Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
vastu tips: ఎంట్రన్స్ గేట్ ముందు ఇలా ఉంటే ఆర్థిక నష్టం
ఇంటి నిర్మాణ శైలి వాస్తు ప్రకారం ఉంటే ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవని చాలా మంది నమ్ముతారు. అందుకే ఇళ్లు నిర్మించే ముందే వాస్తు నిపుణులను సంప్రదించి పడకగది,వంటగది, పూజ గది, మరుగుదొడ్డి మొదలైన అన్ని గదులకు సంబంధించి సలహాలు తీసుకుంటుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇళ్లు నిర్మించినా కొన్నిసార్లు ఇంట్లో కష్టాలు వస్తుంటాయి. దానికి వేరే కారణాలు చాలా ఉంటాయి.
అయితే ఇంటి మెయిన్ గేట్ విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించడం చాలా ముఖ్యం. ఎంట్రన్స్ గేట్ సరైన వాస్తు ప్రకారం ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందట. ఎంట్రన్స్ గేట్ కి సంబంధించిన కొన్ని తప్పులు జీవితంలో ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి ఎంట్రన్స్ గేట్ దగ్గర వాస్తు విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వాస్తు ప్రకారం ఎలా ఉండాలి
-ఎంట్రన్స్ గేట్ త్రిభుజాకారం, వృత్తాకారం, చతురస్రం లేదా బహుభుజి ఆకారంలో ఉండకూడదు.
-వాస్తు ప్రకారం రెండు ఇళ్లలోకి ప్రవేశించడానికి ఒక ఎంట్రన్స్ గేట్ ఉండకూడదు.
-వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య మూలలో ఎంట్రన్స్ గేట్ ఉండటం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
-వాస్తు ప్రకారం లీకేజీ కారణంగా ప్రవేశ ద్వారం ముందు ఎలాంటి నీరు ప్రవహించకూడదు. దీనివల్ల ఇంటి పిల్లలకు హాని కలుగుతుంది.
-ఎంట్రన్స్ గేట్ చుట్టూ అక్కడక్కడ మట్టి,రాళ్లు ఉండకూడదు.
-వాస్తు ప్రకారం ఎంట్రన్స్ గేట్ ముందు చెత్త, వాచ్‌మెన్ క్యాబిన్, స్టోర్ రూమ్ ఉండకూడదు.
-ఎంట్రన్స్ గేట్ ముందు ఆవు, మేక, గేదె, కుక్కను కట్టకూడదని చెబుతారు. ఇది పురోగతికి ఆటంకం కలిగిస్తుంది.
-తలుపు తెరిచేటప్పుడు, మూసివేసేటప్పుడు ఎటువంటి శబ్దం ఉండకూడదు.
-ప్రవేశ ద్వారం ముందు సెప్టిక్ ట్యాంక్, బోరింగ్, అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్ మొదలైనవి ఉండకూడదు. వాస్తు ప్రకారం ఇది ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.
-వాస్తు ప్రకారం ఇంటి ఎంట్రన్స్ బయట తెరవకూడదు. లోపలికి మాత్రమే తెరవాలి.
గమనిక: ఇంటర్నెట్ లో లభించిన సమాచారం ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications