Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
మీ రాశి చక్రం ప్రకారం పడక గదిలో ఏ కలర్ పెయింటింగ్ వేస్తే మంచిదో తెలుసా.?
రోజంతా పనిచేసి అలసిన శరీరానికి, మనసుకి విశ్రాంతినిచ్చేది పడకగది. అందుకే బెడ్ రూమ్ చాలా ప్రశాంతంగా ఉండటం చాలా ముఖ్యం. అంతేకాకుండా ఆ గదిలో డెకరేట్ చేసే వస్తువులు, వాస్తు మన జీవితంపై ప్రభావం చూపిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా బెడ్‌రూమ్‌లో గోడలకు వేసే కలర్ ఎంపిక కూడా చాలా ముఖ్యం. వాస్తు, జ్యోతిష్యం ప్రకారం ఏ రాశి వారు తమ పడక గదిలో ఎలాంటి రంగులు వేస్తే మంచి ఫలితాలను ఇస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..

వాస్తు శాస్త్రం ప్రకారం బెడ్‌రూంలో గోడలకు వేసే రంగు మీ స్వభావం, సంబంధాలు, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అందుకే మీ పడకగదిలో పెయింటింగ్ వేసే ఆలోచనలో ఉన్నప్పుడు.. మీ జన్మ రాశిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సరైన కలర్ ఎంచుకోవడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించడంతో పాటు వాతావరణం కూడా అనుకూలిస్తుంది.
ఈ రాశులవారికి ఈ కలర్స్ బెస్ట్
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి లేత ఎరుపు, పీచ్ ఆరెంజ్, క్రీమ్ రంగులు మంచి ఫలితాలనిస్తాయి. ఈ కలర్స్ మీ పడకగది గోడలపై ఉండటం ద్వారా శక్తిని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఇక, వృషభం, కన్య, మకరం రాశుల వారికి లేత ఆకుపచ్చ, మట్టి రంగులు, లేత గోధుమ రంగులు ఉత్తమమైనవిగా వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ ప్రకాశవంతమైన రంగులు జీవితంలో ప్రశాంతతను, స్థిరత్వాన్ని కాపాడతాయి. అంతేకాకుండా పడకగదిలో ఒత్తిడిని తగ్గించి మంచి నిద్రను అందిస్తాయి.
సానుకూల ఆలోచనల కోసం
మిథునం, తుల, కుంభ రాశుల వారు తమ పడకగదుల్లో స్కై బ్లూ, లేత నీలం, తెలుపు, వెండి రంగులు అత్యంత శుభప్రదమైనవిగా వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ రంగులు మీలో సానుకూల ఆలోచనలు కలిగేలా చేస్తాయి. కుటుంబ బంధాలు మెరుగయ్యేలా దోహదపడతాయి. కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లేత గులాబీ, క్రీమ్, తెలుపు, సముద్రపు ఆకుపచ్చ రంగులు కలిసివస్తాయి. ఈ రంగులు మీలో భావోద్వేగాలు బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా చేయడంతో పాటు మనసుకు శాంతిని ఇస్తాయి. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సామరస్యాన్ని కాపాడతాయి.
చిరాకు కలిగించే రంగులు వద్దు
బెడ్‌రూమ్‌లో పెయింటింగ్ సమయంలో రాశి చక్రంతో పాటు వాటి ప్రభావాలను పరిగణనలోకి తీసుకోవాలి. గాఢ నలుపు, ముదురు ఎరుపు, అత్యంత ప్రకాశవంతంగా ఉండే రంగులు కొన్నిసార్లు మీలో చిరాకును, ఇబ్బందులను కలిగించవచ్చు. అందుకే పెయింటింగ్ కలర్స్ ఎంచుకునేటప్పుడు సానుకూలంగా ఉండే విషయాలను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. గదిలోని లైటింగ్‌కి అనుగుణంగా రాశి చక్రం ప్రకారం కలర్స్ ఎంచుకుంటే మంచి అనుభూతిని పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications