ఒకటా?
ఈ ఏడాది మార్చి 30వ తేదీన తెలుగువారి తొలి పండుగ ఉగాది జరుపుకుంటారు. పురాణాల ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అంటే ఉగాది రోజునే సృష్టి జరిగిందని చెబుతుంటారు. ఉగాది అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చిది పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి. ఉగాది నాడు పండితులు లేదా జ్యోతిష్యులు ఊర్లలో గుడిలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో చదివి వినిపిస్తుంటారు. ఇప్పుడంటే యూట్యూబ్ అవీ ఇవీ వచ్చాయి కానీ ఒకప్పుడు అయితే గుడిలోనే పంచాగం శ్రవణం చేసేవాళ్లు..చాలామంది హాజరై దానిని వింటుండేవాళ్లు.
ఉగాది..తెలుగువారికి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక నూతన అధ్యాయానికి ప్రారంభం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 30వ తేదీ నుంచి అంటే ఉగాది నుంచే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రతి రాశి వారికి తమ తమ గ్రహస్థితి, దశల ఆధారంగా ఫలితాలు మారుతూ ఉంటాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2025 ఉగాది నుండి కొన్ని రాశుల వారికి గ్రహాల అనుకూలత వల్ల అద్భుతమైన యోగం కలగబోతోంది. వాళ్లకు విపరీతమైన అదృష్టం కలిగి అనుకూల ఫలితాలు పొందుతారు. ఏయే రాశులకు అదృష్టం ఏఉంటుందో,వారి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇక్కడ చూడండి.

వృషభ రాశి
వృషభ రాశి వారికి 2025 ఉగాది నుండి జీవితం ఒక స్వర్ణ యుగంలా సాగిపోతుందని పండితులు చెబుతున్నారు. అదృష్ట కాలం ప్రారంభమవుతుంది. అన్ని విధాలా కలిసివస్తుంది. ముఖ్యంగా వృత్తిపరంగా ఊహించని విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు, జీతంలో పెరుగుదల వంటి శుభవార్తలు అందుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా కూడా మీరు బలంగా ఉంటారు. ధన ప్రవాహం పెరుగుతుంది..గతంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. కుటుంబ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. మీరు మరింత ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది.
సింహ రాశి
సింహ రాశి వారికి 2025 ఉగాది నుండి జీవితం ఒక వెలుగు జిలుగుల పండుగలా సాగుతుంది. ఉగాది నుండి అదృష్టం తలుపు తట్టబోతోంది. వీరికి ఇది రాజయోగం పట్టే సమయం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. వృత్తిపరంగా మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ లక్షణాలు కలిగిన సింహ రాశి వారు ఈ సమయంలో ఉన్నత పదవులను అధిరోహిస్తారు. ఆర్థికంగా కూడా మీరు బలపడతారు. ధన సంపాదన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. పెళ్లి కాని వాళ్లకు త్వరలో వివాహం జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. యోగా, ధ్యానం వంటి వాటిపై శ్రద్ధ పెడితే మరింత ప్రయోజనం ఉంటుంది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి 2025 ఉగాది నుండి జీవితం ఒక నూతన ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఉగాది నుండి అదృష్టం వెన్నంటే ఉంటుంది. వీరికి ఇది అద్భుతమైన అవకాశాల సమయం. మీరు ఏ పని మొదలుపెట్టినా విజయం మీ వెంటే ఉంటుంది. వృత్తిపరంగా మీరు కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలు విజయవంతమవుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి, ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి ఇది మంచి సమయం. ఆర్థికంగా మీరు చాలా లాభపడతారు. ధన ప్రవాహం పెరుగుతుంది. మీరు చేసే పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీరు ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీరు మరింత ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది.
మీన రాశి
మీన రాశి వారికి 2025 ఉగాది నుండి జీవితం ఒక ప్రశాంతమైన సముద్రంలా సాగిపోతుంది. అదృష్టం మీ వెంటే నడుస్తుంది. అన్ని రంగాల్లోనూ విజయాలు సాధిస్తారు. మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. వృత్తిపరంగా మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఆర్థికంగా కూడా చాలా బలంగా ఉంటారు. ధన సంపాదన పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. మీరు చేసే పెట్టుబడులు లాభాలను తెచ్చిపెడతాయి. గతంలో ఉన్న అప్పులు తీరిపోతాయి. మీరు ఆర్థికంగా స్థిరత్వం సాధిస్తారు. కుటుంబ జీవితం ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications