Latest Updates
-
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.!
వాలెంటైన్స్ డే అదృష్ట రాశులు ఇవే.. ఈ రాశులకు చెందిన ప్రేమికులకు ఈ సంవత్సరం పెళ్లి ఖాయం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటి. ఈ గ్రహం ప్రేమ, పెళ్లి సంబంధాలకు అత్యంత అనువైన గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారికి త్వరగా పెళ్లి అవుతుందని చెబుతుంటారు. ఆ సమయంలో పెళ్లి చేసుకున్న వారికి తమ జీవితంలో డబ్బు, ఆనందం, శాంతి ఉంటాయని నిపుణులు పేర్కొంటుంటారు. అయితే ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి శుక్రుడి బలం మెరుగ్గా ఉంది. దాని ప్రకారం ఎవరైతే ప్రేమలో ఉంటారో వారికి కచ్చితంగా పెళ్లి అవుతుంది. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సంవత్సరం పెళ్లి చేసుకునే రాశులు ఏవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వృషభ రాశి
ఈ రాశి వారి జాతకంలో శుక్రుడు బలం బ్రహ్మాండంగా ఉంది. దాని కారణంగా ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ఎక్కువ కాలం అద్భుతమైన మంచి ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగానైనా, డబ్బు పరంగానైనా వీరికి అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రేమలో ఉన్న వ్యక్తులకు ఈ సంవత్సరం శుక్రుడి బలం కారణంగా కచ్చితంగా పెళ్లి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకునే వారు ఈ సంవత్సరం చేసుకుంటే ఉత్తమమైన ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కూడా ఈ సంవత్సరం శుక్రుడి బలం బాగానే కనిపిస్తుంది. దీని కారణంగా ఈ రాశికి చెందిన వారి ప్రేమ, పెళ్లి విషయంలో గొప్ప మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ప్రేమలో ఉన్న వ్యక్తుల.. లవ్ సక్సెస్ అవుతుంది. అలాగే పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి నిశ్చితార్థం కూడా పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారు ఎక్కువగా ఈ సంవత్సరం ప్రేమ వివాహాలే చేసుకుంటారు. వీరి ఆరోగ్య జీవితం, ఆర్ధిక జీవితం కూడా అద్భుతంగా ఉంటాయి.
తులా రాశి
తులా రాశికి చెందిన వారు ఈ సంవత్సరం శుక్రుడు బలం, శుక్ర అనుగ్రహంతో తమ నిజమైన ప్రేమను పొందుతారు. తమ ప్రేమ విజయవంతం కావడంతో పాటు, ఈ రాశి వారు ప్రేమిస్తున్న వ్యక్తితో పెళ్లి ఖాయం అవుతుంది. అలాగే నిశ్చితార్థం వరకు చేరే అవకాశం ఉంటుంది. ఎవరైతే పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారో వారి జీవితం సుఖమయం అవుతుంది. అలాగే మంచిగా సాగుతుంది. ఆర్ధిక జీవితం, కుటుంబ జీవితం, ఆరోగ్య జీవితం అంతా బాగుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications