Latest Updates
-
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.! -
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి!
మీ పిల్లలు కెరీర్‌లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్‌లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.!
స్కూళ్లు ప్రారంభమై అప్పుడే నెల దాటింది. కొత్త తరగతిలోకి అడుగుపెట్టిన మీ పిల్లలు.. ఇప్పటికే హోం వర్క్, ఎగ్జామ్స్ అంటూ ఇంట్లో పుస్తకాలతో కుస్తీ పట్టేస్తుంటారు. ఈ క్రమంలో తమ పిల్లలు ఏకాగ్రతతో ఉంటూ చదువులో రాణించాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటారు. అందుకే పిల్లల కోసం చాలా మంది తల్లిదండ్రులు.. చదువుకోవడం కోసం ప్రత్యేకంగా గదిని కేటాయిస్తారు. మరి ఆ గది సరైన వాస్తు దిశలో ఉందా అని ఎప్పుడైనా పరిశీలించారా.? ఇందుకు సంబంధించి వాస్తు జోతిష్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.

వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో ప్రతి దిశ.. శక్తి, మానసిక సామర్థ్యంపై ప్రభావాన్ని చూపిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఇక, పిల్లల్లో చిన్నతనంలోనే వారిలో అంతర్గత, సామర్థ్యం రెండూ ముఖ్యం. దీని ద్వారానే వారు చదువులో పట్టు సాధించి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలరు. ఈ క్రమంలో పిల్లలు చదువుకునే గదికి సంబంధించి ముఖ్యమైన వాస్తు నియమాల గురించి వాస్తు నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
పిల్లలు స్కూల్లో లేదా కాలేజీలో మాత్రమే చదువుకుంటూ సరిపోదు. ఇంట్లోనూ కొంచెం సమయం ఇందుకోసం కేటాయించాల్సిందే. ఈ క్రమంలో ఇంటి వాతావరణం వారి చదువుకి ఆటంకం కలగకుండా ఉండేలా చూసుకోవాలి. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం.. చదువుకునే గది దిశ, నిర్వహణ సానుకూల ఫలితాలు ఇస్తాయని వాస్తు పండితులు సూచిస్తున్నారు. తద్వారా పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. ఇందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గది ముఖ ద్వారం
వాస్తు పండితుల సలహా ప్రకారం ఈశాన్య, తూర్పు దిక్కులు అత్యంత శుభప్రదమైనవిగా పరిగణిస్తారు. ఈ దిక్కులలో సానుకూల ప్రభావం ఎక్కువగా ఉండి వారి ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. ప్రత్యేకంగా గది సదుపాయం లేని వారు.. వారు చదువుకునే ప్రదేశాన్ని ఈ దిక్కులలో ఉండేలా ఏర్పాటు చేయవచ్చని సూచిస్తున్నారు.

ఈ దిశగా ముఖం
పిల్లలు చదువుకునే సమయంలో తమ ముఖాన్ని తూర్పు లేదా ఉత్తరం వైపు పెడితే మంచిదని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం ద్వారా మనసులో ప్రతికూల ఆలోచనలు తొలగి.. చదువుపై ఏకాగ్రత పెట్టడం కుదురుతుంది.
ఈ దిశగా స్టడీ టేబుల్
పిల్లలు తమ గదిలో ఎల్లప్పుడూ స్టడీ టేబుల్‌ను సహజంగా వెలుతురు లభించే చోటు, స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రదేశంలో పెట్టాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. స్టడీ టేబుల్ నేరుగా గోడకు ఆనించి పెట్టకుండా గోడకి, బల్లకి మధ్య కొంచెం స్థలం వదిలేయడం మంచిది. ఇలా చేయడం ద్వారా సౌకర్యవంతంగా, స్వేచ్ఛగా ఉండి ఎక్కువ సేపు చదువుకోగలరు. పిల్లలు చదువుకునే గది చీకటిగా లేదా మసకగా ఉండకూడదు. పగటిపూట ఎల్లప్పుడూ గదిలి సూర్యుని నుంచి వచ్చే సహజ కాంతి లభించేలా చూడాలి. ఇలా చేయడం ద్వారా వారి మానసికంగా ఉత్తేజంగా ఉండగలరు. చదువుకునేటప్పుడు నిద్ర రాకుండా ఉంటుంది.

శుభ్రత
పిల్లలు చదువుకునే గది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడండి. ఆ గదిలో అనవసరమైన వస్తువులు, విరిగిన బొమ్మలు, పాత కాగితాలు, ఇతర పనికిరాని వస్తువులతో నింపేయండి. ఎప్పటికప్పుడు గదిని శుభ్రంగా ఉంచడం ద్వారా వారి మెదడు పరధ్యానం చెందదు.
గోడల రంగు
స్టడీ రూమ్‌లో గోడలకు తెలుపు, లేత పసుపు, క్రీమ్, స్కై బ్లూ, లైట్ గ్రీన్ వంటి లేత రంగులు వేయడం ద్వారా గదిలో సానుకూల వాతావరణం ఉంటుంది. నిండైన రంగుల కంటే లేత రంగులు మీ పిల్లల మనసును ప్రశాంతంగా ఉంచుతుంది. ఎక్కువ సేపు ఏకాగ్రతతో ఉండేందుకు దోహదపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications