Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
Vastu: ఇంట్లో ఈ 5 పెయింటింగ్స్ ఉంటే.. డబ్బు ప్రవాహం, జీవితంలో సానుకూల మార్పులు
కేవలం ఇంటి నిర్మాణం అప్పుడు మాత్రమే వాస్తు(vastu) చూస్తారు అనుకుంటారు చాలామంది. అయితే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి, ఏ దిక్కున ఎలా పెట్టాలి అనేది కూడా వాస్తు శాస్త్రం తెలియజేస్తుంది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో రాంగ్ ప్లేస్ లో ఉంచే వస్తువులు ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయి. కాబట్టి ఇంట్లోని ప్రతి వస్తువును చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. చాలా మంది ఇంట్లో పెయింటింగ్స్ ఉంచడానికి ఇష్టపడతారు, ఇది ఇంటి వాతావరణాన్ని పాజిటివ్ గా లేదా సానుకూలంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి వాతావరణాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపడానికి, జీవితాన్ని మెరుగుపరచడానికి కొన్ని పెయింటింగ్స్(painings)ఇంట్లో ఉంచడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. మన జీవితంలో పాజిటివిటీని తీసుకురావడానికి సహాయపడే కొన్ని పెయింట్స్ ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ ని ఇంట్లో పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వచ్చే అవకాశమే ఉండదు. ముఖ్యంగా ఐదు పెయింటింగ్స్‌ను ఇంట్లో ఉంచడం వల్ల ఇంటి వాస్తు దోషం తగ్గుతుంది, జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.
ఆ 5 పెయింటింగ్స్ ఇవే
రైజింగ్ సన్ పెయింటింగ్(Rising sun painting)
వాస్తు ప్రకారం ఇంట్లో ఉదయించే సూర్యుని బొమ్మను ఉంచడం చాలా శ్రేయస్కరం. ఈ పెయింటింగ్ ఇంట్లో ఉంచడం వల్ల కుటుంబ సభ్యులలో సానుకూల శక్తి,ఆశ, ఉత్సాహం పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యం,సంతోషాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.

వాస్తు ప్రకారం శ్రీ కృష్ణుడు, రాధ,గోపికల పెయింటింగ్‌ను ఇంటి పూజా స్థలంలో లేదా డ్రాయింగ్ రూమ్‌లో ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, కుటుంబంలో శాంతి నెలకొంటుంది.
పరిగెత్తే గుర్రాల పెయింటింగ్(Running horses painting)
ఇంట్లో పరిగెత్తే గుర్రాల చిత్రాలను ఉంచడం వాస్తు ప్రకారం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వాస్తు ప్రకారం దక్షిణం వైపు పరుగెత్తే గుర్రం చిత్రం విజయం, ధైర్యాన్ని సూచిస్తుంది. ఇది జీవితంలో మెరుగుదలకు మార్గం తెరుస్తుంది.
జంట హంసల పెయింటింగ్(janta hamsalu painting)
జంట హంసలను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఇంట్లో ఒక జంట హంసల పెయింటింగ్ ఉంచడం వల్ల కుటుంబ సంబంధాలు మధురంగా ఉంటాయి. ఇది పడకగదిలో ఉంచడం విశేషంగా పరిగణించబడుతుంది. ఫలితంగా వైవాహిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
ప్రవహించే నది లేదా ఫౌంటెన్ పెయింటింగ్(fountain painting)
వాస్తు ప్రకారం ఇంట్లో ప్రవహించే నది లేదా ఫౌంటెన్ పెయింటింగ్ చాలా శుభప్రదం. ఇది ఇంటికి ఈశాన్య దిక్కున పెట్టాలి. ఇది నగదు ప్రవాహం, ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications