Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
Calender vastu: ఇంట్లో కొత్త క్యాలెండర్ పెడుతున్నారా? అక్కడ తగిలించారంటే ఏడాదంతా దరిద్రమే
మరికొన్ని గంటల్లో కొత్త ఏడాది 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. ప్రతి ఒక్కరూ కొత్త ఆశలు,కొత్త కోరికలు,కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో చాలా మంది వివిధ మతపరమైన ఆచారాలను పాటిస్తారు. అయితే కొత్త సంవత్సరం ప్రారంభం సమయంలో కొందరు చేసే ఒక్క చిన్న పొరపాటు వాళ్ల ఏడాది మొత్తాన్ని నాశనం చేస్తుంది. దీంతో వారు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కొత్త ఏడాది ప్రారంభ సమయంలో ఏ ఇంట్లో చూసిన,ఆఫీసులో లేదా షాపులో ఇలా ఎక్కడ చూసిన కొత్త ఏడాదికి సంబంధించిన క్యాలెండర్లు కనిపిస్తుంటాయి. ఆఫీసులలో ఇచ్చినవో,లేదా కొనుగోలు చేసిన క్యాలెండర్లను తెచ్చి ఇంట్లో లేదా షాపులో గోడలకు తగిలిస్తుంటాం. పాత క్యాలెండర్లను తొలగించి వాటి ప్లేస్ లో కొత్త క్యాలెండర్లు పెట్టడం ప్రతి ఏటా జరుగుతూనే ఉంటది. అయితే ఇక్కడే చాలామంది తమకు తెలియకుండానే పెద్ద పొరపాటు చేస్తుంటారు.

క్యాలెండర్ తేదీని మార్చేది మాత్రమే కాదు..క్యాలెండర్ వాస్తుతో విడదీయరాని విధంగా ముడిపడి ఉంది. కేవలం క్యాలెండర్ ను ఉంచడం వల్ల ఫలితం ఉండదు. నిర్దిష్ట సమయం,నిర్దిష్ట ప్రదేశం,నిర్దిష్ట దిశలో దాని ఏర్పాటు ఉండాలి. అప్పుడే కొత్త క్యాలెండర్ మీకు మంచి ఫలితాలను అందిస్తుంది.
క్యాలెండర్ పెట్టడానికి సరైన సమయం
క్యాలెండర్ మార్చడానికి ఉదయం సరైన సమయం అని వాస్తు పండితులు చెబుతున్నారు. సూర్యోదయం అయిన వెంటనే క్యాలెండర్ మార్చుకోగలిగితే అన్నింటికన్నా ఉత్తమమని తెలిపారు. అయితే మధ్యాహ్నం తర్వాత క్యాలెండర్ ను మార్చకూడదు. అదేవిధంగా బుధవారం, శుక్రవారం క్యాలెండర్ మార్పులకు అనువైనవి. ఈ సంవత్సరం జనవరి మొదటి రోజు బుధవారం వస్తుంది.
గోడను ఇలా ఎంచుకోండి
క్యాలెండర్‌ను వేలాడదీయాలంటే ఇంటి శుభ్రమైన గోడను ఎంచుకోవాలి. విరిగిన లేదా అపరిశుభ్రమైన గోడలపై క్యాలెండర్లు ఉంచకూడదు.
ఏ దిశలో క్యాలెండర్ ఉంచాలి
క్యాలెండర్లను ఉంచడానికి తూర్పు, ఉత్తర దిక్కు గోడలు అనువైనవి. ఈ దిశలు పాజిటివిటీ, శ్రేయస్సు వైపు చూపుతాయి. అలాగే పాత సంవత్సరం ముగిసిన వెంటనే పాత క్యాలెండర్‌ను తొలగించాలి. అలా చేయడం మర్చిపోతే అది భవిష్యత్తుకు ఆటంకం కలిగిస్తుంది. అంతేకాకుండా గదిలో చెరిగిపోయిన లేదా పాడైపోయిన,పాత క్యాలెండర్లు ఏవైనా ఉంటే వెంటనే వాటిని తొలగించండి. అవి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుందని వాస్తు నిపుణులు తెలిపారు.
గడియారం, క్యాలెండర్
క్యాలెండర్,గోడ గడియారాన్ని కలిపి ఉంచకూడదు. ఎందుకంటే ఇది సమయం, డబ్బు పరిమితిని సూచిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications