Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Valentines day 2025: మీ రాశి ప్రకారం మీ లవర్ కి ఈ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే..ఫ్లాట్ అవ్వాల్సిందే
ఫిబ్రవరి నెల ప్రారంభం నుంచే ఎప్పుడెప్పుడు వాలంటైన్స్ డే వస్తుందా..తమ లవ్ ని ప్రపోజ్ చేద్దామా అని ప్రేమికులు ఎదురుచూస్తుంటారు. వాలంటైన్స్ డే రోజు(ఫిబ్రవరి 14) ప్రేమికులందరూ తమ జీవిత భాగస్వామికి తమ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా కొత్త సంబంధాన్ని ప్రారంభిస్తారు. ప్రేమికుల రోజున ప్రేమను వ్యక్తపరచడం వల్ల భాగస్వామితో సంబంధం బలపడుతుందని అంటారు.
ఇదిలాఉంటే వాలంటైన్స్ డే రోజున అందరూ తమ ప్రియమైనవారితో బయటకు వెళ్లి వారికి గిఫ్ట్ లు ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. మరికొంతమంది భాగస్వామికి ఏమి కొనాలి అనే విషయంలో గందరగోళంగా ఉంటారు. ఈ వాలంటైన్స్ డే రోజున మీ రాశి ప్రకారం మీ భాగస్వామికి ఎలాంటి బహుమతి ఇవ్వడం శుభప్రదమో ఇక్కడ చూడండి.

మీ రాశి ప్రకారం మీ భాగస్వామికి ఈ బహుమతులు ఇవ్వండి
మేషం
ప్రేమికుల రోజున మేష రాశి వ్యక్తులు తమ లవర్ కి లేదా జీవిత భాగస్వామికి ఎరుపు రంగు బహుమతిని ఇవ్వవచ్చు. ఈ సమయంలో మీరు ఎరుపు రంగు దుస్తులను కూడా బహుమతిగా ఇవ్వవచ్చు.
వృషభం
ఈ రాశుల వారు ప్రేమికుల రోజున తమ భాగస్వామికి తెలుపు, గోధుమ లేదా ఖాకీ రంగు వస్తువులను గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. అది ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథునం
మిథున రాశి వారు ప్రేమికుల రోజున తమ జీవిత భాగస్వామికి ఆకుపచ్చ రంగు గిఫ్ట్ ను ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.
కర్కాటకం
కర్కాటక రాశి అధిపతి చంద్రుడు, కాబట్టి ఈ రాశి వారు తమ భాగస్వామికి తెల్ల గులాబీని ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.
సింహం
ఈ రాశి వ్యక్తులు వాలంటైన్స్ డే రోజున తమ లవర్ కి లేదా భాగస్వామికి ఝుమ్కాలు లేదా పసుపు,ఎరుపు పువ్వులు ఇవ్వవచ్చు.
కన్య
కన్య రాశి వ్యక్తులు ప్రేమికుల రోజున తమ ప్రియమైన వ్యక్తికి నీలం రంగు వస్తువులను బహుమతిగా ఇవ్వవచ్చు.
తుల
తుల రాశిలో జన్మించిన వ్యక్తులు తమ ప్రేమ భాగస్వామికి కమలం పువ్వును ఇవ్వవచ్చు, అది మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది.
వృశ్చికం
వృశ్చిక రాశి వ్యక్తులు ప్రేమికుల రోజున తమ ప్రేమ భాగస్వామికి ఎరుపు లేదా మెరూన్ రంగు దుస్తులను ఇవ్వవచ్చు.
ధనుస్సు
ధనస్సు రాశి వ్యక్తులు తమ జీవిత భాగస్వామికి బంగారు ఉంగరాన్ని వాలంటైన్స్ డే రోజున బహుమతిగా ఇవ్వవచ్చు.
మకరం
మకర రాశి వ్యక్తులకు ఈ ప్రేమికుల రోజున మకర రాశి వారు తమ ప్రియమైన వారికి నీలి గులాబీలను ఇవ్వవచ్చు.
కుంభం
కుంభ రాశి వారు తమ భాగస్వామికి దుస్తులు లేదా కార్డు వాలంటైన్స్ డే రోజున బహుతమతిగా ఇవ్వవచ్చు.
మీనం
మీన రాశి వ్యక్తులు తమ ప్రియమైన వారికి పసుపు గులాబీ, దుస్తులు వాలంటైన్స్ డే రోజున గిఫ్ట్ గా ఇవ్వడం ప్రయోజనకరంగా ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications