Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
వాస్తు ప్రకారం బెడ్రూమ్ ఏ కలర్ లో ఉండాలి? ఏ దిశలో ఉన్న రూమ్ లో ఎలాంటి రంగు ఉండాలి?
తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నా,ఎంత సంపాదించినా మనసులో ఏదో తెలియని అశాంతి..అన్నీ బాగానే ఉన్నా పెళ్లి కుదరకపోవడం, తరచూ అనారోగ్యానికి గురవుతుండటం,చేపట్టే పనుల్లో ఆటంకాలు ఇలాంటివన్నీ వ్యక్తి జీవితంలో జరుగుతుంటే దీనికి వాస్తు దోషం కూడా కారణం కావచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం గది రంగు వ్యక్తి జీవితాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లోని పడకగది ఏ దిక్కున ఉండాలి? ఏ దిశలో ఉన్న గది రంగు ఎలా ఉండాలి? పడకగది రంగుకు సంబంధించి వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

వాస్తు ప్రకారం ఉత్తర దిశలో ఉన్న గదిలో రంగు లేత నీలం లేదా తెలుపు రంగులో ఉండాలి. ఈ రంగులు శాంతి, స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తాయి. దక్షిణం వైపు ఉన్న గదులకు ఎరుపు లేదా నారింజ రంగు ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రంగు శక్తిని పెంచుతుంది, ఇంట్లో ఆనందాన్ని తెస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు ముఖంగా ఉన్న గదికి పసుపు లేదా ఆకుపచ్చ రంగు సరైనదిగా పరిగణించబడుతుంది. ఈ కలర్స్ పాజిటివిటీ,పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వెస్ట్ ఫేసింగ్ లేదా పడమర ఫేసింగ్ ఉండే రూమ్ కోసం బ్లూ లేదా పర్పుల్ కలర్ బెటర్. ఈ రంగులు శాంతి, సమతుల్యతను కూడా ప్రోత్సహిస్తాయి. వాస్తు ప్రకారం గది దిశ, పరిమాణం, ఫర్నిచర్ గురించి శ్రద్ధ వహించడం ముఖ్యం.
వాస్తు ప్రకారం పడకగది లేదా బెడ్రూమ్ ఏ దిక్కున ఉండాలి?
ఇంట్లో ఉండే అతి ముఖ్యమైన వ్యక్తిగత ప్రదేశాలలో బెడ్ రూమ్ ఒకటి.ప్రశాంతమైన జీవితం, మంచి నిద్ర పొందాలంటే పడక గది వాస్తు సరిగా ఉండాల్సిందే. పడకగది ఎప్పుడూ ఆగ్నేయ దిశలో ఉండకూడదు. ఎందుకంటే ఇది అగ్ని కోణం. ఈ దిశలో పడకగది ఉండటం వల్ల ఇంట్లో తగాదాలు, అపార్థాలు పెరుగుతాయి. పడక గది దిశ సరిగా ఉన్నప్పుడే దాంపత్య జీవితం బాగుంటది. ఇంట్లో బెడ్ రూమ్ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిశలో ఉండకూడదు. ఈశాన్యం అనేది దేవుళ్లకు కేటాయించింది. అందుకే ఈశాన్యంలో అయితే పూజా గది ఉండాలి లేదంటే ఖాళీ స్థలం ఉండాలని వాస్తు పండితులు చెబుతున్నారు.
వాస్తు ప్రకారం పడక గది ఇంటి నైరుతి మూల ఉండాలి. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో తూర్పు, ఉత్తరం వైపు గోడలకు కిటికీలు ఉండేలా చూసుకోవాలి. పడుకునేటప్పుడు తల దక్షిణం వైపు, పాదాలు ఉత్తరం వైపు ఉండాలి. పడక గదిలో బెడ్ కి ఎదురుగా అద్దం లేదా మిర్రర్ ఉండకూడదు. నిద్రిస్తున్న వ్యక్తి ప్రతిబింబం కనిపించడం అశుభంగా పరిగణిస్తారు. కాబట్టి ఉత్తర లేదా తూర్పు వైపు గోడలకు అద్దాలు పెట్టుకోవడం బెటర్. బెడ్ రూమ్ లో లాకర్ పెట్టుకోవాలనుకుంటే దక్షిణం వైపు పెట్టుకోవాలి. సేఫ్ ని తెరిచినప్పుడు అది ఉత్తర ముఖంగా తెరుచుకునేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే దక్షిణం వైపు సంపాదనలకు అధిపతి కుబేరుడు ఉంటాడు. ఆ దిశలో లాకర్ పెట్టుకుంటే మీ సంపద కూడా నిలుస్తుంది. బెడ్ రూమ్ గోడలకు లైట్ కలర్స్ వేసుకోవాలి. దీనిల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications