Karkataka Rasi Ugadi Rasi Phalalu 2022: ఉగాది‘శోభకృత నామ’ సంవత్సరంలో కర్కాటకరాశికి ఆశాజనంగా ఉంటుంది.!

Karkataka Rasi Ugadi Rasi Phalalu 2022: ఉగాది‘శోభకృత నామ’ సంవత్సరంలో కర్కాటకరాశికి ఆశాజనంగా ఉంటుంది.!

Ugadi Rasi Phalalu 2023 to 2024: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం (ఉగాది)2023-2024 కర్కాటక రాశి యొక్క ఆదాయం-11, వ్యయం-8, రాజపూజ్యం-5 మరియు అవమానం-4.

హిందూ పంచాంగం ప్రకారం.. శుభకృత్ నామ సంవత్సరం మార్చి 21న ముగుస్తుంది. ఆ తరువాత కొత్త ఏడాది మార్చి 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 08, 2024న ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆ ప్రకారం.. కొత్త ఏడాదికి రాజు బుధుడు, మంత్రి శుక్రుడు కాబోతున్నాడు. ఈ హిందూ సంవత్సరంలో మీ రాశి ప్రకారం..వృత్తి, ఆర్థిక, ఆరోగ్య జీవితం వంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Ugadi Rasi Phalalu 2023 Karkataka Rasi; Karkataka Rasi Ugadi Horoscope Predictions in Telugu

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ ఏడాదిలో కర్కాటక రాశికి ఈ సంవత్సరం బృహస్పతి 10వ ఇంట్లో ఉంటారు. శని మీ 8వ ఇంట్లో.. కేతువు 5వ ఇంట్లో ఉంటారు. ఈ ఏడాది కర్కాటక రాశికి మిశ్రమంగా ఉంటుంది. అలాగే కేతువు 4వ స్థానమునందు సంచరిస్తోంది. ఈ స్థితి వల్ల కర్కాటకరాశి వారికి ఈ సంవత్సరంలో శని ప్రభావం చేత ఇబ్బందికరమైనటువంటి స్థితి ఏర్పడినది.

గ్రహాల సంచారం

గ్రహాల సంచారం

గురుడు:-సంవత్సర ప్రారంభం నుండి భాగ్యస్థానమున సంచారం చేసి ఏప్రిల్ 21 తేదీ నుండి దశమ స్థానం నందు సంచారం చేయను.

శని:-ఈ సంవత్సరం అంతా అష్టమ స్థానము నందు సంచారం చేయును అష్టమ శని. ఈ ఏడాదిలో శని గ్రహం వల్ల ప్రతికూల ఫలితాలు రావొచ్చు. అనుకున్న సమయానికి పనులు జరగకపోవచ్చు. చాలా పనులు పెండింగులో పడిపోవచ్చు. మీరు కొంత సొమ్ము నష్టపోయే అవకాశం ఉంది.

రాహు:- సంవత్సర ప్రారంభం నుండి దశమ స్థానము నందు సంచారం అక్టోబర్ 31 నుండి భాగ్యస్థానం నందు సంచారం చేయును.రాహువు దశమ భాగంలో సంచారం చేయడం వల్ల విదేశాల్లో ఉద్యోగం చేసే వారికి, అధికారుల నుండి మద్దతు లభిస్తుంది. రవి, కుజ, గురు, బుధ, శుక్ర సంచారాల వల్ల మంచి ఫలితాలొస్తాయి. భూ సంబంధిత, వ్యాపారంలో మంచి లాభాలు రావొచ్చు.

కేతువు:-సంవత్సర ప్రారంభం నుండి చతుర్ధ స్థానము నందు సంచారం చేసి అక్టోబర్ 31 నుండి తృతీయ స్థానం నందు సంచారం చేయును.కావున మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవచ్చు. దీని వల్ల మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

 ఆర్థిక పరంగా

ఆర్థిక పరంగా

‘శోభకృత్' నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలొస్తాయి.ఈ ఏడాది ఆర్థిక లాభాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి. పెట్టుబడులు నష్టాలను చవిచూడవచ్చు. ఆర్థిక మోసాల పట్ల జాగ్రత్త వహించండి. గురు అనుగ్రహం వల్ల కొత్త ఏడాదిలో ఆశించిన ఫలితాలొస్తాయి. రాజకీయాల్లో ఉండే వారికి మంచి పదవులు రావొచ్చు. మీకు ఆర్థిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది.

ఆరోగ్య పరంగా

ఆరోగ్య పరంగా

మీరు మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారు. మీ లక్ష్యాలను సాధించేందుకు ఇవి సహాయపడతాయి. మీరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, ఒత్తిడిని అధిగమించడం చేయాలి.

కుటుంబం:

కుటుంబం:

కుటుంబమునకు సంబంధించిన విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈ కాలంలో మీకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించాలి. కుటుంబ ఆర్థిక వ్యవహారాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబంలో ఏదైనా సమస్యలుంటే.. వాటి పరిష్కారాల కోసం ప్రయత్నించాలి.

 వివాహం:

వివాహం:

కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో కళ్యాణానికి సంబంధించిన సానుకూల ఫలితాలను పొందుతారు. నిబద్ధత, దీర్ఘకాలిక సంబంధాలలో మీకు మంచి అవకాశాలొస్తాయి. కొందరు వ్యక్తులు ప్రేమ వివాహం చేసుకోవచ్చు. నిజాయితీగా ఉండటం వల్ల మీరు మంచి భాగస్వామిని పొందొచ్చు.

విద్యార్థులకు :

విద్యార్థులకు :

కర్కాటక రాశి విద్యార్థులకు మధ్యస్త ఫలితాలు ఏర్పడుతున్నాయి. కష్టపడాల్సినటువంటి సమయము. మీరు విద్య పట్ల మంచి ఏకాగ్రతతో ఉంటారు. ఎలాంటి సమాచారం అయినా సులభంగా గ్రహించగలరు. మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం.

కర్కాటక రాశి స్త్రీలకు:

కర్కాటక రాశి స్త్రీలకు:

కర్కాటక రాశి స్త్రీలకు కుటుంబ సమస్యలు మరియు ఆర్థిక సమస్యల వలన ఇబ్బందులు ఏర్పడును. కర్కాటక రాశి రైతాంగానికి అంత అనుకూలంగా లేదు. కర్కాటక రాశి సినీ రంగం వారికి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి.

ఉద్యోగస్తులకు..

ఉద్యోగస్తులకు..

కర్కాటక రాశివారికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరమందు ఉద్యోగస్తులకు మధ్యస్త ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగము నందు రాజకీయ ఒత్తిడులు ఏర్పడినప్పటికి మీయొక్క కృషితో విజయము వైపు దూసుకుపోవుదురు.

కర్కాటక రాశికి అద్రుష్ట సంఖ్య

కర్కాటక రాశికి అద్రుష్ట సంఖ్య

కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్యలు 2 మరియు 6. చంద్రుడు కర్కాటక రాశిని పాలించే గ్రహం. జ్యోతిష్యశాస్త్రం యొక్క 2023 సంవత్సరారినిక సంబంధించిన మొత్తం సంఖ్య 7 అవుతుంది. మొత్తానికి ఈ సంవత్సరం కర్కాటక రాశిలో జన్మించిన వారికి సగటు కంటే మెరుగ్గా ఉంటుంది.

కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే కొన్ని జ్యోతిష్క పరిష్కారాలు:

కర్కాటక రాశివారు ఈ సంవత్సరం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే కొన్ని జ్యోతిష్క పరిష్కారాలు:

ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఉపవాసం ఉండండి.

సోమవారం రోజున చంద్రశేఖర అవాతారంలో ఉన్న శివుడిని పూజించాలి

శివాష్టకం లేదా శ్రీ శివ సహస్రనామ స్త్రోత్రాన్ని పటించడం వల్ల ఉత్తమ ఫలితాలు పొందుతారు.

సోమవారం ఉపవాసం మీ ఆరోగ్యానికి మంచిది అలాగే వ్యాపారంలో మంచి పురోగతి.

నాణ్యమైన ముత్యాల రత్నాన్ని ధరించడం మీకు అన్ని విధాలా కలిసొస్తుంది.

గమనిక: ఈ ఫలితాలు అనేవి అన్నివర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాము. మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రేమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనిభవంలోకి వస్తాయి.

ఈ సంవత్సరం మన జీవిత కాలంలో మరో మైలురాయి ఈ కొత్త ఏడాది.. ఈ ఏడాది అంతా మీకు జయాలే కలగాలని ఆశిస్తూ.. శోభ కృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

Desktop Bottom Promotion