Latest Updates
-
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026
పూజ గది వాస్తు..ఈ విగ్రహాలు ఇంట్లో ఉంటే కష్టాలు తప్పవు!
ఒక వ్యక్తికి శక్తి కేంద్రంగా బొడ్డును చెబుతారు. అలాగే ఏ ఇంట్లో అయినా ఒక పవిత్రమైన శక్తి కేంద్రంగా పూజ గది లేదా దేవుడి మందిరం అని చెబుతారు. బొడ్డు నుంచి వెలువడే శక్తి మన ఆరోగ్యం,అందంపై పెద్ద ప్రభావం చూపెట్టినట్లుగానే..ఇంట్లోని పూజ గది నుంచి వెలువడే పాజిటివ్ ఎనర్జీ ఇల్లంతా ప్రసరించి, మన జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్యశాస్త్రం మాదిరిగా వాస్తు శాస్త్రం కూడా చాలా పవర్ ఫుల్. వాస్తు ప్రకారం చేసే పసులు జీవితంలో సుఖసంతోషాలను తీసుకొస్తాయని నమ్ముతారు. వాస్తు అంటే కేవలం ఇల్లు కట్టడానికి చూసేది మాత్రమే కాదు..జీవితంలో ప్రతి దానికి వాస్తుతో సంబంధం ఉంటుంది.
ఇంట్లో సరళమైన వాస్తు సూత్రాలను పాటించడం ద్వారా మనం సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో జీవించవచ్చు. అయితే తెలియక చేసే కొన్ని పొరపాట్ల వల్ల, ముఖ్యంగా విగ్రహాల విషయంలో మనం వాస్తు దోషాలను ఎదుర్కోవలసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని పూజ గదిలో కొన్ని రకాల విగ్రహాలను అస్సలు ఉంచకూడదు. పూజ మందిరంలో ఏ విగ్రహాలను ఉంచకూడదో ఇక్కడ చూడండి.

ఉగ్ర రూపంలో ఉన్న దేవతామూర్తులు
కాళికాదేవి, కాలభైరవుడు, నటరాజ స్వామి, శని దేవుడు, రాహు-కేతువుల వంటి ఉగ్ర రూపంలో ఉన్న దేవతల విగ్రహాలను ఇంట్లోని పూజ గదిలో ఎన్నడూ పెట్టకూడదు. నటరాజ రూపం శివుని ప్రళయ తాండవాన్ని సూచిస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన రూపం అయినప్పటికీ ఇంటి వాతావరణానికి అంతగా సరిపడదు. ఈ దేవతల శక్తిని ఇంట్లో నిలిపి ఉంచడం కష్టం..దీనివల్ల ఇంట్లో అశాంతి, ప్రతికూలత పెరిగే అవకాశం ఉంది. వీటికి బదులుగా లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీ దేవి, వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణులు వంటి శాంత స్వరూపులైన దేవతల విగ్రహాలను పెట్టుకోవడం శ్రేయస్కరం.
పగిలిన లేదా విరిగిన విగ్రహాలు
వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన లేదా పాడైపోయిన విగ్రహాలను పూజ గదిలో ఉంచడం పెద్ద దోషం అని పండితులు చెబుతున్నారు. విరిగిన విగ్రహాలు అసంపూర్ణతను, అశుభాన్ని సూచిస్తాయి. ఇవి ఇంట్లోకి ప్రతికూల శక్తిని ఆకర్షించి, కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. మీ ఇంట్లో అలాంటి విగ్రహాలు ఉంటే వాటికి క్షమాపణలు చెప్పుకుని, ప్రవహించే నీటిలో కలపడం లేదా ఒక రావి చెట్టు కింద గౌరవప్రదంగా ఉంచడం ఉత్తమం.

యుద్ధాన్ని లేదా హింసను సూచించే ప్రతిమలు
మహాభారత, రామాయణ యుద్ధ ఘట్టాలను లేదా ఏదైనా హింసాత్మక చర్యను వర్ణించే విగ్రహాలు, చిత్రపటాలను పూజ గదిలో పెట్టకూడదు. అవి చూడటానికి పౌరాణికంగా ఉన్నప్పటికీ వాటిలోని హింసాత్మక దృశ్యాలు ఇంట్లో ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలపై ప్రభావం చూపి అనవసరమైన వాదనలకు దారితీస్తుంది.
విగ్రహాల సంఖ్య, అమరిక
పూజ గదిలో ఒకే దేవుడికి సంబంధించిన విగ్రహాలు ఒకటి కంటే ఎక్కువగా ఎదురెదురుగా పెట్టకూడదు. అలాగే శివలింగం కేవలం ఒకటి మాత్రమే ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు ఉంచడం వల్ల ఇంట్లో శక్తి సమతుల్యత దెబ్బతింటుంది. విగ్రహాలు మరీ పెద్దవిగా కాకుండా మన బొటనవేలి పరిమాణాన్ని మించకుండా ఉండటం ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications











