Latest Updates
-
JEE మెయిన్ రిజల్ట్ టెన్షన్ ఉందా? చాణక్యుడి ఈ సూత్రాలు పాటిస్తే విజయం మీదే -
జంక్ ఫుడ్ వద్దు.. కుర్ కురేకి బదులు ఇంట్లోనే క్రిస్పీ బెండకాయ పకోడీ చేసుకోండిలా! -
పదే పదే నీళ్లు తాగుతున్నారా? సద్గురు చెబుతున్న ఈ షాకింగ్ నిజాలు తెలుసుకోండి! -
బరువు తగ్గాలా? జిమ్ తర్వాత ప్రొటీన్ కావాలా? అయితే ఈ నల్ల శెనగల సలాడ్ మీ కోసమే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరుచుకోండి! -
5 నిమిషాల్లో అదిరిపోయే ఎగ్ బర్గర్.. టేస్ట్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే! -
అక్షయ తృతీయ 2026: ఈ సమయం దాటితే పూజ ఫలితం ఉండదా? -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. ఎవరికి అదృష్టం వరించనుంది? - సోమవారం, 20 ఏప్రిల్ 2026 -
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి!
అనుకున్న పనులు ఆగిపోతున్నాయా? ఈ రహస్యం తెలుసుకోండి ఖచ్చితంగా విజయం సాధిస్తారు
మనం ఎంతో ఉత్సాహంగా ఒక ముఖ్యమైన పని మీద బయలుదేరుతాం. కానీ కొన్నిసార్లు అన్నీ అనుకున్నట్లు జరగవు. దారిలో అనుకోని అడ్డంకి, మనసును పక్కదారి పట్టించే ఫోన్ కాల్, లేదా పని పూర్తికాకుండానే వెనుతిరగాల్సిన పరిస్థితి.. ఇలాంటివి మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్లు అనిపిస్తుంది. నిజానికి ఇదంతా కేవలం యాదృచ్చికం కాదు. ఇది మన శరీరంలో దాగి ఉన్న పంచభూతాల ఆట.
మనందరి శరీరం.. నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం అనే ఐదు మూలకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ మూలకాలే మన ఆలోచనలను, శక్తిని, చివరికి మనం చేసే పనుల ఫలితాలను కూడా ప్రభావితం చేస్తాయి. వీటి మధ్య సమతుల్యత లోపించినప్పుడు మన ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి, పనులు మధ్యలోనే ఆగిపోతాయి.

అసలు సమస్య ఎక్కడ మొదలవుతుంది?
జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం దీనికి ప్రధాన కారణం అగ్ని, వాయు తత్వాలు పెరగడమే. మీరు ఇంట్లో నుంచి బయలుదేరే సమయంలో లేదా మీరు ప్రయాణించే దిశలో ఈ రెండు మూలకాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మీ పనిలో విజయం సాధించే అవకాశాలు తగ్గుతాయి. ఎందుకంటే అగ్ని, వాయువు రెండూ చంచల స్వభావం కలవి. ఇవి మనలో అశాంతి, అసహనం, నిలకడలేమిని సృష్టిస్తాయి. ఫలితంగా మన ఏకాగ్రత దెబ్బతింటుంది, మనసు పక్కదోవ పడుతుంది. పనులు తప్పుగా జరిగే ప్రమాదం ఉంటుంది. ఈ శక్తిని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఒక అద్భుతమైన, సులభమైన పరిష్కారం ఉంది.
జల తత్వాన్ని మేల్కొలపండి..విజయాన్ని అందుకోండి
ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టే ముందు ఒక్క నిమిషం ప్రశాంతంగా నిలబడండి.
మీ ముక్కు ద్వారా నెమ్మదిగా లోతైన శ్వాస తీసుకోండి. మీకు వీలైనంత గాలిని ఊపిరితిత్తులలోకి నింపండి.కొన్ని క్షణాలు శ్వాసను బంధించి, మనసులో "వం" (VAM) అనే బీజ మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ "వం" అనే మంత్రం జల తత్వానికి (నీటి మూలకం) సంబంధించినది. జల తత్వం స్థిరత్వానికి, సమతుల్యతకు, ప్రశాంతతకు, అదృష్టానికి ప్రతీక. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మీరు మీలోని జల తత్వాన్ని జాగృతం చేస్తారు. దీనివల్ల మీ అంతర్గత శక్తి స్థిరపడుతుంది, మనసు కేంద్రీకృతమవుతుంది. మీరు బయటకు అడుగుపెట్టినప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తుంది.
ముందడుగు వేసేటప్పుడు ఈ నియమం మర్చిపోవద్దు
ఈ ప్రక్రియ పూర్తయ్యాక మరో ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మీరు ఏ ముక్కు రంధ్రం ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకుంటున్నారో గమనించి అదే వైపు పాదాన్ని ముందు పెట్టి బయటకు వెళ్ళాలి. ఉదాహరణకు కుడి ముక్కుతో శ్వాస నడుస్తుంటే కుడి పాదం, ఎడమ ముక్కుతో నడుస్తుంటే ఎడమ పాదం ముందు పెట్టాలి. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా మీ ఆ రోజు శక్తి ప్రవాహాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ చిన్న మార్పుతో మీ రోజులో వచ్చే అద్భుతమైన తేడాను మీరే గమనిస్తారు. ముఖ్యమైన సమావేశాలు సఫలం కావడం, పనులు చకచకా ముందుకు సాగడం, చిన్న చిన్న వివాదాలు కూడా వాటంతట అవే పరిష్కారం అవడం వంటి సానుకూల ఫలితాలు చూస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











