Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
మీ ఇంట్లో సమస్యలకు కారణం ఇదేనా? పూజా గదిలో ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
దైవారాధన మన భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. మానసిక ప్రశాంతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం మనం నిత్యం దేవుడిని పూజిస్తుంటాం. భక్తితో చేసే పూజ మన జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తుందన్నది అక్షర సత్యం. అయితే మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు ఆ సానుకూల శక్తిని అడ్డుకుంటాయని మీకు తెలుసా?
జ్యోతిష్య, వాస్తు శాస్త్రాల ప్రకారం మన ఇంటి పూజ గదిలో కొన్ని వస్తువులను ఒకటి కంటే ఎక్కువ ఉంచడం వల్ల ప్రయోజనం కన్నా, హాని ఎక్కువగా జరుగుతుందట. ఇవి ఇంట్లో వాస్తు దోషాన్ని సృష్టించి, దుఃఖానికి కారణమవుతాయని పండితులు చెబుతున్నారు. మన ఇంట్లో లేదా పూజా గదిలో పొరపాటున కూడా ఒకటి కంటే ఎక్కువ ఉంచకూడని ఆ వస్తువులు ఏవో ఇక్కడ చూడండి.

సూర్య భగవానుడి విగ్రహం
జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు కీర్తికి, ఆరోగ్యానికి కారకుడు. అయితే మీ ఇంట్లో సూర్య భగవానుడి విగ్రహం లేదా ప్రతిమ ఒక్కటి మాత్రమే ఉండాలి. సూర్యుడి తేజస్సు చాలా శక్తివంతమైనది.
కాబట్టి ఒకే విగ్రహాన్ని ఉంచి పూజించడం వల్ల ఆ సానుకూల శక్తి సమతుల్యంగా ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అహంకార పూరిత గొడవలు వచ్చే ప్రమాదం ఉంటది.
ఒకే దేవత విగ్రహాలు
సాధారణంగా మనకు నచ్చిన దేవుడి విగ్రహాలను ఎక్కడికి వెళ్ళినా కొంటూ ఉంటాం. కానీ పూజా మందిరంలో ఒకే దేవుడికి సంబంధించిన రెండు లేదా అంతకంటే ఎక్కువ విగ్రహాలను పక్కపక్కనే ఉంచకూడదు.
గణపయ్య విగ్రహాలు రెండు ఉంటేవాటి శక్తి పరస్పరం ఢీకొంటుందని, తద్వారా ఇంట్లో అశాంతి నెలకొంటుందని పండితులు చెబుతున్నారు. ఏ దేవుడి విగ్రహమైనా ఒక్కటి మాత్రమే ఉంచి, ఏకాగ్రతతో పూజించడం మంచిది. ఇలా చేయడం వల్ల మన కోరికలు త్వరగా నెరవేరుతాయి.
సాలగ్రామ శిలలు
సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే సాలగ్రామాలు అత్యంత పవిత్రమైనవి. వీటిని ఇంట్లో ఉంచేటప్పుడు కఠినమైన నియమాలు పాటించాలి. ముఖ్యంగా, పూజా గదిలో ఎప్పుడూ రెండు సాలగ్రామాలను కలిపి ఉంచకూడదు.
ఒకవేళ మీరు సాలగ్రామాన్ని ఆరాధించాలనుకుంటే కేవలం ఒక్కటి మాత్రమే స్థాపించి పూజించాలి. రెండు సాలగ్రామాలను పక్కపక్కనే ఉంచి పూజించడం వల్ల ఇంట్లో తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై, ఆర్థిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని శాస్త్రం హెచ్చరిస్తోంది.
గోమతి చక్రం
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చాలామంది గోమతి చక్రాలను పూజిస్తుంటారు. అయితే ఒక ఇంట్లో లేదా పూజా పీఠంపై ఒకటి కంటే ఎక్కువ గోమతి చక్రాలను ఉంచకూడదని ఒక రూల్ ఉంది. ఎప్పుడూ ఒక ప్రధాన గోమతి చక్రాన్ని మాత్రమే ఉంచి పూజించడం మంచిది.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గోమతి చక్రాలను గుంపుగా ఉంచడం సరైన పద్ధతి కాదు. ఇది ఇంట్లో అనవసరమైన ఖర్చులను, గందరగోళాన్ని సృష్టించే అవకాశం ఉంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications