Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మకరరాశి గురించి ఎవ్వరికీ తెలియని ఈ రహస్యాలు మీకు తెలుసా..? మీది ఈ రాశేనా..?
మనిషి వ్యక్తిత్వం ఎలా వుంటుందనేది జ్యతిష్యంలో పుట్టుని తేదీ, రాశి, జాతక చక్రం ఆధారంగా చెబుతారు. జ్యోతిష్యంలో మొత్తం 12 రాశులుంటాయ్. ఈ అన్ని రాశులపై గ్రహాల ప్రభావం వుంటుంది. ఈ గ్రహాల ప్రభావం వల్ల వారివారి జాతకం, జీవన విధానం మారిపోతూ వుంటుంది. అయితే ఈ పన్నెండు రాశుల్లో మకర రాశికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను, రహస్యాలను తెలుసుకుందాం. డిసెంబర్ 21 నుంచి జనవరి 19 మధ్యలో పుట్టిన వారిని మకర రాశికి చెందిన వారిగా గుర్తిస్తాము. ఈ రాశికి చెందిన వారు ఎప్పుడు అలెర్ట్‌గా వుంటారు. వీరికి సంకల్పబలం ఎక్కువగా వుంటుంది. వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులోవడానికి ఇష్టపడరు. జీవితంలో వీరు ఒక లక్ష్యాన్ని కలిగి వుంటారు. వీళ్లు ఏదీ గుడ్డిగా నమ్మరు. చాలా సూక్ష్మ పరిశీలన చేసిన తరువాతే అన్నీ తెలుసుకొని ముందుకు వెళ్తారు. ఎదుటివారిలో ఏదైనా లోపం వుంటే చాలా త్వరగా గ్రహించగలుగుతారు. వీరి తాము చెప్పిందే చేసుకుంటూ వెళ్తుంటారు.

ఇతరులను వీరు చాలా సులభంగా ఆకట్టుకోగలుగుతారు. వీరి ఎవరినైనా సహాయం అడగ్గానే ఎదుటివారు ఆ సహాయాన్ని చేసి పెడతారు. వీరు స్వార్థపరులని తెలిసి కూడా వీరికి తోడ్పాటును అందించడానికి ముందుకు వస్తారు. వీరి తమలోని స్వార్ధాన్ని కొంత తగ్గించుకుంటే ఎందరికో మేలు చేసినవారౌతారు.
ఈ రాశికి చెందిన వారికి ఒక రంగమంటూ ప్రత్యేకంగా ఇష్టముండదు. జీవితంలో వీరు ఎవ్వరినీ నమ్మరు. కానీ అందరినీ నమ్ముతున్నట్టు వీరు నటిస్తారు. ఎప్పుడూ ఒంటరిగా జీవిస్తుంటారు. ఎవ్వరినీ దగ్గరకు చేర్చుకోరు. వీరి మనసులో కూడా ఎవ్వరికీ చోటునివ్వరు. విశ్రాంతి లేకుండా శ్రమించే తత్వం వీరికి వుంటుంది.
కానీ వీరికి కొన్ని బలహీనతలు కూడా వున్నాయ్. ఏపనినైనా చాలా నెమ్మదిగాచేస్తుంటారు. కానీ మొదలుపెట్టిన పనిని మాత్రం పూర్తి చేస్తారు. కొంత చాదస్త లక్షణం వుంటుంది. వీరు విజయం సాధించడానికి కూడా వీరి చాదస్త లక్షణమే కారణం. కొన్ని సందర్భాల్లో వీరు చాలా కఠినంగా వ్యవహరిస్తారు, చాలా క్రూర స్వభావాన్ని కలిగి వుంటారు. జీవితంలో ఎక్కువ మార్పులు వుండడం కూడా వీరికి నచ్చదు. అయితే ఎన్ని సమస్యలు వచ్చినా ధీటుగా ఎదుర్కొనే తత్వాన్ని కలిగి వుంటారు. వీరికి న్యాయవాద వృత్తి మాత్రమే అనుకూలిస్తుంది. ఇతర ఏ వృత్తులతో కూడా వీరు ఇమడలేరు. పంచాయితీ, రెవెన్యూకు సంబంధించిన ఉద్యోగాలు కూడా వీరికి అనుకూలిస్తాయ్.

ప్రేమ వివాహాలకు వీరు చాలా దూరంగా వుంటారు. ఏదైనా లాభం జరుగుతుందనిపిస్తే మాత్రమే దాన్ని వివాహం కింద మార్చుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తమ భర్తలతో గొడవకు దిగుతారు. ఇది క్రమంగా ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతుంది. వీరి జీవితం మొత్తం కష్టార్జితంపై ఆధారపడి వుంటుంది. కొంతకాలం వీరు పేదరికాన్ని కూడా చూడవచ్చు. ఈ రాశికి చెందిన వారికి స్థిరాస్థులు ఎక్కువగా వుంటాయ్. 30 ఏళ్ల తరువాత మాత్రమే వీరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పటి వరకు వీళ్లు కష్టాలను ఎదుర్కోక తప్పదని చెప్పుకోవచ్చు.
మకరరాశి వారికి స్త్రీల వలన అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న గొడవలు వున్నా అవన్నీ తీరిపోతాయ్. ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు చాలా ఎక్కువగా వుంటాయ్. దైవానుగ్రహం వీరికి వుండడం వల్ల దేవుడి ఆశీస్సులు లభిస్తాయ్. బంధువుల నుంచి కన్నా బయటి నుంచే వీరికి సహాయం ఎక్కువగా అందుతూ వుంటుంది. మకర రాశివారికి మోసం చేయనంత వరకు వీరు ఎవ్వరినీ మోసం చేయరు. పక్కవారి మాటలు విని నిర్ణయాలు తీసుకోవడం వల్ల వీరి ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications