Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
లక్ష్మీదేవి మీ ఇంటి తలుపు తట్టాలంటే..మెయిన్ డోర్ ముందు అది పెట్టండి!
ఏ ఇంటికి అయినా ప్రధాన ద్వారం అత్యంత ముఖ్యమైనది. వాస్తు శాస్త్రం ప్రకారం ప్రధాన ద్వారానికి సరైన దిశ, పరిమాణం, అలంకరణ ఉంటే ఇంట్లో ఆనందం,శాంతి,శ్రేయస్సుని నింపుతుంది. అయితే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు పాదరసంతో చేసిన 1.25 అంగుళాల విష్ణువు లేదా శ్రీకృష్ణుడి విగ్రహం ఉంచడం అత్యంత శుభప్రదమైన వాస్తు పరిహారాల్లో ఒకటిగా పరిగణించబడుతుందని వాస్తు నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఈ విగ్రహం వెనుక భాగం ఇంటి బయటకి ఎదురుగా ఉండాలని సూచిస్తున్నారు. విగ్రహం చుట్టూ 12 జిర్కాన్ రాళ్లను పొడి రూపంలో అమర్చిన గిన్నెలో విగ్రహాన్ని ఉంచాలని తెలిపారు.
ఈ విగ్రహం మీ ఇంటిని అన్ని రకాల నెగిటివ్ శక్తుల నుంచి కాపాడుతుందని, లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆకర్షించే ఒక శక్తివంమైన అయస్కాంతంలా ఉంచుతుంది తెలిపారు. పాదరస విగ్రహంతో పాటుగా ఇంటి ప్రధాన ద్వారం వాస్తుని మెరుగుపర్చడానికి మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూడండి.

ప్రధాన ద్వారం పరిణామం
వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని అన్ని తలుపుల కంటే ప్రధాన ద్వారం పెద్దదిగా ఉండేలా చూసుకోవాలి. పెద్ద ద్వారం పాజిటివ్ ఎనర్జీ,లక్ష్మీదేవి మీ ఇంట్లోకిప్రవేశించడానికి అనుకూలంగా ఉంటుందని వాస్తు పండితులు తెలిపారు. చిన్న ద్వారం శక్తి ప్రవాహాన్ని పరిమితం చేస్తుందని,అవకాశాలను తగ్గిస్తుందని చెప్పారు.
టాయిలెట్ నుంచి దూరం
టాయిలెట్ ఎప్పుడూ ప్రధాన ద్వారం ముందు ఉండకూడదు. టాయిలెట్ ప్రతికూల శక్తిని ఉత్పత్తి చేసే ప్రదేశంగా పరిగణించబడుతుంది. అది నేరుగా ప్రధాన ద్వారం ముందు ఉంటే మీ ఇంట్లోకి ప్రవేశించే సానుకూల శక్తిని అది నిరోధిస్తుంది..ఇది అనేక రకాల ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో అలా ఉంటే టాయిలెట్ తలుపును ఎల్లప్పుడూ మూసి ఉంచండి లేదా దాని స్థానాన్ని మార్చడానికి ప్రయత్నించండి లేదా టాయిలెట్ తలుపుకు కొన్ని శుభప్రదమైన చిహ్నాలను అతికించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
ఒకే సరళ రేఖలో ఉండకూడదు
ప్రధాన తలుపు, ఇంటి చివరి తలుపు ఒకే సరళ రేఖలో ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లోకి ప్రవేశించిన సానుకూల శక్తి నేరుగా బయటకు వెళ్లిపోతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఇలాంటి నిర్మాణం ఉంటే, దానిని సరిచేయడానికి మీరు కొన్ని సాధారణ వాస్తు పరిహారాలు చేయవచ్చు. ప్రధాన ద్వారానికి, చివరి ద్వారానికి మధ్యలో ఒక క్రిస్టల్ బాల్‌ను వేలాడదీయడం లేదా ఒక అందమైన స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా శక్తి ప్రవాహాన్ని మళ్లించవచ్చు.
ఇంటి దిశ
ఇంటి దిశ వాస్తు శాస్త్రంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇంటి యజమాని జన్మ నక్షత్రం ఆధారంగా ఇంటి దిశను నిర్ణయించడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్రానికి, జ్యోతిష్య శాస్త్రానికి మధ్య ఒక లోతైన సంబంధం ఉంది. కాబట్టి, మీ జాతకానికి అనుగుణంగా ఉండే దిశను ఎంచుకోవడం మీ ఇంటికి, మీ జీవితానికి మంచిది.
మెయిన్ డోర్ పై శుభప్రదమైన చిహ్నాలు
మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద కొన్ని శుభప్రదమైన చిత్రాలు, చిహ్నాలను ఉంచడం చాలా మంచిది. స్వస్తిక, ఓం, ఇతర శ్రేయస్సును సూచించే చిహ్నాలు సానుకూల శక్తిని ఆకర్షిస్తాయి. అయితే ఈ చిత్రాలను ఇంటి లోపలి వైపు చూసేలా ఉంచాలి, తద్వారా అవి మీ ఇంటికి అదృష్టాన్ని మరియు శ్రేయస్సును తీసుకువస్తాయి. బయటికి చూసే చిత్రాలు సానుకూల శక్తిని బయటకు పంపేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications