Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Vastu For Footwear: చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారా? అక్కడ పెట్టారంటే ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశం!
మనలో చాలా మందికి ఉండే ఒక సాధారణ అలవాటు ఏంటంటే.. బయటి నుండి ఇంటికి రాగానే బూట్లు, చెప్పులను ఎక్కడ పడితే అక్కడ వదిలేయడం. అయితే ఈ చిన్న పొరపాటే మీ ఇంట్లో పెద్ద సమస్యలకు కారణమవుతుందని మీకు తెలుసా? వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పులు,బూట్లను కరెక్ట్ ప్లేస్ లో పెట్టకపోతే అది ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానించి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, ఆర్థిక ఇబ్బందులు,మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. మీ ఇంటిని ఆనంద నిలయంగా మార్చాలంటే నాలుగు ప్లేస్ లలో చెప్పులను అస్సలు ఉంచకూడదు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇక్కడ చెప్పులు ఉంచకూడదు
బెడ్ రూమ్
రోజంతా అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోవడానికి మనం బెడ్ రూమ్ కి వస్తాం. అలాంటి పవిత్రమైన స్థలంలో ముఖ్యంగా మంచం కింద బూట్లు లేదా చెప్పులు ఉంచడం అత్యంత దోషపూరితం. వాటి నుండి వెలువడే ప్రతికూల శక్తి మీ నిద్రకు భంగం కలిగించడమే కాకుండా దంపతుల మధ్య అనవసరమైన గొడవలకు, మనస్పర్థలకు దారితీస్తుంది. ఇది వైవాహిక జీవితంలో తీవ్రమైన సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి పాదరక్షలను ఎప్పుడూ గది బయట, ఒక ప్రత్యేకమైన రాక్ లో ఉంచడం మంచిది.

వంటగది
వంటగదిని మనం అన్నపూర్ణాదేవి నిలయంగా భావిస్తాం. మనకు ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించే ఆహారం ఇక్కడే తయారవుతుంది. అలాంటి పవిత్రమైన స్థలంలోకి బయటి దుమ్ము, ధూళితో నిండిన చెప్పులను తీసుకురావడం అంటే మనమే స్వయంగా ప్రతికూలతను, అనారోగ్యాన్ని ఆహ్వానించినట్లే. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది, ధన నష్టానికి కూడా కారణమవుతుంది.
పూజా మందిరం
పూజా మందిరం ఇంట్లోనే అత్యంత పవిత్రమైన, సానుకూల శక్తి కేంద్రం. ఇక్కడ దేవతలు కొలువై ఉంటారు. పొరపాటున కూడా చెప్పులతో ఈ గదిలోకి ప్రవేశించడం మహా పాపంగా పరిగణిస్తారు. అలా చేయడం వల్ల మనసులో అనవసరమైన ఆందోళన, ఏకాగ్రత లోపించడం, మానసిక అశాంతి వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది దైవానుగ్రహానికి ఆటంకం కలిగిస్తుంది.
ప్రధాన ద్వారం
ఇంటి ప్రధాన ద్వారం నుండే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఆ ద్వారం ముందు బూట్లు, చెప్పులు గుట్టగా పోసి ఉంచితే అది లక్ష్మీదేవి మార్గానికి అడ్డుకట్ట వేసినట్లే అవుతుంది. ఇది ఇంట్లోకి వచ్చే ఐశ్వర్యాన్ని, శుభాలను అడ్డుకుంటుంది. కాబట్టి ప్రధాన ద్వారం ముందు ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పాదరక్షలను ద్వారానికి ప్రక్కగా, కనిపించకుండా ఒక మూలలో లేదా ఒక షూ క్యాబినెట్ లో సర్దాలి.

దిశల ప్రకారం చూస్తే
ఉత్తర,తూర్పు దిశల్లో చెప్పులు పెట్టకూడదు. ఈ దిశ లక్ష్మీదేవికి చెందినదిగా చెబుతారు కాబట్టి ఆ దిశల్లో పాదరక్షలను ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్ముతారు. అందుకే ఈ దిశల్లో పాదరక్షలు ఉంచేవాళ్లపై లక్ష్మీదేవి కోపంగా ఉంటదని వాస్తు పండితులు చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications