Latest Updates
-
మిథునం, సింహం, ధనస్సు రాశుల వారికి ఈ వారం అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - 07 నుండి 13 జూన్ 2026 వరకు -
సింహం, ధనుస్సు, మీన రాశుల వారికి అదృష్ట యోగం.. ఆదివారం మీ జాతకం ఎలా ఉంది? - ఆదివారం, 07 జూన్ 2026 -
ముంబై స్టైల్ మసాలా ప్యాటీస్ పావ్.. వర్షం పడుతుంటే వేడివేడిగా తింటుంటే మస్త్ మజా..! -
శని దేవుడి కటాక్షం: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం మీదే! -
మనసు ప్రశాంతంగా ఉండట్లేదా? పురాతన హిందూ ధ్యాన పద్ధతులు జీవితాన్నే మార్చేస్తాయి -
వివాహిత స్త్రీ వేరొకరి పట్ల ఆకర్షితురాలవుతోందని సూచించే సంకేతాలివే! -
రాహుకాలం అంటే ఏంటి? ఈ టైంలో పుడితే అన్నీ కష్టాలేనా?..అదృష్టాన్ని తెచ్చే జ్యోతిష్య రహస్యం! -
ఫోన్ పాస్వర్డ్లే ఇప్పుడు భార్యాభర్తల మధ్య పెద్ద అనుమానాలకు కారణమవుతున్నాయా -
సండే స్పెషల్: పప్పుచారులోకి అదిరిపోయే సైడ్ డిష్ గ్రీన్ మసాలా కింగ్ ఫిష్ ఫ్రై..ఇంట్లోనే ఇలా ఈజీగా -
రోజుకో పెగ్గు ఆరోగ్యానికి మంచిదా?..మీకు ఈ నిజం తెలుసా?
శ్రీ యంత్రంతో ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా? ఇట్ల చేస్తే డబ్బు,కీర్తి..సమస్యలన్నీ ఫసక్!
ఏ వ్యక్తి అయినా జీవితంలో బాగా డబ్బుండాలి,మంచి ఆరోగ్యం ఉండాలి, అంతులేని ఆనందం ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ కలలను సాకారం చేసుకోవాలంటే మన చుట్టూ, మనలోనూ నిరంతర సానుకూల శక్తి ప్రవహిస్తూ ఉండాలి. మన ఆలోచనలు, మన పరిసరాలు ఎల్లప్పుడూ శుభప్రదంగా, శక్తివంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఈ సానుకూల శక్తిని మన జీవితంలోకి నిరంతరం ఆహ్వానించడానికి ఒక అద్భుతమైన, శక్తివంతమైన పరిష్కారమే శ్రీ యంత్రం.
విశ్వశక్తికి ప్రతిరూపం
శ్రీ యంత్రం సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి, విద్యాస్వరూపిణి సరస్వతీ దేవిలకు ప్రతీక. ఇది కేవలం ఒక రేఖాచిత్రం కాదు, విశ్వానికి, సృష్టి రహస్యాలకు అద్దంపట్టే ఒక దివ్యమైన నిర్మాణం. దీని ప్రత్యేకత దాని అద్భుతమైన జ్యామితీయ నిర్మాణంలోనే దాగి ఉంది. శ్రీ యంత్రంలో తొమ్మిది ప్రధాన త్రిభుజాలు ఉంటాయి. ఈ తొమ్మిది త్రిభుజాల కలయికతో అద్భుతంగా 43 చిన్న త్రిభుజాలు రూపుదిద్దుకుంటాయి. ప్రతి త్రిభుజం ఒక నిర్దిష్ట శక్తికి, దేవతకు నిలయం.

నిర్మాణం అద్భుతం
ఈ దివ్య యంత్రంలో ఒక బిందువు, దాని చుట్టూ వివిధ స్థాయిలలో త్రిభుజాలు, అష్టభుజాలు, అంతర్దశ (పది లోపలి కోణాలు), బహిర్దశ (పది బయటి కోణాలు), చతుర్దశ (పద్నాలుగు కోణాలు), అష్టదళ కమలం (ఎనిమిది రేకుల పద్మం), షోడశదళ కమలం (పదహారు రేకుల పద్మం), మూడు వృత్తాలు, మూడు భూపురాలు (బయటి చతురస్రాకార ఆవరణలు) ఉంటాయి.
శ్రీ యంత్ర పూజతో కలిగే అపారమైన ప్రయోజనాలు
శ్రీ చక్ర యంత్రాన్ని భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల మీ జీవితంలో ఊహించని గొప్ప మార్పులు సంభవిస్తాయని పండితులు చెబుతుంటారు. దీనిని పూజించడం వల్ల ధనలాభం, ఆర్థిక స్థిరత్వం, చదువులో విజయం, జ్ఞాపకశక్తి, ఉన్నత విద్యావకాశాలు, దీర్ఘాయుష్షు,సమాజంలో గౌరవం,మనశ్శాంతి, మోక్షమార్గానికి దారి చూపుతుందని చెబుతుంటారు.
శివశక్తి స్వరూపం
శ్రీ యంత్రంలో 4 శివ చక్రాలు (ఊర్ధ్వముఖ త్రిభుజాలు - పురుష తత్వం), 5 శక్తి చక్రాలు (అధోముఖ త్రిభుజాలు - స్త్రీ తత్వం) ఉంటాయి. ఈ శివశక్తి తత్వాల సమన్వయమే సృష్టికి మూలం. ఈ యంత్రంలోని 43 త్రిభుజాలు, 28 మర్మ స్థానాలు (శక్తి కేంద్రాలు), 24 సంధులు (జంక్షన్లు) అపారమైన దైవశక్తికి ప్రతీకలు. ఇది మీ ఆధ్యాత్మిక పురోగతికి మార్గం సుగమం చేసి, ఆత్మసాక్షాత్కారం, జ్ఞానోదయానికి సహాయపడుతుందని ప్రగాఢ విశ్వాసం.
ఈ లింక్ పై క్లిక్ చేసి శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేయవచ్చు.
శని దోష నివారణకు శ్రీ యంత్రం
ముఖ్యంగా శని జయంతి వంటి పవిత్ర సమయాల్లో లేదా ఏల్నాటి శని ప్రభావంతో బాధపడుతున్నవారు శ్రీ యంత్రాన్ని కొనుగోలు చేసి పూజించడం ప్రారంభిస్తే, మీ ప్రతికూల సమస్యలన్నీ తొలగిపోతాయి. సంపదకు సంబంధించిన అడ్డంకులతో పాటుగా శని గ్రహం వల్ల కలిగే కష్టాలు కూడా తగ్గుముఖం పడతాయి.
శ్రీ యంత్రాన్ని ఎలా ఉపయోగించాలి?
చాలామంది శ్రీ యంత్రాన్ని తమ పూజా మందిరంలో ఉంచి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధిస్తారు. కొందరు దీనిని తాయెత్తుగా ధరిస్తారు, ఇది సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంటి ప్రధాన ద్వారానికి శ్రీ యంత్ర పటాన్ని లేదా విగ్రహాన్ని వేలాడదీయడం వల్ల దుష్టశక్తులు దూరమవుతాయని, గృహంలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుందని నమ్ముతారు. హిందూ దేవాలయాలలో కూడా శ్రీ యంత్ర చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఒక ప్రత్యేక స్థానంలో ఉంచి పూజించడం మనం చూడవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications