Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
వాస్తు రహస్యం..ఇంట్లోని ఈ మొక్క ఉంచితే మీ జాతకమే మారిపోతుంది, డబ్బు పేరుకుపోతుంది!
జ్యోతిష్యశాస్త్రం మాదిరిగానే వాస్తు శాస్త్రం కూడా చాలా ఫేమస్. అయితే చాలామంది ఇళ్లు కట్టేటప్పుడు మాత్రమే వాస్తు చూసుకుంటే చాలని అనకుంటారు. వాస్తవానికి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలి, జీవితంలో ప్రతి దానికి వాస్తు నియమాలు ఉంటాయని చెబుతారు. వాస్తు శాస్త్రం మన జీవితాన్ని సుసంపన్నంగా, సంతోషంగా ఉంచడానికి చేయవలసినవి, చేయకూడనవి తెలియజేస్తుంది. సాధారణంగా చాలామంది తమ ఇంట్లో లుక్ కోసం పెయింట్స్, రకరకాల కళాఖండాలను పెట్టడం మనం చూస్తుంటాం.
అయితే వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కను అదృష్టాన్ని ఆకర్షించే మొక్కగా చెబుతారు. దీనిని ఇంట్లో పెట్టుకుంటే భారీగా సంపద మీ ఇంట్లోకి వచ్చి పడుతుందట. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందట. అయితే ఇంట్లో ఈ మొక్కను ఏ దిశలో,ఎక్కడ ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం అని వాస్తు పండితులు చెప్పారు.

ఏ దిశలో వెదురు మొక్క ఉండాలి
ఇంట్లో తూర్పు దిక్కన వెదురు మొక్కను ఉంచాలని వాస్తు పండితులు చెబుతున్నారు. తూర్పు దిశ..శక్తి, అభివృద్ధికి సంబంధించినది. తూర్పు దిశలో వెదురు మొక్కను ఉంచడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుందని,ఆనందం,శాంతి ఉంటుందని చెబుతున్నారు. ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని తెలిపారు. మరోవైపు, ఇంట్లోని ఉత్తర దిశలో వెదురు మొక్కను ఉంచితే వ్యాపార అభివృద్ధి జరుగుతుందని కొందరు నమ్ముతారు. ఈ దిశ సంపద, శ్రేయస్సుకి సంబంధించినది. కాబట్టి మీ ఇంట్లో వెదురు మొక్కను తూర్పు లేదా ఆగ్నేయ దిశలో ఉంచడం వాస్తు ప్రకారం మంచిది.
వెదురు మొక్క పెట్టేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు
-వెదురు మొక్కను ఎల్లప్పుడూ కుండీలో మాత్రమే నాటాలి. భూమిలో నాటితే అది చాలా పెద్దగా పెరుగుతుంది,ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని వాస్తు పండితులు తెలిపారు.
-ఇంట్లో వెదురు మొక్క 2-3 అడుగుల ఎత్తు వరకు మాత్రమే ఉండాలి. ఈ మొక్క ఉన్న చోటుకి నెగిటివ్ ఎనర్జీ చేరుకోదని వాస్తు పండితులు తెలిపారు.
-ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే వెదురు మొక్కను కిటికీ దగ్గర లేదా సూర్యకాంతి నేరుగా పడే ప్లేస్ లో ఉంచకూడదు.
-వెదురు మొక్క ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన మొక్క అశుభాన్ని సూచిస్తుంది. ఇది ఇంటి ఆర్థిక పరిస్థితిప ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications